(ఆగష్టు 29 తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఈ కవిత అందిస్తున్నారు శ్రీమతి దీపిక)
[dropcap]అ[/dropcap]మ్మ ప్రేమ లోని వెచ్చదనం
కోయిల కంఠం లోని తియ్యదనం
మయూర నాట్యం లోని సొగసరితనం
మృగ జీవి లోని చురుకుతనం
వీచేగాలికి వయ్యారం ఒలికిస్తున్న
పచ్చని పైరు లోని పడుచుతనం భాష
మనసులని ముడివేసేది భాష
మనసులను వీడతీసేది భాష
తరతరాలకు తరగనిది భాష
కొత్తపుంతలు తొక్కుతు అన్నిటిని కలుపుకునేది భాష
మనతో కలకాలం ఉండేది భాష
నుడికారాల హోయలు నింపుకుంది యాస
ప్రకృతి గొప్ప వరం భాష
భాష లేనిదే భావం లేదు
రక్షిద్దాం, పరిరక్షిద్దాం.. భాషను, యాసను.
~
అందరికి తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు.