[dropcap]గు[/dropcap]డ్డి వెలుగులో గుడిసెలో ఉన్న
గుడ్డి గున్నయ్య బతుకులోనూ చీకటి
కంటిచూపు లేకపోయినా కంట నీరు
వస్తూనే ఉంది పస్తుల గున్నయ్యకు
గుడిసెలో తన బతుకులో వెలుగు
ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది
కన్నులలో వెన్నెల ఎప్పుడు విరిస్తుంది
ఎవరో రావాలి ఏదో చేయాలి..
అంధుడి అంధకారం పోగొట్టాలి
స్వతంత్రం వచ్చి చాన్నాళ్ళయినా
గున్నయ్యకు ఏబయ్యేళ్ళు దాటినా
దేశంలో గున్నయ్య బతుకులో
చీకటి ఇంకా రాజ్యమేలుతుంది
స్వేచ్ఛా పతాకం ఆశల కాగడా
పట్టుకొని వచ్చేదెవరు..
వెలుగులు నింపేదెవరు..
చీకటి తొలగేదెపుడు..