[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. కత్తి అంచు (4) |
4. ప్రభుత్వం ఏర్పరచటానికి కొన్ని రాజకీయ పార్టీలకు దీనికి తలొగ్గక తప్పడం లేదు (4) |
7. అధికార పార్టీ ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీని ఇలా చేస్తామని ప్రగల్భాలు పలుకుతూ ఉంటుంది (5) |
8. రహదారుల పై ఇది ఎక్కువైతే ప్రమాదమే (2) |
10. ప్రతిష్ఠ తో కూడుకున్నదే కొంతవరకే ఉంది (2) |
11. లెక్కలు ఎందుకో గతి తప్పాయి. (3) |
13. తెలంగాణ బాలుడు (3) |
14. ఈమె పేరు చూడ్డానికి అతి సుందరం. గుణం మాత్రం అతి దుర్మార్గం. ఒక మహారాజు ఉంపుడుకత్తె. (3) |
15. అడ్డగోడ చాటునుంచి మొగుడి పెళ్ళికి దీన్ని చదివించిందట. (3) |
16. పాప మృదువుగా నూ సౌమ్యం గానూ ఉంటుందట. (3) |
18. వ్యయము వ్యర్ధం కాకుండా కొంచెం నొక్కి ఒత్తండి.(2) |
21. నీ సన్నిధి లోనే అగ్ని తిరగబడి ఉంది జాగ్రత్త (2) |
22. గిలిగిలి (5) |
24. తామరతీగ అడ్డదిడ్డంగా అల్లుకుంది (4) |
25. రాజసం తక్కువేమీ లేదు ఈ రాక్షసుడికి (4) |
నిలువు:
1. రంగుల కుండలు. కొంతమంది పెళ్ళిళ్ళలో వాడతారు (4) |
2. దీని వికృతి దనియము (2) |
3. తుమ్మెద కింద నుంచి ఎగురుకుంటూ వస్తోంది (3) |
4. జటాయువు అన్న (3) |
5. కోపం వస్తే దీన్ని దేనికది విరగ్గొడతామంటారు (2) |
6. మన నూతన రాష్ట్రపతి కి ఏఁవైనా బంధువా? మన మరుడు.(4) |
9. రేలంగి కాశీకి పోయి తెచ్చినది (5) |
10. అంతిమంగా సాధించాలనుకునే లక్ష్యం (5) |
12. రాజకీయ పార్టీలు వార్ రూం లో జరిపేది (3) |
15. రెండిటి మొత్తం 108. ఇతని ముందుండే వాటిని కలిపితే.ఎవరతను? (4) |
17. పాదరసమే సంస్కృతం లో (4) |
19. బుగ్గ లోపలి భాగం (3) |
20. విశ్వాసం దీనంత ఉంటే చాలంటారు. కానీ అదిక్కడ తలదాచుకుంది. ఏమిటది?(3) |
22. దీన్ని ఆమ్రేడించండి. అడ్డం 8 లాంటిదే (2) |
23. తలరాత లో లత ఎందుకు? వద్దు! (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 సెప్టెంబరు 06 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 25 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 సెప్టెంబరు 11 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 24 జవాబులు:
అడ్డం:
1.ఎలమావి 4. గుమాస్తాలు 7. మహాత్మా గాంధీ 8. కోన 10. అవ్వ 11. టక్కరి 13. లవము 14. మంగమ్మ 15. మానవా 16. విషమ 18. తాయం 21. మును 22. జండాపండుగ 24. జైలుపాలు 25. గడగడ
నిలువు:
1,ఎర్రకోట 2. మామ 3. విహారి 4. గుగాండు 5. మాధీ 6. లున్నెవ్వము 9. నక్కవినయం 10. అవశేషము 12. పింగళి 15. మాతాకీజై 17. మనుగడ 19. దండాలు 20. నిండుగ 22. జంపా 23. గడ
నూతన పదసంచిక 24 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అభినేత్రి వంగల
- అన్నపూర్ణ భవాని
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- చెళ్శపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు మోహనరావు
- ఎర్రోల్ల వెంకట్‌రెడ్డి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కిరణ్మయి గోళ్ళమూడి
- కోట శ్రీనివాసరావు
- లలిత మల్లాది
- మధుసూదనరావు తల్లాప్రగడ
- ఎం. అన్నపూర్ణ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తల
- పార్వతి వేదుల
- పొన్నాడ సరస్వతి
- పి.వి.ఎన్. కృష్ణ శర్మ
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- యస్.పూర్ణకుమారి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శాంత మాధవపెద్ది
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- వర్ధని మాదిరాజు
- వీణ మునిపల్లి
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.