నూతన పదసంచిక-27

0
3

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఈ రోజు బృందావనంలో జరుపుకుంటున్న పండుగ ఇది (4)
4. రేపు మనం చేసేది (4)
7. ధనంతో కూడిన కొయ్యట. ఇత్తడట. (5)
8. చివరికి చేరని వసారా (2)
10. మీ పాలన లో బడి లేదు (2)
11. పడుకోబోయే ముందు తన్నడం వల్ల అస్తవ్యస్తం అయిపోయిందిది. (3)
13. ఈ మధ్యన ఒకాయన తరుచూ టీవిలో వస్తూ ఈ పదం ఉచ్చరిస్తూ  స్థలాలు అమ్ముకుంటున్నాడు.(3)
14. జ్వరం తగ్గాకా పెట్టేది (3)
15. మోసమేరా! (3)
16. అటునుంచి వెలుగులు విరజిమ్మాయి (3)
18. చీమ లో బక్క ని వెతకండి (2)
21. “పాడుతా తీయగా” అని ఉంది. ఎవడో తుంటరి పాతీయగా చెరిపేశాడు (2)
22. నక్సలైట్ల ని పోలీసులు ఈ స్రవంతి లో కలిసిపోమని‌ హెచ్చరిస్తుంటారు. (5)
24. రాజరాజ చోర చిత్రం లో  విద్య పాత్రధారిణి  (4)
25. చెట్టు తో ఉన్న బొమ్మ (4)

నిలువు:

1. రాముడిదా ఈ సముద్రం (4)
2. ప్రేక్షి శీర్షాసనం వేశాడు (2)
3. తొమ్మిదో రోజే ! తిరగేసి మధ్యలో యావత్తు చేర్చారు(3)
4. తల్లిదండ్రులు (3)
5. ఒక లేని ఒక్కవల్లె ‌ (2)
6. ఎలగనా లా ఈ తరుణి (4)
9. యువతీ యువకులు దీన్ని కంటూ ఉంటారు (5)
10. మూడు రోజుల కిందట మొక్కిన వాడు (5)
12. నిక్కము (3)
15. మోసగాడు (4)
17. ఈయన ఇంటిపేరు తాడేపల్లి. కానీ కత్తుల‌ గానే  సినిమా ల్లో ప్రసిద్ధి. (4)
19. నోరు (3)
20. మంత్రి తడబడ్డాడు (3)
22. మహాభారతము (2)
23. నడక లో దీనికి వెనుక ఉండగలరా?(2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 సెప్టెంబరు 13 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 27 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 సెప్టెంబరు 18 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 25 జవాబులు:

అడ్డం:   

1.తుమ్మబంక 4. కౌమారము‌ 7. కుచ్చుటోపీలు‌ 8. కాజ‌ 10. మరా‌ 11. కుడము‌ 13. ఎల్లలు‌ 14. మీదోడు‌ 15. మచ్చుకి‌ 16. కొల్లాయి 18. సాలు‌ 21. లుబా‌ 22. మూతివిరుపు‌ 24. యాదగిరి 25. వరమాల‌

నిలువు:

1.తునికాకు‌ 2. బంకు‌ 3. కచ్చురం‌ 4. కౌపీనం‌ 5. మాలు‌ 6. ముదరాలు‌ 9. జడకుచ్చులు‌ 10. మల్లగుల్లాలు 12. చేదోడు 15. మసానియా‌ 17. యిబాక్ష్మీల‌ 19. తితిరి‌ 20. చేరువ‌ 22. మూగి‌ 23. పుర‌

‌నూతన పదసంచిక 25 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • చెళ్శపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ఎర్రొల్ల వెంకట్‌రెడ్డి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • కోట సూర్యనారాయణ
  • లలిత మల్లాది
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • ఎం. అన్నపూర్ణ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శాంత మాధవపెద్ది
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వీణ మునిపల్లి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here