[dropcap]స[/dropcap]హజ సాంస్కృతిక సంస్థ, విజయనగరంలో మేడా మస్తాన్ రెడ్డి గారు రాసిన ‘స్పర్శ’ అనే పుస్తకాన్ని డా. కొచ్చర్లకోట జగదీష్ గారు ఆవిష్కరించారు.
సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రముఖ డి.వి.జి. శంకర్రావు గారు, ఆత్మీయ అతిథిగా విశాఖ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ అడపా రామకృష్ణ గారు విచ్చేసేరు.
కార్యక్రమం అంతా శ్రీ ఎన్. కె. బాబు, సంస్థ అధ్యక్షుల ఆధ్వర్యంలో చక్కగా జరిగింది.
‘స్పర్శ’ కథల సంపుటిని ప్రముఖ రచయిత, విద్యావేత్త, శాస్త్రవేత్త శ్రీ. డా. కె.జి. వేణు గారు సభకి పరిచయం చేస్తూ ప్రతి కథ గొప్పతనాన్ని ఆహుతులకు చక్కగా వివరించేరు. ప్రముఖ సాహితీవేత్తలు సభలో పాల్గొన్నారు.