[dropcap]బి[/dropcap]క్కు బిక్కు మంటూ
బతికే జీవనం!
మదికి బరువేగా మరి
తేలికెట్లగును?
కనపడుతున్నా
ఆపలేనీ అరాచకం.
కనులకు కష్టమేగా మరి
తేలికెట్లగును?
చూస్తూ చూస్తూనే
తోడైపోయే, తుది అంకం
వెంటాడే వయసు బరువే గా మరి
తేలికెట్లగును?
తేలికెట్లగును మరి
తిమిరంలో మునకలేసిన
తికమక మది?
తేలికెట్లగును మరి
కన్నీటితో ఇంకిపోయిన
వ్యసనాల విధి.