(పాఠకుల కోసం హాస్యకవితని అందిస్తున్నారు శ్రీ గొట్టె గోవర్ధన్)
[dropcap]మా [/dropcap]ఇంటి ముందు ఉంది ఒక చిన్న గల్లీ
అక్కడి నుంచి వచ్చింది ఓ మాయదారి పిల్లి
పోయింది అది పిండి కింద చల్లి
దానివల్ల అయింది మా ఇంట్లో పెద్ద లొల్లి
కొట్టాడు మా ఆయన నన్ను గిల్లి
అప్పుడు భయపడింది గోడకున్న బల్లి
కోపంతో పోయాడు మా ఆయన బయటికెళ్ళి
వేసుకొని వచ్చాడు నోట్లో కిళ్ళీ
బతిమాలాడు నన్ను మళ్ళీ మళ్ళీ