సంచిక – పద ప్రతిభ – 15

0
4

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. గీర ఉన్న ఒక తెలుగు సంవత్సరం (4)
4. కావేరినది – ఈవిడ సగం గంగాదేవియేనట (4)
8. నక్షత్రము (2)
9. పదమూడేండ్ల చిరు ప్రాయమునాడే త్యాగరాజు ‘నమో నమో రాఘవా’ అనే కీర్తనను ఈ రాగం లోనే స్వరపరిచారు (5)
11. శరీరము (2)
13. రాలు చేరిస్తే మా డీటెయిల్స్ తెలుస్తాయి – కాకపోతే అటునుండి చదువుకోండి (3)
15. గొడుగు రివర్సులో పట్టుకున్నట్టున్నారు (4)
17. పటమునందు వ్రాసిన రూపము (4)
18. మువ్వ గోపాల పదాలు రచించిన వాగ్గేయకారుడు (7)
19. మోయడానికి, దున్నడానికి సరిపడే వయసున్న కోడె (4)
20. మౌర్ఖ్యము – గారము చేస్తే ఉన్న ది కూడా పోయింది (4)
22.  రాయలసీమ వారి నవ్వ (3)
24. భూమి (2)
25. పొద్దు పొడుపు (5)
26. పశు సమూహము (2)
29. ఈ పేరుతొ కనీసం 5 సార్లు సినిమాలు నిర్మించారు _ తెలుగులో 3 సార్లు, హిందీలో ఒకసారి, ఇంకా బెంగాలీ భాషలో కూడా! పూజ అని అర్థం  (4)
30. మెషిన్ తో రక్షణము (4)

నిలువు:

2. ‘వే వేల గోపెమ్మల మువ్వగోపాలుడే’ అంటూ కమలహాసన్ తో కలిసి డాన్స్ చేసిన ఒకప్పటి అందాల నటి (2)
3. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. తెలంగాణకు చెందిన తెలుగు, ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు. వీరింటిపేరు సామల  (4)
4  ———సద్గమయ  (4)
5. చందనము (2)
6. పాదయాత్ర కాదండి – ఒకానొక కులపర్వతం (4)
7. తనకుతానే పుట్టిన: బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరైనా గావచ్చు (4)
10. కేసరి గృహలక్ష్మి స్వర్ణకంకణం అందుకున్న కాంచనపల్లి కనకమ్మ గారి బిరుదు (7)
12. ప్రయాస పడు (5)
14. భర్త తల్లికి గౌరవ వాచకం (5)
16. సాపాటుని అపహరణం చేసారా? (3)
17.  అడ్డం 17లో లో ఉన్నట్టిదే – విడ్డూరంగా (3)
19. వినడానికి 7 నిలువులాగే ఉంటుంది -వానాకాలంలో వీటి బెకబెకలు బాగా వినిపిస్తాయి (4)
21. ఎర్ర తామర (4)
22. ధృతరాష్ట్రుడి పెద్ద కొడుకు- ప్రథమావిభక్తి లేకుండా (4)
23. కనికరించదగినది (4)
27. సంపూర్ణమైనది – హిందీలో ఉర్దూలో కూడా ఇదే పదం (2)
28. నేర్పరి/ సమర్థురాలు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జూన్ 21వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 15 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూన్ 26 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 13 జవాబులు:

అడ్డం:   

1.హంసధ్వని 4. అభిలాష 8. తమ్మి 9. దేవదేవుడు 11. యవ 13. మువలు 15. ర్తివమస  17. పిక్కబలం 18. పార్వతీనందనుడు 19. నినాదము 20. పన్నాగము 22. తానులో 24. ఘర్మం  25. కు ర డు క ట / ట ర డు క కు  26. మున్నా 29. చంద్రకళ  30. భట్టుమూర్తి

నిలువు:

2.సఖి 3. నిరవము 4. అడవులు 5. లాక 6.శ్రుతకీర్తి 7.దైవబలం 10. దేవకీనందనుడు 12. రామపాదము 14. ఒక్కడున్నాడు 16. సర్వము 17. పినుప 19. నిదాఘము 21.ముగన్నాపు 22. తారకళ 23. లోకసభ 27. ముద్ర 28. రామూ

సంచిక – పద ప్రతిభ 13 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహన్ రావు
  • ఎర్రోల్ల వెంకటరెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పి.వి.ఆర్. మూర్తి
  • ప్రవీణ డా.
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here