ఎద లోతుల్లో మొదలైందో గిలి
[dropcap]A[/dropcap] detective falls for a mysterious widow after she becomes the prime suspect in his latest murder investigation.
ఈ సినిమాను ఏక వాక్యంలో వివరించాలంటే ఇంతే. అఫీషియల్ సినాప్సిస్. కానీ, అంత తేలికగా ఉండే పనైతే, ఇలాంటివెన్నో వందల సినిమాలు, వేల నవలలు వచ్చేశాయి. క్లాసిక్స్ దగ్గర నుంచీ పల్ప్ వరకు. ఏ గ్రేడ్ సినిమాల నుంచీ డీ గ్రేడ్ (pun absolutely intended) సినిమాల వరకు. కానీ, అన్ని కథలకు లాహిరి లాహిరి అనుకుంటూ పడవలో ప్రేయసితో నదీ ప్రయాణం చేసేంత మృదువైన ఫ్లో తో నడిచే కథనం ఉండదు. లేదా ఉప్పొంగే గోదావరి ఉరకలెత్తే వేగం ఉండదు. గంగా పవిత్రతా, సరయూ గాంభీర్యం, అమెజాన్ వైశాల్యం, పసిఫిక్ అంత లోతు ఉండవు.
అంతకు మించి పార్క్ చాన్-వుక్ అనే శంఖం కూడా దొరక్కపోవచ్చు. తీర్థంలా మారేందుకు.
డెసిషన్ టు లీవ్ అక్కడే అదృష్టం చేసుకుంది. మానవ హృదయపు లోతుల్ని అర్థం చేసుకున్న అక్షర, సాక్షర కళాకారుడు పార్క్ చాన్-వుక్ చేతుల్లో పడి కళాఖండంగా కాదు. సంపూర్ణమైన కళ గానే మారిపోయింది.
Chapter 22
నాంది – ఇది అల్లరి నరేశ్ సినిమా కాదు
Hae-joon ఒక సక్సెస్ఫుల్ పోలీస్ డిటెక్టివ్ (హీరో కనుక). మనిషి కూడా క్లాసికల్ జంటిల్మన్ ఫీచర్లతో ఆకర్షణీయంగా, హుందాగా ఉంటాడు. కాస్తంత భావుకత కూడా ఎక్కువే. కాకపోతే అది అతని పనిలో కన్నా, Life Choices లో కనిపిస్తుంది. Ultimately, he’s a successful, battle-hardened Korean police detective in the vicinity of Busan area. కనుక అంత సక్సెస్ఫుల్ వ్యక్తికి పెళ్ళి కాకుండా ఉండదు. భార్య Jung-an కూడా అతనికి తగ్గట్టే మంచి అందగత్తె. సెన్సాఫ్ హ్యూమరూ ఎక్కువే. ఉద్యోగిని. తనకు చిన్న ఊళ్ళలో ఉండే సుఖం పెద్ద నగరాల్లో ఉండే సౌఖ్యాలకన్నా ముఖ్యం. అందుకే ఆమె సముద్ర తీరాన ఉన్న ఇపో పట్టణంలో ఉంటుంటుంది.
ఇక మన హే-జూన్ గారికి కేసులు ముఖ్యం కనుక, చిన్న పట్టణాలలో సరైన కేసులుండవు కనుక, కనీసం అప్పుడప్పుడూ అయినా ఒక మర్డరైనా జరక్కపోతే తన మెదడుకు పదును పెట్టి కేస్ సాల్వ్ చేసే అవకాశం ఉండదు కనుక కొరియాలో రెండో అతి పెద్ద నగరమైన బుసాన్‌లో ఉంటాడు. సరే! ఎవరి భుక్తి, ఉద్యోగ భక్తి వారివి. దాంతో వారిది ఒక్క పువ్వు రెండు కాయలు లాంటి వారాంతపు సంసారం.
చూస్తున్నారుగా? జరగబోయే విషయం గురించి పార్క్ ముందే హింట్లిస్తున్నాడు. అన్నట్లు చెప్పటం మరచితిని!
మనోడు బుసాన్ నగర పరిధిలో detective inspector స్థాయికి ఎదిగిన అత్యంత పిన్న వయస్కుడు (ఎందుకీ సోది అంటారా? హీరో కదా). హీరో అన్నాక పక్కనో సైడ్ కిక్ లేకపోతే బాగోదు అని మన తెలుగు ప్రేక్షకులకు తెలుసు. అలా మన హే-జూన్‌కు కూడా ఒక సైడ్ కిక్ ఉంటాడు. మధ్య మధ్యలో కాస్త కామెడీ చేస్తుంటాడు కూడా. Unforced comedy అని చెప్పుకున్నాము గుర్తుందా? సినిమాలో అక్కడక్కడా దర్శకుడు Natural Humour ను వెదజల్లాడు. Subtlety కూడా maintain చేశాడు. ఈ యువ డిటెక్టివ్ పేరు సూ-వాన్ (Soo-wan).
పార్క్ తన సహజ శైలిలో పేర్లు కూడా కథకు తగిన రీతిలో ఎంచుకున్నాడు. సూ-వాన్ రివటలా ఉంటాడు. కుమారి 21F కు నచ్చడు. ఎందుకంటే కాస్తంత మెచూరిటీ తక్కువ. తగినన్ని మర్డర్లు జరిగి మాంఛి కేసులు పడి చాలాకాలమైంది అని మన హీరో హే-జూన్ వాపోతుంటాడు. అంత మాత్రాన మన తెలుగు బ్లాగింగ్ మేధావులకు అతనికి సంబంధం లేదు. ఒకసారి ఇలా సరైన కేసులు పడటం లేదని బాధ వెళ్ళబుచ్చుతుంటే వెనకాల సూ-వాన్ expression చూసి తీరాల్సిందే. మాంఛి మీమ్ మెటీరియల్.
If you think too much about negative things, the gods conspire to attract those negative vibrations towards you అన్నట్లు సుఖంగా సాగిపోతున్న హే-జూన్ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకునే సువర్ణవకాశం వస్తుంది. ఇంచక్కా.
హే-జూన్ కోరుకున్నట్లుగానే ఒక మరణం సంభవిస్తుంది. కొండ మీద నుంచీ ఒక వ్యక్తి పడి మరణిస్తాడు. పైకి సాధారణమైన మరణంలా అది అనిపిస్తుంది కానీ, అది ఆత్మహత్యా? లేక హత్యా? అన్నది అంత త్వరగా తేలదు. అటు తిరిగి, ఇటు తిరిగి మన హీరో చేతిలో పడుతుందా కేస్.
కొండ కింద ప్రేమ గాలి
Seo-rae. ఒక చైనీస్ ఇమిగ్రెంట్. ఆమె తాతకు చాలాసార్లు ఉపయోగపడి, ఆమె కుటుంబానికి సహాయం చేసి, ఆమెకు పౌరసత్వం వచ్చేలా చేసిన వ్యక్తి ఆమె భర్త. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉంటుంది. ఇక్కడే దర్శకుడు డిటెయిలింగ్ ద్వారా చాలా హింట్సిస్తాడు. అవన్నీ మనం గమనించుకుంటుండాలి.
షడ్రసోపేతమైన భోజనం లాంటి సినిమా ఇది. ప్రతి మెతుకునూ ఆస్వాదిస్తూ తినాలి. ఆఫీసుకు డబ్బాలో పట్టుకెళ్ళి ఓ పది నిముషాలలో కడుపులో బజ్జోపెట్టి మమ అనిపించుకునే రకం తిండి లాంటి సినిమా కాదిది.
ఎల్డర్ కేర్ వర్కర్ కా పని చేసే స్యో-రే గొప్ప అందగత్తె. A bewitching beauty. She knows that she’s a beautiful lady with a mesmerising persona and she uses it to satisfy the needs of men. Of course, the only man who’s with her at that moment as ఊఁ అంటారా type of men imagines. But she’s more than just that.
She’s an artist whose work of art is life itself. జీవితమే ఆమె చేతిలో ఒక కళ.
సరే! హే-జూన్ ఈ కేసు నిమిత్తం స్యో-రే ను కలుస్తాడు. ఆమెకు ముక్కచెక్కలైన భర్త కపాలం చూపినా చీమ కుట్టినట్లైనా ఉండదు. She’s the typical Park Chan-wook’s femme fatale. Or it’s how we feel at first.
But Park Chan-wook is always full of surprises. కచ్చితంగా స్యో-రే నే అనుమానితురాలు అని హే-జూన్ కు తెలుస్తున్నా ఆమెకున్న alibi చాలా powerful గా పని చేస్తుంది.
ఆ alibi నిజంగానే అంత స్ట్రాంగా లేక ఆమె మాయలో పడి హే-జూన్ అలా భావించాడా అంటే… ఆ వివరాన్ని మననే ఊహించుకోమంటాడు దర్శకుడు పార్క్.
హే-జూన్‌కు insomnia ఉంటుంది. కళ్ళలో డ్రాప్స్ వేసుకుంటుండాలి. చాలా immaculate గా కనిపించే హే-జూన్ డ్రస్సింగ్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది. తనకు కావలసిన ఏ వస్తువు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా చూసుకునే వ్యక్తి. అన్నీ తన కోట్ పాకెట్స్‌లో ఉండేలా జాగ్రత్త పడతాడు. చిత్రంగా ఈ వివరాలన్నీ మనకు అతని గురించి కన్నా, స్యో-రే పాత్ర గురించి తెలుసుకునేందుకు పనికొస్తాయి. అలా చాలా తమాషాలు చేస్తాడు పార్క్. అచ్చం అతని గత సినిమా (ప్రయోగం బాగుండకపోయినా సర్దుకుపొండి) The Handmaiden లోలా. కానీ ఇక్కడ ఆ effect అంతకు మించి ఉంటుంది.
ముందే చెప్పా కదా. ఈ సినిమా చూడటం కేవలం ఒక గొప్ప experience కాదు. దోసిళ్ళలో పట్టుకుని జుర్రుకుంటూ ఆస్వాదించ గలిగిన వారికి ఆస్వాదించ గలిగినంత రసాస్వాన కలిగిస్తాడు.
చివరకు ఆమె alibi వల్ల ఆమె భర్తది ఆత్మహత్యే అని కేస్ క్లోజ్ చేస్తారు. కానీ,
అసలు కథ ఇక్కడే మొదలౌతుంది
కేస్ గురించి పరిశోధిస్తున్న కాలంలో, ఆ తరువాతా జరిగిన interactions సందర్భంలో హే-జూన్, స్యో-రే ల మధ్య చాలా కథ నడుస్తుంది. ఒక ప్రబంధమే అది. చివరికి వారి ప్రేమానుబంధం ఏమౌతుంది. స్యో-రే భర్తది నిజంగా ఆత్మహత్యేనా? ఒక వేళ అది ఆత్మహత్య అయినా, హత్య అయినా అందులో ఆమె పాత్ర ఎంత? ఈ వ్యవహారంలో యమునా విహారంలో ఉన్న నావ లాంటి హే-జూన్ జీవితం ఎలాంటి కుదుపులకు లోనవుతుంది?
వీటన్నిటికీ సమాఝానం కావాలంటే Decision To Leave సినిమా చూడాలి.
పొరలు పొరలుగా నడిచే కథనం. మన చుట్టూ సాధారణంగా కనిపించే విషయాల మీద వ్యంగ్యాత్మక విసుర్లు. మానవ మస్తిష్కపు వికారాలు, మనసు లోతులు, మనసు పొరల మధ్యా, వాటి అడుగునా అణిచి ఉంచిన ఊసులు… వీటన్నిటినీ తడుముతూ పార్క్ ఈ సినిమా తీశాడు.
అక్టోబర్‌లో స్ట్రీమింగ్‌లో చూసే అవకాశం.
కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చూసిన వారిని మంత్రముగ్ధులను చేసిన ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు వచ్చే ఎపిసోడ్ లో. Without revealing a single spoiler.
అప్పటిదాకా మన రోడ్లెటూ నదులౌతున్నాయి కనుక కానెడియన్స్ (Canadians) మాదిరి DIY పడవల తయారీ నేర్చుకుందాం.
(సశేషం)