కొరియానం – A Journey Through Korean Cinema-20

0
4

న హి నిమ్బాత్ స్రవేత్ క్షౌద్రమ్

[dropcap]W[/dropcap]hen people spend their hard-earned money on a movie at the end of a long work week, all they ask is that their local critic steer them toward the good ones and help them avoid the turkeys head/unwatchable ones). It’s not too much to ask. And it’s a fairly simple job, once you grasp it. You get to go to a movie first, before anyone else, and then come back and tell everybody about it. You even get to trash it if you didn’t like it. What you don’t get to do is grind on and on, month after month, after the audience has rendered its verdict in the most resounding of terms, telling everybody why the filmgoers are wrong and you are right.

Kenneth Turan… కెనెత్ టరాన్. లాస్ ఏంజలిస్ టైమ్స్‌కు కొన్ని దశాబ్దాలు రాసిన ప్రముఖ సినీ విమర్శకుడు. టైటనిక్ సినిమా అతనికి నచ్చలేదు. సినిమాకు నెగటివ్ రివ్యూ ఇచ్చాడు. కానీ జనం మెచ్చారు.

“జనం మెచ్చిన సినిమాలు బాగా ఆడతాయి. తీసిన వారికి డబ్బులు తెస్తాయి. మరో సినిమా వచ్చేందుకు పెట్టుబడి తీసుకువస్తాయి. ఇవన్నీ తెచ్చిన సినిమా మంచి సినిమా కాదని ఒకరో, వందల్లోనో విమర్శకులు అన్నా, ఏవో కొన్ని సందర్భాలలో తప్ప అది ఖచ్చితంగా చెప్పుకోదగ్గ సినిమానే. అది కాల పరీక్షకు నిలబడవచ్చు. లేకపోవచ్చు. కానీ, ఆ సినిమా ఆడిన కాలానికి అది మంచి సినిమానో, జనం మెచ్చిన సినిమానో అని అంగీకరించాలి.”

ఈ మాటలన్నది పూర్వాశ్రమంలో సినీ విమర్శకునిగా అత్యున్నత స్థాయి అందుకున్న సినీ దర్శకుడు పార్క్ చాన్-వుక్.

ఇలా కాకుండా టరాన్ ఆ సినిమా మీద విషం కక్కుతూ విపరీత విమర్శలు చేస్తూ అసలు జేమ్స్ కామరాన్ ఒక రచయితే కాదని, అతనికి డైలాగ్స్ రాయటమే రాదని, ఏదో ఫ్లూక్ లో పాతతరం క్లాసిక్స్‌కు సస్తీ కాపీగా వచ్చిన టైటనిక్ లాంటి సినిమాలు ఇంతలా ఆడుతున్నాయంటే హాలీవుడ్ సినిమాల standard ఎంత ఘోరంగా పడిపోయిందో తెలుస్తుందని రాస్తూ పోయాడు. చివరికి చిర్రెత్తుకువచ్చి, కామరాన్ లాస్ ఏంజలిస్‌కు మెయిల్ చేశాడు. అందులో భాగమే ఆ పైన ఇచ్చిన ఇంగ్లీషు text.

విచిత్రమేమిటంటే 1997లో చాలా గొప్ప కమర్షియల్ విజయాలందుకుంది హాలీవుడ్. టైటనిక్ కాకుండా The Lost World: Jurassic Park, Men In Black, Tomorrow Never Dies, As Good As It Gets, Air Force One, Face/Off… లిస్టు చాలానే ఉంది. వీటిలో చాలా సినిమాలు ఆ యా జాన్రాలలో గొప్ప సినిమాలే. ఇప్పుడు చూసినా కూడా అవి అప్పుడు చూసిన అనుభూతిని కలిగించే సినిమాలే. అంటే కాల పరీక్షకు కూడా తట్టుకుని నిలిచిన చలన చిత్రరాజాలవి. సరే! ఆ ఒక్క సంవత్సరం ఏదో fluke అనుకున్నా, అంతకు మూడేళ్ళ ముందే నాలుగు గొప్పన్నర సినిమాలు వచ్చాయి. Pulp Fiction, Forrest Gump, The Shawshank Redemption, The Lion King… వీటిలో ఏవి తక్కువ స్థాయి సినిమాలు? మరి హాలీవుడ్ సినిమాల స్థాయి ఎక్కడ పడిపోయింది?

టరాన్ ఎజండా వేరు. కాదనుకుంటే అసలు 1990లలో హాలీవుడ్ నుంచీ వచ్చిన సినిమాలను పైపైన పరిశీలించినా 1990 can be termed a golden age of modern cinema which gave two future stalwarts like Chris Nolan and Quentin Tarantino. ఇద్దరు ఆ దశాబ్దంలో క్లాసిక్స్‌గా గుర్తింపు పొందిన సినిమాలు తీసినవారే.

కేవలం జేమ్స్ కామరాన్ అనే ఒక వ్యక్తి సాధిస్తున్న తిరుగులేని విజయాల మీద అసూయతో, అతన్ని తక్కువ చేసి చూపలేమని, విజయ పరంపరను అడ్డుకోలేమని అక్కసుతో ఏదో వంకన ఏదో పేరు పెట్టి విమర్శించటమే.

సరిగ్గా అటువంటి విమర్శలే రాంగ్జాంగ్ మీద కూడా వచ్చాయి. దానికి సరైన సమాధానాలను దర్శక ద్వయం పిశాంతనకున్, హాంగ్-జిన్ ఇచ్చారు. అంతే కాకుండా సినిమాలో మరో కోణాన్ని గురించి కూడా తెలియజేశారు. ఆ కోణం కూడా చాలా obvious గా కళ్ళముందు కనిపిస్తూనే ఉంటుంది కానీ, షెర్లాక్ హోమ్స్ చెప్పినట్లుగా జనం మిస్ అవుతారు.

సినీ దర్శకుడు, విమర్శకుడు, యాక్టివిస్ట్‌గా గుర్తింపు పొందిన మిత్రుడు మహేశ్ కత్తి సాహిత్యం గురించి చెప్పిన మాటలను సినిమాకు అన్వయిస్తే…

<<దర్శకుడు తీయాలనికున్నది తీస్తే, చూడాలనుకున్న ప్రేక్షకుడు అదే అర్థంతోనో లేక ఇంచుమించు intended interpretation తోనో చూస్తాడు. ఆ ప్రేక్షకులు పదిమందైనా, వందమందైనా, కోట్ల మందైనా జరిగేది ఇదే. కానీ ఎప్పుడైతే దర్శకుని ఉద్దేశం ‘తాను చెప్పలనుకున్నది’ కాక ‘పాఠకులకు తెలియజెప్పాలనుకున్నది’ అవుతుందో లేక విమర్శకులకు ‘ఏది నచ్చుతుంది’ అవుతుందో అప్పుడొస్తుంది తంటా. ప్రస్తుతం (2016 – ) వస్తున్న సినిమాలు కూడా మొత్తం ఈ ప్రాథమిక సమస్య చుట్టూనే అల్లుకుంటున్నాయి.

ఇందులో ఆరితేరిన విమర్శకుల పాత్ర మరీ ఆసక్తికరం (హాస్యాస్పదం అందామనుకున్నాను). ఎలాంటి సినిమా తీయాలో, దాని శైలి, శిల్పం, వస్తువు,కథనం ఎలా ఉండాలో నిర్ణయించేస్తారు. ఆ నిర్ణయాధికారం భూ(బూ)తజ్ఞానంతో తెచ్చుకుని, వర్తమానాన్ని నిర్దేశించి భవిష్యత్తు లేకుండా చెయ్యడంలో వీరు దిట్ట. ఒక మూసను మీరితే ఇది “సినిమా కాదు”, “మంచి సినిమా కాదు”, “గొప్ప సినిమా కాదు” అంటూ తీర్మానాలు చేసేస్తారు.>>

ఇకపోతే, దర్శకులు చెప్పిన కోణమే కాకుండా రాంగ్జాంగ్ గురించి మరో గొప్ప విషయం చెప్పాలి. ఈమధ్యనే మరోసారి చూస్తుంటే నాకు తట్టింది. దాన్ని నా స్నేహితులతో డిస్కస్ చేసి… చాలా వివరాలు సేకరించాను. మరింత మధిస్తే గొప్ప సత్యం ఆవిష్కరింపబడే అవకాశం ఉంది. వాటి గురించి ముందు ముందు చూద్దాం. టైమ్ రావాలి కదా.

ఈలోగా కాస్త బ్రేక్ తీసుకుని 2021 నుంచీ మన అసలు టైమ్ లైన్ అయిన ఒక దశాబ్దం క్రితానికి వెళ్దాం.

Chapter 18

2011 రెండవ అర్థభాగం.

సకల జనుల సమ్మె తదనంతర పరిణామాలలో తెలుగు స్టార్ హీరోల సినిమాలు తక్కువగా విడుదల అయ్యాయి, వచ్చిన సినిమాలు కూడా చాలా వరకూ డబ్బింగ్‌వే. విజయాలు సాధించినవి కూడా ఎక్కువగా అవే. సరిగ్గా అలాంటి సమయంలో ఒక మహేశ్ బాబు పోస్టర్ ఫేస్బుక్‌లో నా కళ్ళబడింది. నేను అప్పుడప్పుడే సోషల్ మీడియాను ఉపయోగించటం నేర్చుకుంటున్న రోజులు. ఆ పోస్టర్ దూకుడు సినిమా ప్రొమోషన్లలో భాగం. అప్పటికి కొన్ని నెలల తరువాత ఆ సినిమా వచ్చి పెద్ద విజయం సాధించింది.

ఆ పోస్టర్ చూస్తే ఎక్కడో… ఇంకెక్కడో చూసిన ఙ్ఞాపకం. ఎక్కడా? అనుకుంటూ బుర్రను గిలక్కొడితే Oldboy సినిమా లో ఒక సీన్ గుర్తొచ్చింది. ఈ కింది ఫొటోను చూడండి.

రిఫరెన్స్, కాపీ, ఇలాంటివి పక్కన పెడితే (అప్పట్లో రకరకాల రియాక్షన్లు కలిగాయి. అవి అనవసరం), నాకొక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన కూడా దూకుడు రిలీజయ్యాక. రిలీజైనప్పుడు ఆ సినిమాకు నేను నెగటివ్ రివ్యూ రాశాను నవతరంగం కోసం.

Goodbye Lenin అనే సినిమా కాన్సెప్ట్‌ను కాపీ కొట్టటం, నా అప్పటి మూడ్‌కు చిరాకు తెప్పించే కథనం, కొత్తగా Screenplay and Structure నేర్చుకుంటున్న నాకు నేర్చుకుంటున్న దానికి విరుద్ధంగా ఉన్న screenplay style, లేశమాత్రంగానైనా కొందరు సినీ యాక్టివిస్టుల ప్రభావం వల్ల నాలో కలుగుతున్న డాక్టర్డ్-ఆలోచనలు…

వీటన్నిటి వల్ల ఆ సినిమాను నేనొకరీతిలో అపార్థం చేసుకున్నాను. అది జనాలకు ఎందుకు అంత నచ్చి మహేశ్ కెరియర్లోనే గొప్ప హిట్లలో ఒకటిగా నిలవటమే కాక ఇప్పటికీ చాలామందికి నచ్చే సినిమాగా ఎందుకు నిలిచిందో అర్థం చేసుకునేంత మెచూరిటీ అలవడలేదు. అందువల్ల అంత scathing review. కానీ ఎందుకో దాన్ని ప్రచురించకుండా డిలీట్ చేసి పడేశాను.

అప్పుడు నా ఆక్రోశం ఏమిటంటే మహేశ్ లాంటి నటుడితో తీయాల్సిన స్థాయి సినిమాలు మనవాళ్ళు తీస్తున్నారా అని. ఎందుకు తీయటం లేదు అని. అప్పుడే ఆ పైన చెప్పుకున్న పోస్టర్ మరోసారి గుర్తుకు వచ్చింది. అప్పుడే కలిగిన ఆలోచన…

మహేశ్‌తో Oldboy remake చేస్తే?

సరే!

బాగుంది. ఏ పాత్రకు మహేశ్? Choi Min-sik? Yoo Ji-tae?

ఓ డే-సు గానా? వు-జిన్ పాత్రలోనా?

పోస్టర్ చూశాక మీకు ఆల్రెడీ మహేశ్ చేయాల్సిన, చేయదగిన పాత్ర తెలిసిపోయే ఉంటుంది. మరి రెండవ పాత్ర ఎవరు చేయాలి?

అందుకే Oldboy లాంటి ultra-classic ను రీమేక్ చేయకూడదు. ఆ ఆలోచన చేస్తేనే కళ్ళు పోతాయి. ఈ డైలమాలో నేను ఉన్న సమయంలోనే ఉద్దండుడైన హాలీవుడ్ దర్శకుడు Spike Lee హాలీవుడ్ రీమేక్ మొదలుపెట్టాడు.

కానీ, మహేశ్, Oldboy… ఒక fascinating combination అనిపించింది. ఆ ఆలోచన అలా కొనసాగుతూనే ఉంది. కానీ, రెండో పాత్రకు నటుడుగా ఎవరు సెట్ అవుతారన్నది నాకు ఇంకా తట్టలేదు.

ఈలోగా 2013 రానే వచ్చింది. Spike Lee వెలగబెట్టిన హాలీవుడ్ రీమేక్ చూడనే చూశాం. కొన్ని సినిమాల రీమేకుల్ని అస్సలు ఆలోచన కూడా చేయకూడదు అనిపించింది.

కాలం మరో సంవత్సరం ముందుకు జరిగి 1:నేనొక్కడినే విడుదలైంది. సినిమా ఫ్లాప్. మహేశ్ దాదాపు ప్రయోగాలు మానేశాడు. మరో సంవత్సరం తుర్ అంది. 2015.

బాహుబలితో రాజమౌళి తెలుగు సినిమా పరిధి పెంచాడు. మహేశ్ తన మూసలో పడటం ప్రారంభించాడు – శ్రీమంతుడుతో.

Clock didn’t stop ticking. తెలుగు సినిమాకు 2016లో మహేశ్ బ్రహ్మోత్సవం ఇచ్చాడు. మరోవైపు పెళ్ళి చూపులు లాంటి సినిమాలతో చిన్నసైజు విప్లవం ప్రారంభమైంది.

2017! మహేశ్ స్పైడర్‌గా భయపెట్టాడు. దానికి ముందు బాహుబలి 2 దిగంతాలు దాటించింది తెలుగు సినిమాను. అర్జున్ రెడ్డి కూడా రంగంలోకి దిగాడు. సరిగ్గా అప్పుడే…

పుష్కర్-గాయత్రి తెలిశారు.

విక్రమ్-వేధా రిలీజై సంచలనం సృష్టించింది. నాలో మళ్ళీ Oldboy ఆలోచన. రెండో పాత్రకు కావలసిన నటుడే కాదు, తెలుగు/తమిళ భాషలలో Oldboy తీయగలిగిన సత్తా ఉన్న filmmaker(s) కూడా దొరికారు.

Welcome Mr. Cinema Vijay Sethupathi!

(సశేషం)

వచ్చేవారం దాకా తెలుగువాళ్ళందరం ఇంగ్లీషులోనే మాట్లాడదాం 😀

  1. S.: Kenneth Turan is a legendary film critic who was hailed by Hollywood Reporter as: “arguably the most widely read film critic in the town most associated with the making of movies (L. A.)”. No disrespect intended. The above photo is just to suit the current narrative of కొరియానం. Personally I go with Park Chan-wook’s views and hence Cameron’s.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here