గాంధీజీ -మొగ్గలు

0
4

[dropcap]సా[/dropcap]ధారణ జీవితం గడుపుతూనే
భారతీయుల మదిలో మహాత్ముడయ్యాడు
నిరాడంబర, నిగర్వి గాంధీజీ

దేశ స్వతంత్రం కోసం తన సుఖాన్ని త్యజిస్తూనే
అందరిని ఒకే త్రాటిపై నిలిపిన ధీశాలి
సహన, నిస్వార్థపరుడు గాంధీజీ

స్వదేశీ సంప్రదాయాలను అనుసరిస్తూనే
విదేశీ వస్తువులను బహిష్కరించిన కార్యవాది
శాంతి, పట్టుదల వీరుడు గాంధీజీ

శాంతి మార్గమునే తన ఆయుధంగా చేసుకుని
కోట్ల భారతీయుల కలల సాకారం చేసాడు
స్వేచ్ఛ, స్వతంత్రంకై పోరాడిన యోధుడు గాంధీజీ

సత్య పరిపాలన కోసం నిరంతరం శ్రమిస్తూనే
ఎన్నో ఉద్యమాలను నడిపించిన సారథి
నవీన సత్య హరిశ్చంద్రుడు గాంధీజీ

అహింసా మార్గమే ఊపిరిగా మలచుకుని
ఎందరో నాయకులకు స్పూర్తినిచ్చినవాడు
భారత జాతి గర్వించదగ్గ పిత గాంధీజీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here