‘జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మ స్మారక’ సిరికోన సామాజిక నవలల పోటీ 2022 ఫలితాలు – ప్రకటన

0
7

[dropcap]అం[/dropcap]తర్జాతీయ స్థాయిలో తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషిచేసే వాక్స్థలి పీఠం  ‘సాహితీ సిరికోన’  డయస్ఫోరా ఇతివృత్తంతో 2022లో నిర్వహించిన నవలల పోటీలో డా. మోదుగు శ్రీసుధ రచించిన ‘అంతర్హిత’ నవల సర్వోత్తమంగా ఎంపికై  ‘శ్రీ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మ స్మారక’ పురస్కారాన్ని గెలుచుకొంది. ఈ పురస్కారం కింద విజేతకు, ఇతర సత్కారంతో బాటు రూ.30,000 నగదు పురస్కారం అందజేయబడుతుంది.

జమైకా నేపథ్యంలో మొదలయ్యే ఈ ‘బహుముఖీన’ సామాజిక సందేశాత్మక నవలా రచయిత్రి, ప్రస్తుతం జమైకాలోని కింగ్‌స్టన్‌లో వైద్యవృత్తిలో వున్నారు.

నవలారచనలో ఇది తొలి అడుగు అయినా, కవయిత్రిగా మోదుగు శ్రీసుధ, 2017లో తన మొదటి కవితాసంపుటి ‘అమోహం’ తోనే సాహిత్య ప్రపంచంలో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. 2019 డిసెంబర్ లో ‘విహారి, The song of The unborn Voice’ పేరుతో మణిప్రవాళ శైలిలో వెలువరించిన కవితా సంపుటి విమర్శకుల ప్రశంసలనందు కొన్నది. 2019 జూన్‍లో ‘రెక్కలపిల్ల’ కథలతో తన బాల్యనుభూతులతో, అనుభవాల కథలతో కథారచనలో అడుగుమోపినా, 2021 అక్టోబర్‍లో  “డిస్టోపియ, Musings of Imperfect existences” పేరుతో వెలువరచిన 18 కథల సంకలనం తెలుగు కథాసాహిత్యంలో ఒక విభిన్నప్రయోగంగా సంచలనాత్మక విజయాన్ని పొందింది.

దీనితోపాటు ప్రసిద్ధ రచయితలు శ్రీ మందపాటి సత్యం (టెక్సాస్) గారి ‘ఎక్కవలసిన రైలు’, శ్రీమతి పి.వి.శేషారత్నం (వైజాగ్) గారి ‘నిరంతరం తరం తరం’ రచనలు ప్రత్యేక బహుమతులను పొందుతున్నాయని తెలియచేయడానికి సిరికోన బృందం అమితంగా సంతోషిస్తున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here