[dropcap]పొ[/dropcap]ద్దున్నే లేవగానే సూర్యుని లేలేత కిరణాలు
మా వంట ఇంటి కిటికి గుండా
ఎర్రని రంగుల వెలుగులా ప్రకాశిస్తూ
నా మీద పడి
ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తు
నన్ను ఆశీర్వదిస్తు
నాకు ఎంతో ఆనందాన్ని కలిగించే
నా మనసు ఉల్లాసంగా పొంగే
అడగంది అమ్మ అయిన అన్నం పెట్టదు అంటారు కదా
అడగకుండానే నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించే
సూర్య భగవానుడా
ఏమి ఇచ్చి తీర్చుకోవాలి
నీ ఋణం
మనస్ఫూర్తిగా ఒక నమస్కారం తప్ప
అదే నా సంస్కారం కదా