[dropcap]వి[/dropcap]త్తనం పురుడు పోసుకుని మొక్కైతే
తన దేహం పులకరించి పోతుంది
పచ్చదనానికి ప్రతీక పుడమి
చిట,పట చినుకులు పలకరిస్తుంటే
తన తనువు పరవశించి పోతుంది
నీటి వనరులకు సూచిక పుడమి
పిల్ల తెమ్మెరలు చల్లగా తాకుతుంటే
తన శరీరం ఆహ్లాదంతో సేదతీరుతుంది
పవనాలకి దిక్సూచి పుడమి
ఖనిజ సంపదకు ఆధారమవుతుంటే
తన మేనంతా తనివి తీరుతుంది
సంపన్నానికి సుగమ మార్గం పుడమి