నూతన పదసంచిక-14

0
9

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. వింత గోవు కాదు. నిద్రకు ముందు వచ్చేది. ఇక్కడ తడబడింది. (4)
4. అమరులైన వీరులకు శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత ఇలా గట్టిగా నినదిస్తారు (4)
7. ఇదో రకమైన తగువు. కొంత మన దుస్తుల్లో కనిపిస్తుంది. (5)
8. సావిత్రి కాదు.దీర్ఘం తీసేయండి. (2)
10. కరము లేని కత్తి (2)
11. మాహేంద్ర ని పిలిచారా! అటునుంచి  వస్తున్నాడు(3)
13.  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సుదర్శన్ పట్నాయక్ ఈ శిల్పి. (3)
14. ఇవి మన్నేనట. దేవదాసు నోట (3)
15. ఈ నిద్ర బావుంటుంది (3)
16.  దీన్ని కవ్వించకే అంటూ వేడుకుంది మాలినీ దేవి పండంటి కాపురం లో (3)
18.  తెలుగు నష్టం.కొంచెం తెల్లవాళ్ళ తేనె.(2)
21. మోహన రవళి లో ముఖము దాగి ఉంది(2)
22. ఇవి ఎనిమిది. అన్నీ బాధాకరమైనవే (5)
24. సాక్ష్యాలు చూపించడర్రా అంటే అటునుంచి చూపిస్తారేంటి? (4)
25. ఈ నీరు చాలా ప్రమాదకరం (4)

నిలువు:

1. శివభక్తుడు(4)
2.  నాలుగు కోసుల దూరాన్ని తగ్గించు (2)
3.  కిందనుంచి పొట్టిది కానిది పైకి వచ్చింది.(3)
4.  మొదటక్షరం అ అయినా ఆ అయినా ప్రేమే(3)
5.  పాపం పిపీలకం తిరగబడింది (2)
6.  పూర్వపు సినిమాల్లో బీద తల్లి పాత్రల్లో ఈవిడే కనిపించేది (4)
9.  బిలం కాదు. మూడవస్థల వేల్పు. (5)
10. నమస్కారం అలా కొంత కిందా కొంత మీదా పెట్టడం తగునా (5)
12.  వీటిని చూడమన్నాడు శ్రీ శ్రీ. (3)
15.  వీళ్ళు ఊరకే‌ రారట (4)
17.  మనసారా కంద పద్యం చదవండి.ఒక దుంపని  కనుగొనండి. (4)
19.  తెల్లవాడి సోదరి. మన తెలుగు వాళ్ళే ఎక్కువగా అనేది. (3)
20. సదాచారం కొంతమేర వరకే (3)
22. అప్పల్రాజు లో చంద్రుడు. ఇక్కడ డు లేదు (2)
23.  ధర లేని బయలు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జూన్ 14 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 14 పూరణ‘ అని వ్రాయాలి.  గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూన్ 19 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 12 జవాబులు:

అడ్డం:   

1.కొంగజపం‌ 4. మరచెంబు‌ 7.  నంది ని పంది 8.  చీకా‌ 10. శిబు 11. పులుసు 13. కావడి‌ 14. మాజీలు‌ 15. చెలిమి 16. తామిఅ‌ 18. దాన‌ 21. నిఘా‌ 22. వేకువజాము‌ 24. ముష్టికుడు‌ 25. యిరాషాము‌

నిలువు:

1.కొండచీపు‌ 2. జనం‌ 3.  పందిట్లో ‌ 4.  మపంచ‌ 5.  రది‌ 6.  బుడిబుడి 9.  కాలుకాలిన‌ 10. శివకామిని‌ 12. కంజీర‌ 15. చెదారము‌ 17. అఘాతము‌ 19.  పాకుడు ‌ 20. సంజాయి‌ 22. వేకు‌ 23.  మురా‌

నూతన పదసంచిక 12 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అన్నపూర్ణ భవాని
  • అరుణరేఖ ముదిగొండ
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రోల్ల వెంకటరెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • కృష్ణ విరజ
  • లలిత మల్లాది
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • ఎం. అన్నపూర్ణ
  • ఎమ్మెస్వీ గంగరాజు
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పార్వతి వేదుల
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఆర్.మూర్తి
  • పి.వి.ఎన్. కృష్ణ శర్మ
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • సూర్యకుమారి మానుకొండ డా.
  • శాంత మాధవపెద్ది
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వెంకాయమ్మ టి
  • వీణ మునిపల్లి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here