[dropcap]తీ[/dropcap]యగా మెరుస్తూ.
చూసిందల్లా పీల్చుకునే
పసరు కళ్ళకు
తెల్లని చమ్కీలద్ది
నాలుక నాగుపాములా
మెలికలు తిరుగుతూ
తీయగా మెరుస్తూ
ముఖంపైకి ఎగపాకి
పొగడ్తలతో చుట్టేసి
లోతుగా జొరపడి
పగలు కళ్ళు కప్పి
రాత్రిని నిద్రపోనిచ్చి
మనసు కుదుళ్ళును చేరి
మాటను ముట్టిన
మెలికల తెలివి
విడిచిన కుబుసం చుట్టూ
భక్తిని చూపే బంధం
బుసను పసికట్టే రోజు రాకపోతుందా?
పొగ కాపాడుకపోతుందా?