[dropcap]రై[/dropcap]తు భుజముపై ఆసీనవై
పొలమునకు ఏగెదవు నీవు
కన్నబిడ్డ వలె నిను ఎదకు హత్తుకొని
మూపున ఎత్తుకొను కర్షకుడు
పుడమి తల్లిని ముద్దిడినట్టు
సుతారముగా సేద్యము చేసి
హలము కలముతో కర్షకుడు
సేద్య సాహిత్యము పండించు
జనుల ఆకలి తీర్చు నాగలి
అక్షయ పాత్రకు అన్నవు నీవు
అన్నమునిచ్చు అమ్మవు నీవు
ఓ నాగలీ నీకిదే నమస్సుమాంజలి