జాహ్నవి మినీ కవితలు

    1
    7
    [box type=’note’ fontsize=’16’] సమాజపు స్థితిగతులపై, మారుతున్న మనుషులపై మినీ కవితలనందిస్తున్నారు జాహ్నవి. [/box]
    1. మారిన మనిషి 
    కలం పట్టేను
    కాదు పొమ్మన్నారు.
    కత్తి పట్టేను
    గుడి కట్టిస్తామన్నారు acheter viagra sans ordonnance.

    ***

     2. నిరుద్యోగి
    ఉత్తర, దక్షిణాలివ్వని
    నిరుద్యోగి
    ఆశగా తూర్పుని చూస్తే
    పడమర పిలుస్తుంది.
    ***
    3. ఇదెక్కడి న్యాయం
    నోరుమూసుకుని అన్నీ భరిస్తే
    భరతనారిని దేవతన్నారు.
    కాదని ఎదిరిస్తే
    పిదపకాలం అంటున్నారు.
    ***
    4. భరతమాత
    కిరీటంతో కుప్పకూలి
    వల వల ఏడుస్తోంది ఓ స్త్రీ
    ఎవరా అని చూస్తే
    భరత మాత.
    ***
    5. చినుకు
    ఎక్కడో ఆకాశంలో
    పుట్టిందని గర్వం
    వచ్చి నా తలపై పడింది
    నాయకుడు కొట్టిన దెబ్బ లా
    ***
    6. తేడా
    నాడు ఫోనెత్తి ఎలా వున్నావంటే
    నేడు ఎక్కడున్నావంటున్నాడు.
    ***
    7. కలం
    కాలం కన్నా
    ముందు పరిగెత్తి
    కంప్యూటర్ తో
    ఓడిపోయింది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here