[dropcap]చి[/dropcap]న్న చిన్న వ్యథలు
మనకున్న బాధలు
గోరంతలే ఉంది కదా
భరించేద్దాం సహించేద్దాం
మధ్య తరగతి మనుషుల
మనసులలో వెతలు ఇవి
వెతల కొరకు వెతుకులాట
అవసరమే లేదు వీరికి
అవెప్పుడూ పంచభూతాల్లా
వారి చుట్టూ తిరుగుతునే ఉంటాయి
గోటితో పోయేదానికి
గొడ్డలెందుకని ఉపేక్షిస్తే
గోరుచుట్టై రోకలి పోటై
బాదేస్తుంది బాధిస్తుంది
చిన్న పాముకైనా పెద్ద కర్ర
చిన్న గోరుకైనా పెద్ద గొడ్డలి
చిన్న కష్టానికైనా పెద్ద ప్రయత్నం
చేస్తేనే బతుకుతావ్ బట్ట కడతావ్