వరల్డ్స్ ఉమెన్స్ అచీవర్, మదర్ థెరీసా గ్లోబల్ పీస్ అవార్డ్, ఇంటర్నేషనల్ సర్వీస్ లెజెండ్ అవార్డుల లాంటి అవార్డు గ్రహీత రచయిత్రి, కవయిత్రి, గాయని సత్య పూర్ణిమ సాహితీ ప్రవీణ పురస్కారానికి ఎoపికయ్యారు.
సత్య పూర్ణిమ గారు తనదైన శైలిలో సాహితీ రంగంలో తమ ప్రతిభను చాటుతున్నారు.
ఏపీ లో తిరుపతి నగరానికి చెందిన వే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. పైడి అంకయ్య గారు సత్య పూర్ణిమ గారికి సాహితీ ప్రవీణ పురస్కారం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా సత్య పూర్ణిమ గారు మాట్లాడుతూ తను ఈ పురస్కారానికి ఎంపిక అవడం, ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని, ఎంతో ఆనందంగా ఉందన్నారు.