[dropcap]9[/dropcap]
మేఘాలకు
ఆశ
చల్లగాలి తనను
స్పృశించితే వర్షించాలని
10
ముక్కుకు
ఆశ
మంచి మంచి సుగంధాలను
ఆఘ్రాణించాలని
11
కంటికి
విపరీతమైన ఆశ
మంచి దృశ్యాలు
చూడాలని
12
తల్లికి
పిల్లలమీద ఆశ
పెద్దవాళ్ళై
ప్రయోజకులవ్వాలని
13
కార్మికులకు ఆశ
యజమానిమీద
తమను
బాగా చూచుకోవాలని
14
సినీ నిర్మాతలకు
ఆశ
తమ సినిమా
వారోత్సవం జరుపుకోవాలని
15
భూమికి
మేఘాలమీద ఆశ
తన గొంతు
తడుపుతుందని
16
వివిధ రకాల
ఆశలతో
జీవితం
అతి దుర్లభమైంది