[dropcap]A[/dropcap]ustralian Bureau of Statistics (ABS) వారు ప్రతీ అయిదు సంవత్సరాలకు నిర్వహించే జనాభా గణన-2021 యొక్క వివరాలు ఇటీవలే బహిర్గతం చేశారు. ఆస్ట్రేలియా లోని తెలుగువారు 59,393 గా నిర్దారణ చేశారు. గత 2016 లోని గణనతో పోలిస్తే 72 శాతం పెరిగినట్లు తెలుస్తుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో తెలుగువారి విస్తరణని పట్టిక-1 లో పొందు పరిచాను. అలాగే ఈ వ్యాసంలోని ముఖ్య విషయాలు ఆస్ట్రేలియాలో మ్యాప్‌లో పొందుపరిచి, సోదాహరణ పత్రంలో కుదించాను. గత అయిదు సంవత్సరాలలో ఆస్ట్రేలియా మొత్తం జనాభా 25,422,788, అంటే 2016 తో పోలిస్తే 8.6 శాతం వృద్ధిచెందింది. అందు భారతదేశంలో పుట్టి ఇక్కడ నివసిస్తున్న వారి సంఖ్య: 673,352. అంటే ఈ సంఖ్య భారతీయులకు ఆస్ట్రేలియాలో పుట్టి, ఇక్కడే నివాసమున్నవారు ఇందు పరిగణించి ఉండకపోవచ్చు. మొత్తం భారతీయులలో తెలుగువారు 9 శాతం అనుకోవచ్చును.
గమనిక: జనాభా గణన పత్రంలో ఒక ప్రశ్న ఉంటుంది: ఇంగ్లీషు కాక, మీ ఇంటిలో మాట్లాడే మరే భాష(లు) ఏమైనా ఉన్నాయా అని. ఆ ప్రశ్నలో ‘తెలుగు’ అని సమాధానం ఇచ్చిన వారిని బట్టి ఈ భాష విషయక ఆంచనా జరుగుతుంది.
వివరణ: ఈ గణనలో ఆస్ట్రేలియా పౌరులు మరియు, పర్మనెంట్ రెసిడెంట్స్ ను మాత్రమే గణించి ఉంటారని అపోహ పడ్డారు. దానిపై ABS వారిని వ్యక్తిగతంగా వివరణ అడిగాను. దానికి వారు వివరణ అందించారు (చూ. సోదాహరణ పత్రం). యాత్రీకులను మాత్రమే పరిగాణనలోనికి తీసుకోలేదని తెలియచేశారు. అంటే ఎంప్లాయ్మెంట్ పాస్ మీద ఉన్నవారు, విద్యార్ధులు ఈ పరిగణనలో ఉన్నట్లే!
పట్టిక-1: Telugu Speaking Population | |||
Source ABS; Compiled by Saradhi Motamarri
19-Jul-2022 |
|||
State/ UT | 2016 | 2021 | Growth % |
New South Wales | 12,456 | 20,154 | 62 |
Victoria | 13,158 | 24,677 | 88 |
Queensland | 3,442 | 5,639 | 64 |
South Australia | 1,325 | 2,385 | 80 |
Western Australia | 2,169 | 3,089 | 42 |
Tasmania | 110 | 335 | 205 |
NT | 255 | 362 | 42 |
ACT | 1,519 | 2,752 | 81 |
Total Telugus | 34,434 | 59,393 | 72 |
Total Indians | 673,352 | ||
Total Australia | 25,422,788 | 8.6 |
ఇందరేనా తెలుగువారు?
2016 లో న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో తెలుగు వారి సంఖ్య 12,456, నాకు చాలా తక్కువ అనిపించింది. ఎందుకంటే ఒక ప్రధానమైన సిడ్నీ నగరంలో తెలుగు సినిమాలకు ఉన్న ఆదరణ తెలుసు. ఆ చిత్రాలు తెచ్చేవారిని నేను అడిగాను, మీ ఉద్దేశంలో ఎంతమంది మనవారు ఉంటారని, ఆ సంఖ్య 32 వేలకు పైనే అని సమాధానం వచ్చింది. దీనిని మనం Movie-goers Index (The Economist వారి McBurger Index లాగా 😊) అని పిలువవచ్చు. అంటే చాలామంది పత్రంలో వారు తెలుగు మాట్లాడుతారని చెప్పక పోవడమే అని అనిపించింది. అంటే మిగతా ప్రధాన నగరాలైన మెల్‌బర్న్, బ్రిస్బేన్, అడీలాయిడ్, పెర్త్ లాటి నగరాలు కలుపుకుంటే ఈ సంఖ్య ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది అని మా అంచనా.
గత 2016 గణనకు ముందు, తెలుగువారి సంఖ్య ప్రభుత్వ ఆంచనాలలో చాలా తక్కువగా ఉందని గుర్తించి, ఇక్కడ తెలుగు సంస్థలు, రేడియోలు, సాంఘిక మాధ్యమాలు (WhatsApp, FaceBook, నోటిమాట..) ద్వారా మేము ఇంట్లో మాట్లాడేది తెలుగు అని చెప్పండి అని తెలుగువారిని ప్రోత్సహించే ప్రయత్నం చేశాం. దాని ఫలితంగా తెలుగు వారి సంఖ్య 2016లో సంఖ్య కొంచెం మెరుగు అయినది. అలాగే 2021 గణనకు ముందు చేసిన ప్రయత్నాలు ఉపయోగపడినదనే చెప్పాలి.
ఇంకా మరింత లోతైన పరిశోధన కొనసాగిస్తూ, మీ ముందుకు తెస్తున్న ఈ సోదహరణ పత్రం, వ్యాసం ముఖ్య ఉద్దేశం, మన తెలుగువారిలో అవగాహన పెంచి, బహుశా 2026 లో మన నిజ సంఖ్య నిర్దారణకు తోడ్పాటు చేస్తుందని, వారు అందరు తమ భాష తెలుగు అని తెలియచేస్తారని ఆశాభావం!
సోదాహరణ పత్రం: 2021 ఆస్ట్రేలియా లో తెలుగు వారి సంఖ్య: