[dropcap]రై[/dropcap]లు కథలు, దేశభక్తి కథలు, తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, క్రీడాకథ, కులం కథ వంటి విశిష్టమయిన కథల సంకలనాల తరువాత, …. సంచిక-సాహితీ ప్రచురణలు సంయుక్తంగా తయారు చేస్తున్న సరికొత్త కథల సంకలనం, తెలుగులో తొలిసారిగా , రామకథల సంకలనం, ‘రామకథాసుధ‘ కథా సంకలనం.
రామాయణాన్ని అర్థం చేసుకుని, రామాయణంలోని పాత్రల వ్యక్తిత్వాలను అవగాహన చేసుకుని, రామాయణంలో పొందుపరచిన సార్వజనీన సత్యాలను జీర్ణించుకుని.. తాము గ్రహించిన సత్యాలను ఆసక్తికరమయిన కథల రూపంలో ఆవిష్కరించే రచనలకు ఆహ్వానం…
మనల్ని మనం దూషించుకుని తక్కువ చేసుకోవటం గొప్పకాదు… మనల్ని మనం అర్థం చేసుకోవటం విజ్ఞత….
రామాయణ రహస్యాలను విప్పి చెప్పే ఈ కథల సంకలనం 2022 దీపావళికి వెలువడుతుంది.
ఈ సంకలనంలో గతంలో ప్రచురితమయిన కథలతో పాటూ ఎంపిక చేసిన కొత్తగా రాసిన కథలు కూడా వుంటాయి.
రామాయణం ఆధారంగా కథలు రాయండి. సంకలనంలో స్థానం సంపాదించండి.
రామకథాసుధ
సంకలన కర్త: కస్తూరి మురళీకృష్ణ
కథలు అందవలసిన చివరి తేదీ – సెప్టెంబర్ 30, 2022.
నిడివి పరిమితి లేదు.
కథలను kmkp2025@gmail.com అనే ఈమెయిల్‍కు పంపవచ్చు. పోస్టు ద్వారా/కొరియర్ ద్వారా అయితే ప్లాట్ నంబర్ 32, హౌస్ నంబర్ 8-48, రఘురాం నగర్ కాలనీ, ఆదిత్య హాస్పటల్ లేన్, దమ్మాయిగూడా, హైదరాబాద్-83 కు పంపాలి. వివరాలకు ఫోను 9849617392 ను సంప్రదించండి.
కొత్తగా వ్రాసి పంపిన ప్రతి కథ సంచికలో ప్రచురితమవుతుంది.