నూతన పదసంచిక-20

0
4

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. గొప్పవాడు చివరికి తగ్గాడు. (4)
4. మీ నాన్నగారి నాన్నగారి నాన్నగారి నాన్నగారు.దేవుడే. (4)
7. కొనే ప్రతివాడు దీని గురించే చూసేది (5)
8. అటు నుంచి చిల్లు పడింది. (2)
10. అటునుంచి ఎవరో గడ్డి తినేసారు.ఇది మిగిలింది. (2)
11. దొరగారి కొరడా రివర్స్ అయి తోక తిన్ననైంది‌. (3)
13. Invitees లో ఒకడు (3)
14. ఎన్నీయల్లో సిన్న దానికి ఇది సేయి సందమామ అన్నారు ఆరుద్ర గారు 1976 లో. (3)
15. కోటిని అంగుళి తో లెక్కించండి (3)
16. దొరగారి చిన్న గది. (3)
18. మొదట్లోనే మూగబోయిన గొంతులు (2)
21. ఈ వెర్రి అటునుంచి వచ్చింది (2)
22. గోదావరి జిల్లాల్లో దొరికే గుడము (jaggery) (5)
24.పరిహాసం అంత డొంకతిరుగుడు గా చెయ్యాలా (4)
25. మూడు భగణాలు లేని ఉత్పలమాల పాదం (4)

నిలువు:

1. ఒక ప్రాచీన పద్యరూపం. అయిదింటిలో ఒకటి(4)
2. నికృష్టానికి ముందు ఉంటుంది (2)
3. కొండగాలి కాదు మామూలు గాలే తిరిగింది (3)
4.  నత్త కన్నా దీని వేగం ఎక్కువే (3)
5.  కొంతమంది ని మార్చడం ఎవరి ___ కాదు (2)
6. చెట్టు డాగు ఇదేం తెలుగు.విడగొడ్తే అంతేకదా ఇప్పుడు కాదు. (4)
9. ఐదుగురిలో చిన్నవాడు. దూరంగా ఉంటాడు. వీడు లేందే మిగతా నలుగురు ఎందుకూ పనికిరారు. (5)
10. క్రిష్ణ కి చెల్లెలు గా విజయ నిర్మల నటించిన చిత్రం. (5)
12. దీనికెన్ని గాయాలైనా మాసిపోతాయట.  నేను కాదు అన్నది. మనసుకవి 1965 లో అన్నారు. (3)
15. సమయం సందర్భం  లేదట్రా! (4)
17. దీనితో తయారుచేసిన చాపలు చల్లదనాన్ని ఇస్తాయి. కిందనుంచి చూడండి (4)
19. కోటికో ముందేంటో చెప్పండి. (3)
20. దాశరథి రంగాచార్య గారి దేవుళ్ళు (3)
22. నోటిక్కూడా దీన్ని వేయమంటారు (2)
23. మధ్యలో సురువా ఉంటే ఈ కాలం లో వచ్చేదే. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జూలై 26 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 20 పూరణ‘ అని వ్రాయాలి.  గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూలై 31 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 18 జవాబులు:

అడ్డం:   

1.ణరతవి‌ 4. వికవిక‌ 7. హస్తలాఘవం‌ 8. మాకు 10. అసా‌ 11. ప్రశాస‌ 13. పింజారి‌ 14. తిక్కన 15. పబువు‌ 16 టికకం‌ 18. శుద్ధి 21. ముట‌ 22. క్రీడాభిరామం 24. తిముస్తుఖ‌ 25. కాగితపు

నిలువు:

1.ణముమాప్ర‌ 2. తహ 3. విస్తరి‌ 4. విఘడి‌ 5. కవం‌ 6. కడసారి 9. కుశాగ్రబుద్ధి‌ 10. అజావికము‌ 12. అక్కన్న ‌15. పశుపతి 17. కంటగింపు 18. లాడాఖ‌ 20. పరాకా‌ 22. క్రీస్తు 23. మంగి‌

నూతన పదసంచిక 18 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్శపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ఎర్రోల్ల వెంకట్‌రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • కృష్ణ విరజ
  • లలిత మల్లాది
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఎన్. కృష్ణ శర్మ
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వెంకాయమ్మ టి
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here