కొరియానం – A Journey Through Korean Cinema-25

1
3

చేతిలో గుహ

[dropcap]ఇం[/dropcap]తింత ఉంటుంది. ఎంతైనా ఉంటుంది.

2022లో మన ప్రయాణాన్ని ముగించి ఒక్క ఆరేళ్ళు వెనక్కి వెళ్తే కానీ, పార్క్ చాన్-వుక్ గత సినిమా రాదు. డెసిషన్ టు లీవ్ కన్నా ముందటి సినిమా. మధ్యలో కొన్నాళ్ళు టెలివిజన్ను ఉద్ధరించటానికి వెళ్ళాడు (రామ రామ! ఇందులో ఎలాంటి శ్లేషా లేదు). ద లిటిల్ డ్రమ్మర్ గాళ్ (The Little Drummer Girl) అనే ఆరు ఎపిసోడ్‌ల సీరీస్‌ను తీశాడు (తీత = filmmaking. చూ॥ గత ఎపిసోడు).

ఇక్కడ మన పార్క్ దర్శకుడు కనుక ఆ డ్రమ్మర్ పిల్ల కథ చాలా మంచి మార్కులేయించుకుని సోర్స్ మొటీరియల్ కన్నా బాగుందనిపించుకుంది. ఆ సోర్స్ మెటీరియల్ జాన్ ల కారే (John le Carré) రాసిన espionage thriller నవల. 1983లో వచ్చింది. (ఇదంతా వికీపీడియాలో ఉందిగా? ఆ! ప్రతిసారీ కొత్త విషయాలు చెప్తారు మరి!) ఆ రాసిన వాడు బ్రిటిషరు. సీరీస్ తీసింది బీబీసీ కోసం.

Start {

అమెజాన్‌లో పిడకల వేట!

ఇది చదివే వారికి ఒక ప్రశ్న.

అప్పట్లో వార్త ఆదివారం ఎడిషన్ అనుకుంటాను. 9/11 తరువాత అఫ్ఘానిస్తాన్ మీద బాంబులేసి తాలిబాన్‌ను తరిమి (తరువాత అభివృద్ధి చేసి పళ్ళెంలో పెట్టి అప్పగించటం అప్పటి నుంచి ఇప్పటి వరకూ బతికున్నవాళ్ళు చూశారనుకోండీ) కొట్టే ప్రయత్నంలో ఉండగా, ఒక కథ ప్రచురితమైంది. ఆ కథ పేరు గ్లోబల్ గ్రామం.

దాంట్లో పేర్లు భలే పెట్టారు. అప్పటిలో టీనేజ్ లోకి వస్తూ లోక జ్ఞానం వస్తోంది అనుకునే రోజులు కదా. అందుకు భలే గుర్తుండి పోయింది ఆ కథ.

ఆ కథలో అఫ్ఘానిస్తాన్ = అప్పాపురం కాలనీ (ఎవరినీ కాలనీమనటం కాదు. ఈ Colony).

జార్జి బుష్ = జాజికాయల భూషయ్య

వ్లాదిమిర్ పుతిన్ = రాజశేఖరపురం పున్నయ్య

అటల్ బిహారీ వాజ్పాయి = అట్టల వాచస్పతి

పర్వేజ్ ముషరఫ్ = ఫర్హాజుల ముసలయ్య

బీబీసీ = బాబయ్య

సీఎన్ఎన్ = శీనయ్య

అప్పటి నుంచీ బీబీసీని బాబయ్య, సీఎన్ఎన్‌ను శీనయ్య అని ముద్దుగా పిలుచుకోవటం అలవాటైంది.

ఇంతకీ ఈ కథను (అంటే గ్లోబల్ గ్రామం కథ. ఎలక్ట్రానిక్ కథ కాదు) రాసింది ఎవరు?

ఎవరి దగ్గరన్నా ఆ పూర్తి కథ ఉందా? ఫొటో కాపీ అయినా చాలు. అలాగే రచయిత వివరాలు. Please help me find them.

అంటే ఇందాకన బీబీసీ అంటే ఇవన్నీ గుర్తుకు వచ్చాయి. గరికిపాటి నరసింహారావు గారు అక్కడ విన్న విషయం ఇక్కడ జరిగే ప్రవచన సభలో చెప్పేసి భారం దించేసుకున్నట్లు, నేను కూడా 21 సం॥ల క్రితం చదివి బాగుందనికున్న ఒక సెటైరికల్ కథ గురించి అడిగేసి భారం దించేసుకున్నాను.

పిడకల వేట సమాప్తం

} Close

మొత్తం ఆరు ఎపిసోడ్లున్న ఆ సీరీస్‌లో…

ఖలీల్ అనే తీవ్రవాదిని (మనిండియాలో అయితే! వద్దులెండి. అనవసరపు రచ్చ), పట్టుకునేందుకు చార్లీ అనే 26 సంవత్సరాల వయసున్న బ్రిటీష్ నటిని రిక్రూట్ చేసుకుంటాడు మార్టిన్ కజ్ అనే ఇశ్రాయెలీ సీక్రెట్ ఏజంట్ (జంట్ యే). ఆ తీవ్రవాది పాలస్తీనా వాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమెనే ఎందుకు ఎంచుకున్నారంటే ఈమె అందం చందం సొగసూ హొయలూ (ఎంతైనా పార్క్ చాన్-వుక్ తీత కదా).

ఈమె జోసెఫ్ అనే మరో ఏజంట్‌తో కలిసి, ఖలీల్ తమ్ముడు సలీమ్‌ను చంపాక జోసెఫ్ సలీమ్‌లా మారతాడు. వీళ్ళు ఐరోపా మొత్తం తిరిగి చార్లీ సలీమ్‌లు ప్రేమికులు అని ఖలీల్‌ను నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఖలీల్ వీళ్ళ ప్రేమ యాత్రల గురించి తెలుసుకున్నాక బృందావనం వెళ్ళడు కానీ, చార్లీని ట్రేస్ చేసి పట్టుకుంటాడు. ఆమెను ఒక మానవ బాంబుగా తయారు చేసే ప్రయత్నంలో పడతాడు. ఈలోగా ఇశ్రాయెలీ ఏజంట్లు చార్లీని అంటిపెట్టుకుని ఉండి (ఖలీల్‌కు తెలియకుండా) ఈతని ప్లాన్ వివరాలు తెలుసుకుంటారు. ఇలాంటి అన్ని కథల్లో లాగానే చార్లీకి తనను నమ్మిన ఖలీల్‌ను మోసం చేయటం ఇష్టం ఉండదు.

ఈ సీరీస్‌కు గొప్ప సీరీస్ అనే పేరు రావాల్సిన రాత ఉంది కనుక మన కథానాయిక డిప్రెషన్‌తో కుప్పకూలేలా తయారవుతుంది ఈ ద్వైదీ భావాల వల్ల. అటు తనను పంపిన ఇశ్రాయెలీలకు తోడ్పడాలా? తనను నమ్మిన పాలస్తీనియన్లకు సాయపడాలా అనే డైలమా. నలిగిపోతుంది.

చివరకు ఆమె గతి ఏమయ్యింది? ఖలీల్ పూర్తి ప్లాన్ ఏంటి? దాన్ని ఇశ్రాయెలీ ఏజంట్లు ఎలా ఛేదించారు అన్న విషయాలను పార్క్ తనదైన visual flair and undercurrent satirical tone తో nonchalant గా తీశాడు.

మంచి సీరీస్. ఖచ్చితంగా చూడాల్సింది. MCU Black Widow movie తో బాగా పేరు తెచ్చుకున్న Florence Pugh ఇందులో చార్లీగా జీవించింది. Alexander Skarsgård కూడా ఉన్నాడు. ఫర్లేదనిపిస్తాడు.

దీంతో పాటూ మన పార్క్ మరో టెలివిజన్ షో The Sympathiser తీస్తున్నాడు. అందులో మనైరన్ మ్యాన్ రాబర్ట్ డౌనీ జూనియర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సూపర్ కాంబినేషన్.

ఇలా టెలివిజన్ సీరీస్‌లకు ముందు వచ్చిన The Handmaiden చాలా అద్భుతమైన సినిమా. అటు కొరియాలోనూ, ఇటు అంతర్జాతీయంగానూ గొప్ప పేరు తెచ్చుకోవటమే కాదు. కమర్షియల్‌గా బాగా విజయవంతం అయింది.

ఈ The Handmaiden కథాంశం కూడా పార్క్ చాలా సినిమాల్లాగానే ఇతర ఆర్టిస్టిక్ సోర్సుల నుంచీ తీసుకున్నదే. వేల్స్ రచయిత సారా వాటర్స్ రచించిన Fingersmith అనే విక్టోరియన్ నవల ఆధారంగా రాసుకోబడ్డది.

ఆ విక్టోరియన్ సెటింగ్‌ను పార్క్ Imperial Japan’s rule of Korea సమయానికి మార్చుకుని, తనదైన విట్ ను, వ్యంగ్యాన్నీ జోడించి తీశాడు.

ఈ సినిమాలో సెక్సువల్ కంటెట్ explicit గా ఉన్నదని విమర్శలు వచ్చాయి. అది నిజమేనా అంటే పైపైన చూస్తే gratuitous scenes లాగానే అనిపించినా, పార్క్ తనదైన శైలిలో ప్రతి చిన్న విశేషం కూడా కథను ముందుకు నడపటానికి వాడుకున్నాడే తప్ప మనల్ని ఉద్రేక పరచటానికి కాదు. అది సినిమాలో విజువల్, మ్యూజికల్, పెర్ఫామెన్స్ (నటీనటుల) క్లూలు జాగ్రత్తగా పరిశీలిస్తూ చూస్తే అర్థమవుతుంది.

మరి ఈ సినిమా గురించిన వివరాలు చూసేముందు… డెసిషన్ టు లీవ్ కొరియన్ బాక్సాఫీసును ఈ సంవత్సరం ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం. ఎందుకంటే పార్క్ ఎందుకు అంత significant filmmaking artist గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడో తెలియాలంటే అతని ప్రభావం మనకు తెలిసి ఉండాలి కదా. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించలేదు కానీ, through and through drama అయిన Decision To Leave బజట్‌కు తగిన రీతిలో బాగా ఆడింది. మొదటి రెండు వారాంతాలలో, అదీ unseason లో, బాక్సాఫీసు వద్ద టాప్ పొజిషన్‌లో నిలవటమే కాకుండా, పెట్టిన పెట్టుబడిని రాబట్టింది. ఇది రాస్తున్న సమయానికి.

ఈ సినిమా రిలీజ్కు నెల ముందు విడుదలైన మాస్ సినిమా The Round Up (గుర్తుపెట్టుకోండి) బ్రహ్మాండమైన విజయం సాధించి $100 మిలియన్లు వసూలు చేసింది. The Medium or Rangzong పరచిన రాచబాటను, మిగతా సినిమాలు బాగా వినియోగించుకోగా, ప్యూర్ క్లాస్ సినిమా అనిపించుతున్న Decision to Leave కూడా బాగా ఆడి Theatrical Viewing Experience కు ఇప్పట్లో substitute లేదు, రాదు అని నిరూపించింది.

అంటే సరైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు. వారిని ఇళ్ళ నుంచి బైటకు రప్పించే దమ్మున్న సినిమాలు రావాలంతే. బజట్‌తో, స్టార్లతో, హంగులతో సంబంధం లేదు.

వచ్చే వారం చేతిలో గుహ అదే The Hamdmaiden (ద Handमेंden) విశేషాలు చూద్దాం.

అప్పటిదాకా, కాగితం పడవలు చేసి ఆడిద్దాం ఇంట్లో పిల్లలు ఉంటే. లేకపోతే మనమే చేద్దాం. Nostalgia.

INTERVAL

Get ready to meet సుఖీ

After the break…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here