కొరియానం – A Journey Through Korean Cinema-29

1
3

No Princess Next Door 1

Chapter 26

[dropcap]ప్ర[/dropcap]స్తుతం Netflix లో సోల్ వైబ్ (Seoul Vibe) అనే Heist Comedy Action Thriller దుమ్ము రేపుతుంది అనుకుంటే, మనం భూమి పుట్టకముందు నుంచీ చూస్తున్న రెగ్యులర్ టెంప్లేట్ హాలీవుడ్ స్టైల్ మసాలా సినిమానే అది. ఈ సౌత్ కొరియన్ మెగా బజట్ సినిమా థియేటర్లలో వేసినా పెద్ద ఎవరూ పట్టించుకోరు కొరియాలో. కానీ, మన తెలుగూఫులకు మలయాళ బ్రాండ్ వేస్తే ఏదైనా గొప్ప అన్నట్లు any-thing Korean chalta hain worldwide.

కాకపోతే ఒక్క కొరియన్లకు తప్ప మిగిలిన అందరికీ ఫర్లేదనేలా నచ్చటమే కొరియన్ మేజిక్. అంటే కనీసం ఆ కొరియన్ స్టైల్ ఎమోషనల్, కామికల్ యాక్షన్ సీన్ల కోసం (మన ఎమోషన్లకన్నా కాస్త డెప్త్ ఎక్కువ కాబట్టి) ఒకసారి లాగించ వచ్చు. కొరియాలో చెత్త కింద జమకట్టిన చాలా సినిమాలు కూడా మనవాళ్ళకు (ప్రపంచవ్యాప్తంగా ఇతరులకు కూడా) కాస్తో కూస్తో నచ్చటానికి కారణం ఏంటా అని బుర్రలు బద్దలు కొట్టుకోనవసరం లేదు. వారు కథా కథన బేసిక్స్‌కు కట్టుబడి ఉంటారు. ఎన్ని సాముగరిడీలు చేసినా మనవారిలా నేల విడిచి కాకుండా నేల మీదే చేస్తారు.

కనుక ఎప్పుడూ చెప్పే కాకమ్మా-పిచ్చుకమ్మా కథ కూడా ఇంకో సారి వాకే అనేలా ఉంటుంది.

ఇంకోవైపు కొరియన్ థియేటర్లలో విడుదలైన సినిమాల్లో లిమిట్ (Limit) అనే సినిమా చాలా బాగుంది అనిపించుకుంది. కిడ్నాప్ డ్రామా. నయనతారకు నప్పే యాక్షన్ థ్రిల్లర్ తరహా కథ, కథనం. మంచి రివ్యూలు వచ్చాయి. సినిమా కూడా బాగుంది. కథనంలో కొత్తదనం ఉంది. అక్కడ ఈ సినిమా సోల్ వైబ్ అంత బజట్ లేకపోయినా మంచి విజయం సాధించింది. దీన్ని బట్టీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏ దేశానికాదేశం, ఏ ప్రాంతానికా ప్రాంతం వారు వారి వారి సినిమాల లొసుగులను ఎక్కువగా చర్చిస్తారు. కనుక దూరపు కొండలు నునుపు కాదు.

మేధావులు చెప్పినట్లు (బోల్టులు) మలయాళ సినిమాలన్నీ గొప్పగా ఉండవు. కొరియన్ సినిమాలు కూడా అంతే.

లిమిట్ గురించి విడిగా ఒకసారి కథనం గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు సుఖీ వచ్చేసింది. అటువైపు వెళ్తాం.

***

ప్రముఖ రివ్యూ సైట్ రోజర్ఈబర్ట్ డాట్ కామ్‌లో The Handmaiden కు రివ్యూ రాస్తూ ఇలా అంటారు: “The Handmaiden is voluptuously beautiful, frankly sexual, occasionally perverse and horrifically violent. At times its very existence feels inexplicable. And yet all of its disparate pieces are assembled with such care, and the characters written and acted with such psychological acuity, that you rarely feel as if the writer-director is rubbing the audience’s nose in excess of one kind or another.”

పార్క్ చాన్-వుక్ సినిమా అనగానే ముందు ఎవరైనా అనుకునేది మరో వైలెంట్ సినిమా. జుగుప్స కలిగించేంత హింస చూడబోతున్నాం అని. విడివిడిగా ఆ యా సన్నివేశాలను చూస్తే అలానే అనిపిస్తుంది. కానీ, on a whole అన్నట్లు చూస్తే… in the grand scheme of things, అసలు ఇది కూడా వైలెన్సేనా? అనిపిస్తుంది. అదొక తరహా.

కానీ ఒక్క విషయం మటుకూ స్పష్టం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, అలా అని self-indulgence తో కట్టు తప్పకుండా ఒక శాస్త్రవేత్త, ఒక భిషగ్వరేణ్యుడు ఒక రసాయనాన్ని లేదా ఔషధాన్ని తయారు చేసినట్లు ఏ షాట్‌తో ఏ ఎమోషన్‌ను పెంచాలి (ప్రేక్షకునిలో), ఎలాంటి సంచలనం కలిగించాలి, ఏ రకమైన రసస్పందన బైటకు రప్పించాలి అనే విషయాలను దృష్టిలో పెట్టుకుంటూ తూకం వేసినట్లు ఉంటాయి అతని ఫ్రేమింగ్, shot-making. కథా కథనాలు కూడా ఎక్కడా ఒక్కటంటే ఒక్క rough edge లేకుండా ఉంటాయి.

అందుకే ఎంత వైలెన్స్ ఉన్నా, అది తక్కువే అనిపిస్తుంది. లేదా ఏమీ లేని చోట జలదరించేంత వైలెన్స్ ఉందనిపిస్తుంది.

తను చూపే విజువల్స్‌తో wow అని జేమ్స్ కామరాన్ అనిపిస్తే, తన ఆలోచనా పరిపుష్టితో అదే శబ్దం మన నుంచీ బైటకు రప్పిస్తాడు పార్క్.

As of this writing, he’s always on the top of his game. Or craft.

సుఖీ కి, స్యూ కి చాలా తేడా ఉంటుంది. రెండూ దాదాపు ఒకే సోర్స్ కు చెందినవైనా. అక్కడ మాడ్ లిలీ ఇక్కడ లేడీ హిడేకో. అక్కడ మాడ్ తన అంకుల్‌తో ఉంటే ఇక్కడ ఆ Christopher Lilly పాత్ర భార్యకు లేడీ హిడేకో బంధువు.

మాడ్ ఒక విక్టిమ్. లేడీ హిడేకో కూడా విక్టిమ్ యే. కానీ, మాడ్ అంత naive కాదు. She has a distinct cruelty streak due to world weariness. అక్కడ మాడ్ అజంటిల్మన్ రిచర్డ్ రివర్స్‌ను పూర్తిగా అర్థం చేసుకోదు. అర్థం చేసుకునే పాత్ర Mrs. Sucksby. కానీ అప్పటికే కథ కంచి పొలిమేరలకు చేరుతుంది.

ఇక్కడ లేడీ హిడేకో మన అజంటిల్మన్ పాత్రను తొలి చూపులోనే అంచనా వేస్తుంది. ఈమెకు స్త్రీ సహజమైన instincts చాలా ఎక్కువ. అందుకే ఈ పాత్ర చాలా సహజంగా అనిపిస్తుంది నవలలోని పాత్రతో పోలుస్తే.

కనుక అక్కడ ట్విస్టుల మీద, పాత్రల perspectives మీద ఆధారపడిన కథనం ఇక్కడ మరింత layered గా మారి అసలైన conflict gets entangled in the subconscious. సినిమాలో పాత్రలు cerebral గా ఉంటాయి. హృదయం కన్నా మెదడు ప్రధాన పాత్ర పోషించే తర్కం మీద ఎక్కువ నడుస్తాయి.

ఉదాహరణకు, ఒక సందర్భంలో అజంటిల్మన్ లేడీ హిడేకో తో you’re mesmerising అంటాడు. దానికి nonchalant గా ఆమె, ఒక పురుషుడు స్త్రీతో you’re mesmerising అన్నాడంటే అతని కన్ను ఆ స్త్రీ కుచ ద్వయం మీద పడ్డట్టే అని సమాధానమిస్తుంది.

ఆమె కళ్ళలో ఆ క్షణాన కనిపించే expressions మనకు ఒళ్ళు జలదరించేలా ఉంటాయి. సహజంగానే అజంటిల్మన్ చూపులు ఆమె ఎద సౌందర్యం మీదే ఉంటుందా క్షణాన. The director uses a split second to get the viewer’s eyes entangled in the voluptuous breasts of Lady Hideko.

చూడటానికి మామూలు సన్నివేశం. కానీ, నవలకు, సినిమాకు ఎంత తేడా ఉందో చూపిస్తుంది.

అక్కడ వచ్చే సింఫనిక్ మ్యూజిక్, or the lack of it మనని తినేస్తుంది. ఇలాంటి సన్నివేశాలు కొన్ని సినిమాలో అవసరమైన చోట ఒక చేయి తిరిగిన స్వర్ణకారుడు తను చేసిన నగలో వజ్రాన్ని ఎక్కడ పొదగాలో అక్కడే ఉంచినంత చులాగ్గా, పార్క్ కూడా మనం ఊహించని సమయంలో ఉంచుతాడు.

సినిమాలో పార్క్ తీసుకున్న సెటింగ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎవరు విక్టిమ్, ఎవరు aggressor అనేది కూడా మనం ఒక పట్టాన నిర్ణయించుకోలేము.

ఇక్కడ సఖీ కథను కంట్రోల్ చేసే పాత్ర. కానీ, సినిమాను రెండు మూడు సార్లు చూస్తే కానీ ఆ విషయం అర్థం కాదు. కంట్రోల్ చేయబోయి పడబోయిన పాత్రే అనిపిస్తుంది పైపైన చూస్తే.

మిసిన్ఫర్మేషన్ను వెదజల్లే వారు వాట్సాప్‌ను వాడిన దానికన్నా దర్శకుడు పార్క్ చాన్-వుక్ తన నటుల ప్రతిభను వాడుకుని, వారి నుంచీ అత్యున్నత స్థాయి నటనను పిండుకుంటాడు.

Fingersmith లో లాగా ప్రేమమయి (మేరియన్) పాత్రలంటూ ఏమీ ఉండవిక్కడ.

అసలు ఈ నవలను చదవగానే సినిమాగా ఇంగ్లీషులోనే బ్రిటిష్ నటులతో తీద్దామనుకున్నాడు పార్క్. కానీ, 2005 లో ఇది సీరీస్‌గా వచ్చిందని తెలిసి దాన్ని చూశాడు. అంత పేరు పొందిన సీరీస్ నచ్చలేదతనికి. కానీ, ఒకరు వాడేసిన కథనం తను వాడకూడదనుకుని, ఆ కథలోని స్ట్రక్చర్‌ను కదల్చకుండా మిగిలినవన్నీ మార్చాడు.

అదే మాయగాడు. ఒక కిలాడీ అమ్మాయి సహాయంతో అమాయకురాలైన స్థితిమంతురాలైన యువతిని మోసం చేసి పెళ్ళి చేసుకుని ఆమెను ఎసైలమ్‌లో వేసి, ఆమె ఆస్తి కొట్టేయాలనుకుంటాడు. కానీ, నిజానికి ఈ కిలాడీని ఇద్దరూ మోసం చేసి మెంటల్ ఎసైలమ్‌లో ఉంచి ఆస్తితో చెక్కేస్తారు. కానీ వాడి నిజ స్వరూపం చూసి ఇద్దరు స్త్రీలు వాడిని తన్ని తగలేసి ఎలా ఒక్కటయ్యారు? ఇదీ కథ.

అలాగే ఉంచేసి పాత్రలను తారుమారు చేసి, మనం చూస్తున్నది నిజమా కలా అనేంత బెదరగొట్టి, మనిషి లోతుల్లో ఉండే కపటాన్ని, దాన్ని ఆనుకునే ఉండి independent existence లో ఉండే గుండె తడిని ఆవిష్కరించి, అసలు మనుషులంతా అవకాశవాదులే అని మన చేత అనిపిస్తాడు.

అది ఎలా చేశాడు అన్నది…

వచ్చేవారం చూద్దాం. లిమిట్ సినిమా క్లుప్త రివ్యూతో పాటూ.

అప్పటిదాకా, ఒక చిన్న సలహా. ఎవరన్నా మొబైల్ కొనాలనికుంటే దీపావళి సీజన్ దాకా ఆగండి. మరీ అర్జంట్ కాకపోతే.

ఇతి వార్తాః॥

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here