[dropcap]’న[/dropcap]వ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం’ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేది ఆదివారం ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని ప్రెస్ క్లబ్‌లో ‘మేం అడగాలా’ పుస్తకం ఆవిష్కరణ సభ జరుగనున్నది.
నరసం రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆదుర్తి సుహాసినీ విఠల్ సభకి ఆహ్వానం పలుకుతారు.
నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు శ్రీమతి తేళ్ల అరుణ సభాధ్యక్షత వహిస్తారు.
కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ గుత్తికొండ సుబ్బారావు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
ప్రముఖ సాహితీవేత్త శ్రీ గుమ్మా సాంబశివరావు పుస్తక సమీక్ష చేస్తారు. ముఖ్య అతిథులుగా, విశిష్ట అతిథులుగా ప్రముఖులు పాల్గొంటున్న ఈ సభకు అందరూ ఆహ్వానితులే.