భారతీయులకు హెచ్చరిక-1

0
3

[box type=’note’ fontsize=’16’] భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ  దినం గా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష అనువాద రచన ఇది. 1939లో ప్రచురితమైన సావిత్రి దేవి రచించిన ‘ఎ వార్నింగ్ టు ది హిందూస్’ అన్న పుస్తకాన్ని అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ. సావిత్రి దేవి గ్రీకు మహిళ. ఆమె భారత్ వచ్చి, భారతీయుడిని వివాహం చేసుకుని ఇక్కడే హిందువుగా స్థిరపడింది. దేశంలో జరుగుతున్న పరిణామాలను అవగాహన చేసుకుని భవిష్యద్దర్శనం చేసినట్టు 1939లో ఆమె రచించిన గ్రంథం ఇది. ఈ పుస్తకానికి వీర్ సావర్కర్ ముందుమాట రాశారు. ఈ పుస్తకంలో ఆమె ఏదయితే జరిగే ప్రమాదం వుందని హెచ్చరించిందో అదే నిజమవటం ఈ పుస్తకం ప్రాధాన్యాన్నీ విలువను పెంచుతుంది.  ప్రస్తుతం దేశంలో మళ్ళీ అనుమానాలు, ఆవేశాలు, ద్వేషాలు అధికమై సామరస్య వాతావరణాన్ని రాజకీయ లబ్ధి కోసం కలుషితంచేసి వికృత విషపుటాలోచనలను విస్తృతంగా వెదజల్లుతున్న తరుణంలో గతంలోని పొరపాట్లను స్మరించటం ద్వారా చరిత్ర పునరావృతం కాకుండా జాగ్రత్తపడేవీలుంటుందని ,  చరిత్రలో  మరుగున పడ్డ అనేక సత్యాలను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న వుద్దేశ్యంతో ఈ అనువాదాన్ని అందిస్తున్నాము. [/box]

ముందుమాట

[dropcap]జా[/dropcap]తులను ప్రజలనూ తయారు చేసేవీ, పాడు చేసేవీ ఆలోచనా ధోరణులే. పునరుత్పత్తి, సమర్థవంతం చేయడం. లక్ష్యాలను ఏర్పరచుకోవడం మొదట పని చేస్తే, పతనం చేయడం, అవరోహింప జేయడం, స్వీయ భ్రమలను కల్పించడం రెండవ పని చేస్తాయి.

చాలా కాలంగా, అన్ని రంగాలలో, భారతీయులు తమను జడత్వం వైపు నడిపించే భావజాలంతో ప్రభావితులవుతున్నారు. దాని వల్ల వారు శక్తివంతంగా జీవించడానికి అసమర్ధులుగా ఉన్నారు. వారికి ‘మోక్షం’ తప్ప, మరో లక్ష్యం లేదు. ‘మోక్షం’ అంటే ఈ లౌకిక ప్రపంచం నుంచి పారిపోవడం. ఎక్కడికి? దేవుడికీ తెలియాలి! ఇదే, శతాబ్దాలుగా మన  రాజ్యం నిరంతర బానిసత్వానికిలోను గావటానికి కారణమని చెప్పవచ్చు.

ఇలా ఉన్నా, అప్పుడప్పుడు భారతీయ సజీవ చైతన్యశక్తి, తనను తాను ఉత్తేజకరంగా నిర్ధారించుకుని, తన నరసింహ స్వరూపం ముందు తన శత్రువులు గడగడ వణికేలా చేసుకుంది. ఎంతో అనారోగ్యకరమైన, లౌకిక విషయాలపట్ల అనాసక్తి అనే గొప్ప ఒత్తిడి ప్రభావం ఉన్నప్పటికీ, ఆ చైతన్యశక్తి ఆవిష్కృతమైంది.

ఈ ఆధ్యాత్మిక దృక్పథమే భారతీయుల మనస్సులను భారతీయ జాతీయ వాదానికి దూరంగా ఉంచిందని చెప్పవచ్చు. కాలక్రమాన, పరిస్థితుల ప్రాబల్యం వల్ల, భారతీయులు తమ జాతిని గురించి ఆలోచించవలసి వచ్చింది. కాని, దురదృష్టం, అది సరైన రీతిలో కాకుండా, ఒక వికృత మార్గంలో రూపుదిద్దుకుంది. వారిలోని ఐకమత్యాన్ని మరచి, వారు తమ ‘జాతి’ అనే పరిధిలోకి విదేశీ సంస్కృతులను ఆహ్వానించారు. నిజంగా ‘భారతజాతి’ విచిత్రమైందే. ఎందుకంటే, విదేశీ సంస్కృతులు, భావ జాలం ప్రాబల్యాన్ని పొంది, నిజమైన మన ‘భూమిపుత్రులు’ నిర్వీర్యులైనారు. ఆ విధంగా వారు విదేశీయులను, ముస్లింలను ప్రోత్సహించినారు. బ్రిటిష్ వారికి లేదా తమకు తాము మిత్రపక్షాలుగా ఏర్పడే క్రమంలో, విదేశీయులు భారతదేశంలో తమ అధిపత్యాన్ని చెలాయించి, జాతి వ్యతిరేక శక్తులుగా రూపొందే అవకాశం కల్పించినారు.

ఆ ఫలితంగా, భారతీయులు ఒక జాతిగా, దేశంగా ఉనికిని కోల్పోయే పరిస్థితి తలెత్తింది. రోజు రోజుకూ అది క్షీణించి అది ఎలాంటి స్థితికి దారి తీసిందంటే ‘అఖండ భారతదేశం’  అనే భావనను ఉహించటానికైనా సాధ్యంకాని హీనస్థితి! ఎలాగైనా సరే, భారతదేశాన్ని పరిరక్షించుకోడానికి ఒక బృహత్ ప్రయత్నం అవసరం. ఆ క్రమంలో మొట్టమొదటి అడుగు. ఒక అసాధారణమైన భారతీయ సమైక్య భావజాలాన్ని, తీవ్రంగా భారతీయులందరి మనస్సుల్లో, ప్రవేశపెట్టడం. అది ఎలాంటి భావజాలమంటే, భారతీయులు తమ స్వాభావిక అనాసక్తిని, జడత్వాన్ని వదిలేసి, వారితో ఒక అనుకూల, నిర్ణయాత్మకమైన వైఖరిని భారత జాతీయతా వాదంపట్ల రగిలించేదిగా ఉండాలన్న మాట.

ఈ శోధన వల్ల కలిగిన జ్ఞానంతో, కొందరు ముందుకు వచ్చారు. వారు ఒకప్పుడు వైభవంగా వెలిగి, ఇప్పుడు అభాగ్యురాలైన భారతజాతిని,  విపత్కర పరిస్థితుల నుండి బయటకు తీసుకురావటానికి కృషి చేస్తున్నవారు. వారికి అవసరమైన ఆలోచనా స్రవంతిని, వారిలో కలిగించడానికి, ఈ రచయిత్రికి తగిన గౌరవం ఇవ్వడం సముచితం. ఆ విధంగా మన భారత జాతికి సత్వర సేవనందించే అవకాశం వారికి కలుగుతుంది.

భారతీయ పరిధిలోని మామూలు కార్యకర్తలకన్న ఈమెకు కొంత ప్రత్యేక అవకాశం, ఉంది. ఆమె గ్రీకు జాతీయురాలు. భారతీయ కళలు, భావాలు, ధర్మము పట్ల కొంత,  మరింత లోతైన కారణాల వల్ల కొంత, ఆమె మన భారతీయ సిద్ధాంతాన్ని స్వీకరించింది. సహజంగా, ఆమె ఐరోపా జాతీయురాలు. కాబట్టి, మనలో ఉంటూనే, భారతీయుల స్థితిగతులను నిష్పక్షపాతంగా పరిశీలించగలదు. ఈ పుస్తకంలో ఆమె కొన్ని మనల్ను ఆలోచింపచేసే నిర్ణయాలు చేసింది. అవి పుట్టకతో భారతీయులయిన వారు చేయగలిగేవి కాదు, ఏక పక్షాలు కాదు.

ఈ అత్యంత ఉత్తేజకరమైన, ఆలోచనాత్మకమైన పుస్తకం భారతీయులకు తాము ఎక్కడ ఉన్నామో, తమ ఉనికికి తమ జాతికి ప్రమాదం కలుగ చేసే శక్తులు ఏమిటో తెలుపుతుంది. జాతీయ దృక్పథాన్ని సరిగ్గా ఎలా మలచుకోవాలో నేర్పుతుంది. ఈ కొత్త దృక్పథం గనుక, దేశమంతటా అనుసరిస్తే, హృదయ పూర్వకంగా, అది వారిని జాగృతపరిచి, వారి జాతీయ అస్తిత్వాన్ని నిర్ధారించుకునేలా చేస్తుంది. ప్రపంచం దానిని విస్మరించకుండా ఉండేలా చేస్తుంది.

అందుకే నేను ఈ పుస్తకాన్ని భారతీయులకు పరిచయం చేస్తున్నాను. ఇందులోని విలువైన విషయాలకు వారికి ఇంత వరకు అడ్డుగా ఉన్నందుకు మన్నించమని కోరుతూ, సెలవు!

జి.డి.సావర్కర్

తొలి పలుకు

బెంగాలు, అస్సాములలో ఒకటిన్నర సంవత్సరాలు, కలకత్తాలోని కాళీఘాట్ కేంద్రంగా పని చేసిన తర్వాత, ఈ  మాటలు వ్రాస్తున్నాను. ఈ మధ్య నేను పొందిన వ్యక్తిగత అనుభవాల నేపథ్యంలో, ఈ మాటలు మతం పట్ల ఒక ప్రాచీన జాతీయవాద దృక్పథాన్ని వ్యక్తం చేస్తాయి. తమకంటే చిన్నదైన ఈ కార్యకర్త మాటలు, భారతీయులకు కొంచెం అపరిపక్వంగా అనిపిస్తే వారిని బాధపడవద్దని మనవి. ఎందుకంటే, వారు సామాజిక రాజకీయరంగాల్లో తమ దేశపు పౌరులతో ఎంతో సుదీర్ఘమైన అనుభవం కలిగి ఉన్నారు.

ఈ పుస్తకం చివరి భాగంలో, భారతీయులు తమ ఆత్మరక్షణను ఎలా చేసుకోవాలో, భారత సైనికపాటవం లాంటి అంశాలున్నాయి. ఇవి శ్రీమత్ స్వామి సత్యానంద ప్రవచించిన బోధనలే. ఆయన హిందూమిషన్ అధ్యక్షులు. షిల్లాంగ్ లోని భారత స్వయం సేవకులకు, వారి నాయకుడు మరియు శారీరిక శిక్షకుని సహాయంతో అస్సాములో స్వామి సందేశమిచ్చిన ప్రాథమిక సూత్రాలు ఇవి. తా. మూన్ జీ మరియి హిందూమహాసభ వారు ప్రారంభించిన గొప్ప యువశక్తి ఉద్యమానికి ప్రేరణ  ఈ భావాలే.

 మనల్ని మనం ఒక భారత సైనిక శక్తిగా భావించుకోవాలి. అంటే, కేవలం హిందువులను పరిరక్షిండానికి శిక్షణపొందే ఒక వర్గంగా కాకుండా, దేశంలోని అన్ని కులాల, వర్గాలలోని  యువతకు శిక్షణయిచ్చి, భారతదేశపు హాక్కుల కోసం, భారత స్వాతంత్ర్యం కోసం, భారత శక్తి దేదీప్యమానంగా వెలగడం కోసం వారిని సమరోన్ముఖులను చేయాలి. ‘హిందువులు’ అని అనే ప్రతి చోట మనం ‘భారతీయులు’ అనే అనటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. భారతీయులుగా పుట్టిన అందరూ, శాంతిగా, ఐక్యంగా, ఒకే సంస్కృతిని, ఒకే జన్మభూమిని గౌరవించే వారయితే, అలాగే అనాలి.

మన తోటివారు మనతో బాటు ప్రశాంతంగా ఉంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది. మనకున్న ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా మనతో కలసి ప్రశాంతంగా జీవించడం ఎవరికి ఏమాత్రం అసాధ్యం కాదు. అది ఎప్పుడు సాధ్యం? అన్నిటికంటే మిన్నగా   భారతదేశాన్ని భావించినప్పుడు. మనం కూడా! అన్ని మతకలహాలను విస్మరించి  భారత సంస్కృతిని తమ సంస్కృతిగా భావించినప్పుడు. భారతదేశం పట్ల ప్రేమను   దైవారాధనగా చేసుకున్నపుడు, అది అసాధ్యమేమీ కాదు.

కాని, దురదృష్టం, పరిస్థితి ఎలా వుందంటే మన సోదరుల మతపరమైన వేర్పాటువాదానికి వ్యతిరేకంగా మనం మన ఆత్మరక్షణను చేసుకోవలసి వచ్చింది! అదే శక్తిని, వారితో సహా మనం, మన ఉమ్మడి శత్రువుల పై ఉపయోగిస్తే, ఎంతో బాగుండేది.

నేను మళ్లీ చెపుతున్నా, మనకు మన భారతీయ సోదరులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇంకా ఎవరైనా సరే, వారంటే ఏ మాత్రం ద్వేషం లేదు. వారి పట్ల వైషమ్యం అసలే లేదు. మనం ద్వేషించేది జాతి వ్యతిరేక మత విద్వేషాన్ని. గతంలో మనం ఒకే భారత సంస్కృతిని ఇండియన్ ముస్లింలతో, ఇండియన్ క్రిస్టియన్లతో పంచుకొన్నాం. అదే స్ఫూర్తితో, ఆదే నిజాయితీతో మనం అన్ని మతాలకతీతంగా భారత్ అనే   భోదించాం. ప్రపంచ మతాలకతీతతంగా ఇండియాను ప్రముఖంగా చూడమని భారతీయులకు చెప్పాం. మళ్లీ మన ఉమ్మడి సంస్కృతి, నాగరికతలలోకి తిరిగిరమ్మని, జాతీయతా వాదం కోసం అందర్నీ వేడుకున్నాం.  దేశం మీద ప్రేమ ఉన్నవారు వచ్చి మనతో చేరవచ్చు. వారికి స్వాగతం!

కాని, ఎవరైనా సరే, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు లేదా హిందువే కావచ్చు, భారతదేశాన్ని గాని,   సంస్కృతిని గాని నిరాదరిస్తే, వారికి ఈ దేశంలో స్థానం లేదు. వాళ్లు తాత్కాలికంగా దేశంలో ఉన్న విదేశీయులే! దేశానికంటే మిన్నగా ఏ మతాన్నయినా,  వర్గాన్నయినా ఎవరయినా ప్రేమించదలుస్తే, వారు భారతదేశాన్ని స్వంత దేశంగా భావించనట్టే.

హిందూమిషన్ అధ్యక్షుల వారికి, అందరు భారతీయులకు, నా తోటి  కార్యకర్తలకు, స్నేహితులకు, తమ అనుభవాలు పంచుకొని నన్ను చైతన్య పరచిన, మద్దతు తెలిపిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. హిందూ మహాసభ అధ్యక్షులు వి.డి.సావర్కర్ గారికి, డా. ముంజేగారికి, నాకు ప్రేరణ ఇచ్చి నన్ను నిరంతరం తమతో కలుపుకున్న హిందూమహాసభ నాయకులకు ఇతర ప్రముఖ సభ్యులకు నా కృతజ్ఞతలు.

రచయిత్రి

కలకత్తా,

మే 1939

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here