[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. త్రిశంకుకు కృత్రిమ స్వర్గాన్ని సృష్టించి ఇచ్చిన తపోధనుడు (5) |
4. గౌరవించుట (5) |
7. వనసమూహము (2) |
8. ప్రత్యక్ష దైవాలు (5) |
10. పొడవైన అందమైన కళ్ళను ఇలా వర్ణిస్తారు (2) |
12. మొదలుపోయిన పతనము (3) |
14. శ్రీరాముడు కొలువై ఉన్న గొప్ప పుణ్య క్షేత్రం – ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో ఉంది (4) |
15. ఇవి కలకాలం ఉండవనేది ఓదార్పు మాట (4) |
16. శ్రీకృష్ణుని నివాస స్థలం – మోక్ష దాయక పురి – పూరి కాదు (3) |
17. అనితరము. ( 4) |
18. జక్కన పక్షి – ఈ పేరిట వాణిశ్రీ గారి సినిమా కూడా ఉంది (4) |
20. పాముల తల్లి (3) |
22. ఉన్నత పీఠము / సింహాసనము (2) |
23. వాడుక భాష మొదటలో కొద్దిగా చెదిరింది (5) |
24. సీతారామ లక్ష్మణులు ఈ బట్టలు ధరించి వనవాసానికి వెళ్లారట (2) |
27. తలుపు కి వేసే తాళం కాదు – డావరడంగి చెట్టు (5) |
28. సుదర్శనము / శతారము (5) |
నిలువు:
1.శ్రీమహావిష్ణువునకు అత్యంత ప్రీతిపాత్రురాలు (5) |
2. ఐక్యరాజ్య సమితికి హద్దుందా (2) |
3. కిందనించి పైకి నడుము కోల్పోయిన ముసలివాఁడు. (4) |
4. మతము కాని మతము అంగీకారమేనా? (4) |
5. మానవ ప్రయత్నం కొత్తది, తొమ్మిదవది (2) |
6. ఏడు లోకాలు కాదు లెక్క సరిగా చూడుమూ బాబూ (5) |
9. ‘వాణి నా రాణి’ అని దీటుగా చెప్పిన ప్రసిద్ద కవి – జైమినీ భారతం ఈయనే వ్రాసాడు. ఇంటిపేరు పిల్లలమఱ్ఱి.. .(7) |
11. ఐదు దుకాణములు కాదు ఐదు యుద్ధములూ కాదు -అవతారపురుషుని చేతిలో శంఖం (5) |
13. ఒక పిండివంట – పెరుగులో నానేసుకు తింటే ఇంకా బాగుంటుంది – మహాభారతంలో సమానంగా గౌరవింప బడుతుంది (5) |
17. ——అమ్మయినా పెట్టదు (5) |
19. పెళ్ళిలో వధూవరులను దీనిలో ఎక్కించి ఊరేగించేవారు (5) |
20. ఇంట్లోనూ హృదయంలోనూ ఉంటాయి (ఏక వచనంలో) (4) |
21. రాత్రి చెదిరిపోయింది (4) |
25. అమ్మనాన్ననో నాన్ననాన్ననో పిలవండి (2) |
26. ఆడ ఏనుగు (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మే 17వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 10 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 మే 22 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 8 జవాబులు:
అడ్డం:
1.మహాభారతము 4. కలయిక 8. స్రష్ట 9. నలువరాణి 11. వీణ 13. నరాలు 15. అధ్యాత్మం 16. ము లం ప ట 18. మిమిక్రీ 19. వీహారము 20. నిషద్య 21. సురుబ 24. గయ 25. వాగుడుకాయ 26. నగ 29. తంత్రవాది 30. కరిమాచలము
నిలువు:
1.మధుస్రవ 2. భాష్యం 3.తటాలున 5. లజ్జ 6. కళ్యాణమంటపం 7. ఏరాలు 10. వరాహమిహిరుడు 12. మధ్యాక్కరలు 14. కూలంకషము 17. దేవీభాగవతం 21.సుగుణం 22.బ కా దం రి 23. నిగమము 27. గోవా 28. వచ
సంచిక – పద ప్రతిభ 8 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు మోహనరావు
- ఎర్రోల్ల వెంకటరెడ్డి
- కోట శ్రీనివాసరావు
- మధు తల్లాప్రగడ
- పడమటి సుబ్బలక్ష్మి
- పి.వి. రాజు
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.