[dropcap]లో[/dropcap]పలి జేబుకు కూడా
బహిరంగంగా చిల్లుపెట్టి
బతుకు వీధిలో చల్లిన చిల్లరకు
మెదడులో సోమరితనం మొలకలేసి
శ్రమ చచ్చుబడి
ఆశ పెచ్చరిల్లి
తలకెక్కిన కొత్త మత్తుకు
అడుగు పాతాళంవైపు పడుతుంటే
సోమరి చేతులు స్వయంగా
పాదాల్ని వెనక్కి విరిచి
చీకటి రాజ్యానికి బానిసచేసి
రేపటి రోజు ప్రాణం పోయేలా
నేటి నిజాల్ని గొంతు నులిమితే
బలహీనతలన్నీ
బలంగా విరుచుకుపడి
వర్తమానం వెన్ను విరిగి
సంఘంలో జీవం ఇంకి
రాజకీయాలకు మనిషి ముడిసరుకయ్యాడు..
అధికారం కట్టిన విలువకు
అమ్ముడుపోతున్నాడు..