[dropcap]అ[/dropcap]నుబంధాలకు పే…ద్ద చెరువు గట్టు
ఆర్తి గా చూసే ఇంటి చి…న్ని మెట్టు
రక్తసంబంధంలా ఊడలు అల్లిన మర్రిచెట్టు
విలువైన జీవితంలా నిలిచిన వేప చెట్టు
చెరువు నుండి వచ్చే సూరీడు మన చుట్టం
చెలి చుక్కలతో వచ్చే రేరేడూ మన చుట్టం
చెరువు నీటికి వచ్చే వయ్యారాలు స్పష్టం
చెక్కర్లు కొట్టే పిట్ట యవ్వారాలు చూడకుంటే నష్టం
ఆవకాయ తో ఎర్రని తొలి ముద్ద ఇష్టం
చల్లతో చల్లగా చూసే మలిముద్ద ఇంకా ఇష్టం
పగలైనా రేయైయినా సమయం వదిలి పెట్టం
ప్రతి చి…న్న జ్ఞాపకానికి మనసున కడతాం పట్టం.
(బాల్యం లో మేము గడిపిన ఊరి జ్ఞాపకాలు)