[dropcap]ఓ[/dropcap] రాత్రి
ఒంటరిగా రహస్యంగా
నన్ను ఓ నిజం
నిలదీసింది.
ప్రేమను ప్రేమిస్తున్నావా అని….
అబద్ధం చెప్పడం చేతకాదని తెలిసి
జాలిపడి…
నిన్ను నాకు పరిచయం చేసింది..
మల్లెతీగలా అల్లుకున్న
నిన్ను చూసి గర్వపడుతూ…
నీ గుబాళింపు మాటలకు బానిసై
నీ పాదాలను
నా చూపులతో కడుగుతూ
నా మనసును అంకితమిస్తున్నా…..