‘శబ్ద్‌ కే పరే’ గ్రంథావిష్కరణ సభ – ఆహ్వానం – ప్రెస్ నోట్

0
3

[dropcap]ఆం[/dropcap]ధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేది ఆదివారం సాయంత్రం 5 గంటలకు డా. వి. వెంకటేశ్వర గారి హిందీ హైకూ ‘శబ్ద్‌ కే పరే’ ఆవిష్కరణ సభ జరుగనున్నది.

ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య అధ్యక్షతన జరిగే ఈ సభలో ప్రముఖ సాహితీవేత్త డా. గుమ్మా సాంబశివరావు గారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. పేరిశెట్టి శ్రీనివాసరావు గారు పుస్తక సమీక్ష చేస్తారు.

అనంతరం రచయిత శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర గారి స్పందన ఉంటుంది.

తేదీ: 10 జూలై 2022 ఆదివారం సాయంత్రం 5 గంటలకు

వేదిక: జూమ్ అంతర్జాల వేదిక. ఐడి. 8828810417. పాస్‌వర్డ్ 123456

కనుక ఈ సభలో పాల్గొనవల్సిందిగా సాహితీప్రియులను ఆహ్వానిస్తున్నాము.

 

– చలపాక ప్రకాష్, ప్రధాన కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్రచయితల సంఘం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here