[dropcap]ఒం[/dropcap]టి మీద చినుగుల చొక్కా
కంటి కొనల నీటి చుక్క
కాలికి తెగిన చెప్పులు
డొక్కలో ఆకలి నిప్పులు
పూరి గుడిసె నివాసం
గంజి నీరు ఆహారం
మనిషిగా పుట్టినా
తోటి మనుషుల మధ్య
జీవం లేని ప్రయాణం
జేబులో లేవు కాసులు
గుండె నిండా విలువల ఊసులు
చేతనైన సాయం చేస్తాడు
తన బాధలెవరికీ చెప్పుకోడు
గుడికి ఎప్పుడూ వెళ్ళడు
దేవుడిని ఏమీ కోరడు
మనుషుల మధ్య పేదవాడు
మానవత్వంలో పెద్దవాడు