[dropcap]‘రా[/dropcap]ధాయి’ పేరుతో గతంలో పలు రచనలు చేసిన అల్లంరాజు రాధాకుమార్ కవితలు, కథలు, వ్యాసాలు, గుసగుసలు (కాలమ్ రచనలు), కార్టూన్లు సంతరించుకున్న గ్రంథం ‘ఆ రోజుల్లో …’ ఆవిష్కరణ మహోత్సవం ఆగస్టు 6 శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు బంజారాహిల్స్ లోని ఆలాలిబర్టీ హాల్‌లో జరిగింది.
షామీర్‌పేట్ ఐ.పి. క్యాంపస్ ప్రొఫెసర్ డా. ఆకొండి ఆనంద్ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్‌కు చెందిన ప్రసారభారతి విశ్రాంత డైరక్టర్ జనరల్ శ్రీ ఈమని కృష్ణారావ్ విశిష్ట అతిథిగా విచ్చేశారు. లయోలా మాంటిసరీ పాఠశాల వనస్థలి ప్రిన్సిపాల్ శ్రీమతి ఎ.వసంత తొలి ప్రతి అందుకోగా ప్రముఖసాహితీవేత్త సుధామ సభ నిర్వహించారు.
రాధాయి పేరుతో నలభై యాభై సంవత్సరాల క్రితమే నాటి పలు పత్రికలలో కవితలు కథలు వ్యాసాలు రాయడమే కాక కార్టూన్‌లు కూడా గీసిన రాధాకుమార్ గారి 75 వ జన్మదిన సందర్భంగా ఆ రచనలన్నీ ‘ఆ రోజుల్లో..’ గ్రంథం గా సంతరించబడడం ఆనందదాయకమనీ, ముఖ్యముగా నాటి చుక్కాని జాతీయ వారపత్రికలో రెండేళ్ళు రాధాయ్ గారు నిర్వహించిన ‘గుసగుసలు’ కాలమ్ వ్యాసాలద్వారా అర్థశతాబ్దపు క్రితపు నగర సామాజిక వాతావరణం ద్యోతక మవుతుందని వక్తలు ప్రశంసించారు. అప్పటి రచనలు భద్రపరచి ఇన్నాళ్ళకయినా ఇలా సంపుటీకరించడం మంచి రికార్డని రాధాయిని అభినందించారు
సభానంతరం ఆహూతులందరికీ విందు జరిగింది.