[dropcap]న[/dropcap]ల్లని మబ్బు చీర కట్టుకొని
గగన సుందరి కిందికి చూస్తోంది
తన సోదరి భూమి వైపు ప్రేమగా
పచ్చని పట్టుచీర కట్టుకున్నట్టు
పైరు వాలుజడ విసురుగా వేసి
అక్క వైపు మక్కువగా చూస్తోందా
ఆకాశమక్క భూదేవి చెల్లి
ఆలింగనం చేసుకున్నారేమో
ఆషాఢంలో వాన వీణ మ్రోగింది
రాగాల జల్లులు కురిపిస్తూ
ప్రకృతి సస్యశ్యామలమయ్యింది