సంచిక – పద ప్రతిభ – 20

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1.  జననీ జన్మభూమిశ్చ….. అన్నదెవరు (6)
6. తామర పూవు (2)
8. నాటక భేదము (3)
10. నక్షత్రము (2)
13. బ్రహ్మ (2)
14. రాముడికి సీత ఏమవుతుంది? గ్రంథ రచయిత ఎవరు? (3)
16. కొద్దిపాటిగానుండునది (3)
18. అంతం లేని కౌతుకము (3)
19. చివర బరువెక్కిన వీణ (3)
20. ఇది పెరుమాళ్ళకే ఎరుకట!  (3)
21. ప్రియుడన్నా ప్రియురాలన్నా ఒకటే (3)
22. ఆజ్ఞ అలా తడబడుతూ ఇస్తావేం? (3)
23. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ (3)
24. హిందీ మొదలగునవి (3)
25. ఎందాకా ఎందాకా ఎందాకా అని జమున అడిగితె ఎన్టీఆర్ చెప్పిన జవాబు అటునుంచి చెప్పుకు రండి – ఒక్కసారి చాలు లెండి! (3)
26. అటునుండి చూసినా సంతోషమే కనిపిస్తోంది (3)
28. అబ్బా -ఎక్కాలు గాదండీ చొక్కాలు (3)
30. బొగ్గు యొక్క పారదర్శిక స్ఫటికరూపము (2)
32. తెలంగాణ మాండలికంలో స్థలం (2)
34. గర్వము (3)
37. కీర్తి (2)
38. 1996 లో కారా మాష్టారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెచ్చిన కథా సంకలనం (6)

నిలువు:

2. ఎఱుపు రంగు, ప్రేమ (2)
3. పార్వతి (2)
4. పారిజాత వృక్షము (3)
5. ప్రథమా విభక్తిలో సగమే కనిపిస్తోంది (2)
6. సూర్యుడు/చంద్రుడు (2)
7. ఇది చేసే కుక్క అది చేయదట! (9)
9. చెట్టుకి, గాలికీ ఉన్న సంబంధం ఎంతైతే అంత..(9)
11. గొప్ప ధ్వని (2)
12. చిగురు (2)
14. ఆహ్వానము కాదు హోమము (5)
15. ఘనస్థితినుండి ద్రవస్థితికి వచ్చు మార్పు (5)
16.  శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని భువనవిజయం లోని అష్ట దిగ్గజాలలో ఒకడైన రామభద్రకవి ఇంటిపేరు (5)
17. తర్పణములు (5)
27. జాలి (2)
29. పప్పులూ ఉప్పులూ దాచేది తలక్రిందులయింది (2)
31.  బల్లి (3)
33. తాడు – ఇది యముడి చేతిలో ఉంటే మూడినట్లే మరి (2)
34. పండు కానిది (2)
35. పూజల్లో వ్రతాల్లో ఆడువారు చేతికి కట్టుకునేది – క్రిందినుంచి పైకి (2)
36. కోతి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జూలై 26వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 20 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూలై 31 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 18 జవాబులు:

అడ్డం:   

1.పింగళి సూరన 6. ఇష్టి 8. కవట 10.గుడి  13. కాజా  14. మండువ   16. నేతాజీ  18. రివాజు  19. ధూర్జటి  20. వరిమ  21. నాల్గవ  22. భాగ్యశా  23. కామంధు  24. రుధిర  25. కలహ  26. డుములు  28. తంత్రము 30. పంతం 32. మీరా 34. మేనక  37. మాత  37. మేకవన్నెపులి

నిలువు:

2.గడ్డు 3. సూక 4. రవము 5. నట 6.ఇట్లు 7. టంగుటూరి ప్రకాశం పంతు 9. రాజా రామమోహనరాయ్ 11. పండు 12. తాతా 14. మంజునాధుడు 15. వధూవరులు 16. నేటిభారతం 17. జీవశాకము 27. ముక్తి 29. త్రయి 31. ఆనక  33.పిత  34. మేమే 35. కవ  36. కెంపు

సంచిక – పద ప్రతిభ 18 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ఎర్రోల్ల వెంకటరెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మణినాగేంద్రరావు బి
  • పి.వి.ఆర్. మూర్తి
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here