భారతీయులకు హెచ్చరిక-5

0
4

[box type=’note’ fontsize=’16’] భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినం గా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష అనువాద రచన ఇది. 1939లో ప్రచురితమైన సావిత్రి దేవి రచించిన ‘ఎ వార్నింగ్ టు ది హిందూస్’ అన్న పుస్తకాన్ని అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ. సావిత్రి దేవి గ్రీకు మహిళ. ఆమె భారత్ వచ్చి, భారతీయుడిని వివాహం చేసుకుని ఇక్కడే హిందువుగా స్థిరపడింది. దేశంలో జరుగుతున్న పరిణామాలను అవగాహన చేసుకుని భవిష్యద్దర్శనం చేసినట్టు 1939లో ఆమె రచించిన గ్రంథం ఇది. ఈ పుస్తకానికి వీర్ సావర్కర్ ముందుమాట రాశారు. ఈ పుస్తకంలో ఆమె ఏదయితే జరిగే ప్రమాదం వుందని హెచ్చరించిందో అదే నిజమవటం ఈ పుస్తకం ప్రాధాన్యాన్నీ విలువను పెంచుతుంది. ప్రస్తుతం దేశంలో మళ్ళీ అనుమానాలు, ఆవేశాలు, ద్వేషాలు అధికమై సామరస్య వాతావరణాన్ని రాజకీయ లబ్ధి కోసం కలుషితంచేసి వికృత విషపుటాలోచనలను విస్తృతంగా వెదజల్లుతున్న తరుణంలో గతంలోని పొరపాట్లను స్మరించటం ద్వారా చరిత్ర పునరావృతం కాకుండా జాగ్రత్తపడే వీలుంటుందని, చరిత్రలో మరుగున పడ్డ అనేక సత్యాలను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ అనువాదాన్ని అందిస్తున్నాము. [/box]

భారత జాతీయతావాదం, చైతన్యం

మొదటి ప్రకరణము – మూడవ అధ్యాయము

భారతీయ ధర్మం లోని మానవతా విలువ

భారతీయుల బహుదేవతారాధన పాగనిజం

ఆర్యుల సౌందర్యపు చివరి సజీవ వ్యక్తీకరణ

[dropcap]మ[/dropcap]రొక   భాస్పోరకమైన పదం, భారతీయ ధర్మానికి ఏదంటే ,  ‘బహుదేవతారాధన’.

క్రైస్తవ మతాధిపతులు, క్రైస్తవులు, ముస్లిములు, యూదులు కాని వారిని ‘పాగన్స్’ అని పిలుస్తారు. ‘పాగన్’ అంటే ప్రధాన ప్రపంచ మతాల కంటే ఇతర మత విశ్వాసాలను కలిగియున్న వ్యక్తి. క్లుప్తంగా అన్యమతస్థుడు. క్రైస్తవుడు కాని వాడు. అంటే బైబిల్‌కు, యూదుల సంప్రదాయాలకు ఏ మాత్రం సంబంధం లేని మత సంప్రదాయాలు కలవాడు. దీన్ని మనం అంగీకరిస్తాం. ఎందుకంటే అది ఎంతో సౌకర్యవంతమైనది. అది గతంలోని, ప్రస్తతం ఉన్న విశ్వాసాధారిత మతాల్లోని సారూప్యతను సూచిస్తుంది.

ఒకప్పుడు, ప్రపంచమంతా ‘పాగన్’ గానే ఉండేది. ప్రపంచ జనాభాలో సగం మంది క్రైస్తవంలోకో, ఇస్లాంలోకో మారిపోయినందువల్ల, ‘పాగన్’ల సంఖ్య తగ్గింది. విశ్వాసాధారిత మతాలతో పోలిస్తే, ఇతర బహుదేవతారాధక మతాలు హీనమైనవి అనడానికి ఆధారాలు లేవు. వివిధంగా ఉండటం ఒక మేలు, కాని సుగుణం కాదు. కాబట్టి దాన్ని అవలంబించే వారి సంఖ్యకు, ఆ మతం విలువకు సంబంధం లేదు.

క్రైస్తవులు అనబడే వారిలో సైతం, బైబిల్‌ను పూర్తిగా నమ్మని వారు చాలా మందే ఉన్నారు, వారు స్వేచ్ఛాలోచనాపరులు, అని మనం చెప్పాము. మతంతో బాటు అన్ని విషయాల్లో, ‘స్వేచ్ఛాలోచన’ అనేది భారతీయ ధర్మం లక్షణమని కూడా మనం చెప్పుకున్నాము. అలాగని, ప్రపంచంలోని స్వేచ్ఛాలోచనా శీలురందరినీ భారతీయులుగా పరిగణిస్తామని అర్థం కాదు.

ఆధ్యాత్మికంగా, భారతీయ ధర్మం ఒక మేధాదృక్పథం, జీవితం పట్ల మనకున్న అవగాహన కాని, అది మాత్రమే కాదు. అది ఒక అనేకమైన మత విశ్వాసాల ఆరాధనల సమాహారం. ఏది కావాలంటే దానిని ఎవరైనా ఎన్నుకోవచ్చు. అది ఎటువంటి ఆరాధన ఐనా కావచ్చు. అది ఆరాధనే. ఆధునిక ప్రపంచంలో కూడా మనుగడ కలిగిన, అనాదిగా బహుదేవతారాధనలలో ఒక ఆధునిక నాగరికుల్లో బహిరంగంగానే అనేక దేవతలను ఆరాధించేవారు భారతీయులే.

జపనీయులు, అధికారికంగా షింటోయిక్ క్రతువును ఆచరించే మరోరకం ప్రజలు. ఆధునిక ప్రపంచంలో వారు నాయకత్వం వహించే దేశాల్లో ఒకరు కాబట్టి, వారిని ఉదాహరణగా తీసుకోవడం ఎంతో విలువైనది. వాళ్లు ఒక విషయాన్ని పరమాద్భుతంగా ప్రదర్శించారు. అది ఏమంటే, ఇతర దేశాలతో పోటీ పడటానికి వారి యాంత్రిక పరిశోధనలను స్వీకరించడం తప్పని సరి అయినా, అంత మాత్రాన వాటిని కనిపెట్టిన వారి మతాన్ని, నాగరికతను స్వీకరించాలని లేదు. విమానాలు, యుద్ధటాంకులు, ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ, గతంలో సూర్యవంశానికి చెందిన దైవస్వరూపులైన రాజుల కాలంలోనూ ఉండేది. వారి దైవత్వాన్ని అందరూ నమ్ముతారు. ఆరు వేల సంవత్సరాల క్రితం ఒక ఈజిప్టు జాతీయుడిలాగా, భారతదేశం తన అంతర్గత బలహీనతల నుండి, విదేశీ బంధాల నుండి బయటపడినపుడు, బహుశా ఆమె జపాన్ కంటే మెరుగైన దేశం అవుతుంది. పై సత్యానికి సాక్షిగా నిలబడుతుంది.

కాలక్రమంలో ఆమె ఆర్యనాగరికతలోని, చివరి గొప్పదేశంగా మిగిలిపోతుంది. ఆర్యుల భాష, తెగ, చాలా మటుకు ఒక సజీవమైన అందమైన బహుదేవతారాధన గల మతం, పామరులకు పండితులకు కూడా.

భారతీయ ఆరాధనలకు ఈ ‘పాగనిజం’ను వర్తింపజేయడం మనం ఇష్టపడతాము. ఐరోపాలోని క్షీణించిన కొందరు ఆర్యుల చెవులకు ఇది యింపుగా ఉంటుంది. గతంలో వారు ‘పాగన్ గ్రీసు’, ‘పాగన్ సౌందర్యం’ లాంటి పదాలు వారి మేధస్సును వివరించే ఖచ్చితమైన భావవ్యక్తీకరణలుగా భావించడానికి అలవాటు పడ్డారు. అందుకే ఆ పదాన్ని, మనం ఇతర పదాల కంటే ప్రముఖంగా వాడతాము.

ప్రస్తుతం ఆమె అనుభవిస్తున్న ప్రపంచ వ్యాప్తి కీర్తిని, బహుశా భారతదేశం తన వైభవోపేతమైన రోజుల్లో కూడా పొందలేదేమో! ఈ విశ్వకీర్తి భారతీయ ఆధ్యాత్మికతను మాటి మాటికీ నిర్ధారించడం వల్లనే సాధ్యమయింది. ఇంకా, మహాత్మా గాంధీ ప్రవచించిన అహింసా సిద్ధాంతం వల్ల కూడా.

మహాత్మాగాంధీ, జీసస్‌ల స్ఫూర్తిని, గతంలో, ఇప్పుడూ, చాలామంది ప్రముఖ భారతీయులతో బాటు, ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. భారతీయ ధర్మం పట్ల ఆకర్షితులైన కొందరు యూరోపియన్లు సైతం, దాన్ని ఒక సిద్ధాంతంగా కాకుండా, దాన్ని ఒక నైతిక విశ్వాసంగా, ప్రేమ, కరుణలతో కూడాన ఒక నైతిక దృక్ఫథంగానే చూశారు. దానినే వారు క్రైస్తవంలో కూడా చూడగలిగి ఉండేవారు. క్రీస్తు యొక్క నిరాడంబర దివ్య వ్యక్తిత్వాన్ని, ఆయన సిద్ధాంతాల బంధనాల నుంచి విడిపించి చూసి ఉంటే, ఇంకో రకంగా చెబితే, ప్రపంచంలోని నలుమూలల నుండి, మంచి వ్యక్తులను మానవ జాతికి సేవ చేయడం కోసం తపన పడే ఒక మెరుగైన క్రైస్తవ మతం కోసం కనే కల. అది రామకృష్ణమఠంలోనైనా కావొచ్చు. ఒక వైష్ణవ మఠం యొక్క సభ్యులుగా తమ స్వచ్ఛమైన భక్తి పూర్వకమైన ప్రేమను వ్యక్తం చేయడానికి కావచ్చు.

ప్రస్తుత భారతీయులు అలాంటి అభిమానులను ఇష్టపడతారు. చాలా మంది, వివేకవంతులైన భారతీయుల్లో నిజమైన క్రైస్తవ మత స్ఫూర్తి ఉందనే భావాన్ని ఇష్టపడతారు. ఈ ఇష్టాల గురించి చెప్పడానికేమంది? చాలా వరకు అవి, భారత దేశపు, దురదృష్టకరమైన, వేళ్లూనుకున్న న్యూనతా భావానికి సరైన వ్యక్తీకరణలు.

ఆత్మసాక్షాత్కారాన్ని సాధ్యం చేసే స్వచ్ఛమైన ఆధ్యాత్మికత మత కర్మలలో ఉండదు. ఒక జ్ఞానియైన హిందువు, క్రైస్తవుడు ఒకలాగానే ఉంటారు. అది నిజం. అనేకమైన హిందూ పవిత్ర గ్రంథాల్లో, ఇంకా జైన, బౌద్ధ, వైష్ణవ గ్రంథాల్లో ఉన్న సంక్లిష్టమైన బోధనల్లోని చాలా అంశాలు క్రైస్తవంలో కూడా కనబడతాయనేది కూడా నిజమే. కొందరంటారు, హిందూ బౌద్ధ ధర్మాలు క్రైస్తవంలోకి ప్రవేశించాయని. ఈ భారతీయ ఆలోచనా ప్రవాహాన్ని రుజువు చేసే కొన్ని సిద్ధాంతాలున్నాయి. క్రైస్తవ బోధనలు, విద్యావంతులైన, చైతన్యవంతులైన భారతీయుల్లో పని చేయకపోవడానికి కారణం, వాటిలో భారతీయ ధర్మం ఉండటమే. సందేహం లేదు.

ప్రేమను బోధించే మతం భారతదేశానికి కొత్త కాదు. పురాతన యూరోపుకు అది కొత్తయి ఉండవచ్చు.

భారతీయ ధర్మం, అది పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవ మతంచే అధిగమించబడడానికి ముందు, ఆర్యుల బహుదేవతారాధన( paganism) యొక్క లక్షణాలను, ఒక వేదాంత తత్త్వ సమూహంగా, ఒక పూజా విధానంగా కూడా కలిగి ఉండేదనడం, నిజాన్ని ఎంత మాత్రం తక్కువ చేయదు. ఇక్కడ, పురాతన గ్రీసు దేశంలో లాగే, పరస్పర విరుద్ధమైన తాత్విక భావనలుంటాయి, వాటిలో చాలా తక్కువ సామ్యాలుంటాయి. (ఉదా- ఒకరు లేదా ఇద్దరిలో ఆత్మలు  ఒకరి నుంచి ఒకరిలో ప్రవేశించడం) ఇంకా భారతీయ ఆరాధనలో, భారతీయ జీవితంలో అత్యవసరమైనది, జీవించడానికి కావలసినది, సౌందర్యం! ప్లేటో మహాశయుడన్నట్లు, కనబడే సౌందర్యమే కనబడని సౌందర్యానికి దారి తీస్తుంది.

ఈ రోజుల్లో, జనం భారతదేశాన్ని గురించి చెప్పేటప్పుడు దాని అదృశ్య సౌందర్యం గురించే ఎక్కువగా మాట్లాడుతారు తప్ప, కనబడే అందాన్ని పట్టించుకోరు. తెలిసినవారు, తెలియనివారు కూడా “ఆధ్యాత్మికత! ఆధ్యాత్మికత!!” అనే అంటుంటారు అది ఒక కొత్త పంథా. దాని పట్ల మొగ్గు చూపకపోతే, వాళ్లు భారతదేశానికి మిత్రులుగా కనబడరు. వాళ్లు నిజమైన భారతీయ దేశ భక్తులుగా కూడా కనబడరు.

కాని భారతీయుల భౌతిక సౌందర్యాన్ని ఎవరూ నొక్కి చెప్పరు. కాని వారంతా కలిసి భారతీయ ధర్మమే, భారతదేశమే. అన్ని తత్త్వాలను కలిపినా, ఒక వ్యక్తికైనా, దేశానికైనా, మొదటి అర్హత అతని లేదా దాని శారీరిక సౌందర్యమే. ఒక నిజమైన సుందర శరీరంలో, ఒక హీనమైన ఆత్మ ఉండదు. అంతర్లీనమైన ఆత్మను ఆవిష్కరించేది, ప్రతిబింబించేది, శరీరమే. ఒక అందమైన జాతి, తప్పకుండా ఒక గొప్ప జాతి కావడానికి చాలా ఆస్కారముంది. భారతీయ సంస్కృతిని ప్రజలు ఒక అగోచరమైన మొత్తంగా, అది ఎక్కడైనా సరే పరిఢవిల్లగలిగి ఉండేదానిగా భావిస్తారు. వారు మరచిపోయేదేమంటే, ఒక జాతిగా భారతీయ ధర్మాన్ని జీవించేవారు ప్రపంచంలోని అత్యంత సందరమైన జాతుల్లో ఒకరని తెలుసుకోకపోవడం. వారి సంస్కృతికీ వారికీ మధ్య ఒక అంతుపట్టని పోలిక ఉంది.

అనేక మంది భారతీయులకు, భారతీయ మతక్రతువులు, గొప్ప చిహ్నాలుగా ఉంటాయి, ప్రతీకాత్మక విలువ కలిగి ఉంటాయి.

అధిక సంఖ్యాకులైన భారతీయులకు అదే అంతా. కానీ, ఎవ్వరూ భారతీయుల దైనందిన పూజలో కనబడే సౌందర్యాన్ని గురించి చెప్పరు. భారతీయుల పండుగలు, ఉత్సవాలలోని సౌందర్యాన్ని వారు లెక్కలోకి తీసుకోరు. చాలా మంది విద్యావంతులైన భారతీయులు, బాహ్యమైన, కళ్లనూ చెవులనూ ప్రభావితం చేసే, తమ మతాన్ని పొగడడం, తమ అంతస్తుకు తగనిదిగా భావిస్తారు.

కాని సౌందర్యం, భౌతిక సౌందర్యం యొక్క ఆకర్షణకు కాదనడం సాధ్యం కాదు.

కొందరు పాశ్చత్య ఆర్యన్లు పడే భయంకరమైన పశ్చాత్తాపాన్ని గురించి మనం ఇదివరకే చెప్పుకున్నాం. వారి జాతిని గురించిన స్పృహను వారు గుర్తుకు తెచ్చుకుంటారు. తమ పూర్వీకులు ఐరోపా యొక్క గత జాతీయ ఆరాధనలకో విశ్వాస పాత్రులుగా ఉండి ఉంటే, ఎలా వుండేదో అని మథనపడుతూ ఉంటారు. పాశ్చాత్య క్రైస్తవ దేశాలో, దగ్గరి ప్రాచ్య దేశాల్లో గత స్మృతుల పట్ల మక్కువ కొత్తదేమి కాదు. అది పదహారు వందల సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. జూలియన్ చక్రవర్తి “పురాతన ప్రపంచపు” మతాన్ని, సమాజాన్ని వాటి గత వైభవాన్ని తిరిగి పొందేలా చేయడానికి చాలా ప్రయాసపడ్డాడు. కొందరి హృదయాల్లో అది “పురాతన ప్రపంచంగా” అభివృద్ధి చెందుతూనే ఉంది. సూదూరకాలం నుండి చూస్తే, అది మరింత ప్రియతమంగా కనబడుతుంది.

ఈ పురాతన ప్రపంచానికి, దాని లోటుపాట్లు దానికున్నాయి. దుర్గుణాలున్నాయి. వాటి వల్లే అది పతనమైంది. కాని దానిలోని జ్ఞానులు, మానవ మేధస్సుకీ గర్వకారణైన వారు. అన్నింటినీ మించి, ఐరోపాకు దగ్గరి ప్రాచ్యానికి  తెలియనిది, ప్రేమించతగింది ఒకటుంది. దృశ్యమాన సౌందర్యాన్ని బహిరంగంగా ఆరాధించడం.

ఈ ఆరాధన హిందూభారతంలో తప్ప మరెక్కడా కనబడదు. దాని చివరి ప్రకాశవంతమైన ఇల్లు, భారతదేశమే.

ఒకరోజు, జూలియన్ చక్రవర్తి, కాన్‌స్టాంటినోపుల్ వీధుల్లో, నిసర్గ సౌందర్యానికీ, పొంగిపొరలే జీవన మాధుర్యానికీ అధిష్టాన దేవత ఐన ‘దయానిసోస్’ అనే దేవుడిని గౌరవిస్తూ, ఒక ఊరేగింపు జరపాలని ప్రయత్నించాడంటారు.

కాని అప్పటికే ఆలస్యమయింది. ఆ ప్రయత్నం విఫలమైంది. ఆ ఊరేగింపు, ఒక నవ్వుల పాలయిన ప్రదర్శన ఐంది. అది  పూర్తయింతర్వాత, జూలియన్ కళ్లల్లో మధ్యధరా ప్రపంచపు కాంతిహీనమైన భవిష్యత్తు అంతా, అత్యంత విషాదంగా ప్రతిఫలించింది. ఆయన తన రాజభవనం ముందున్న ఉద్యానవనంలో, పాలరాతి స్తంభాల మందు కూర్చుని ఉండగా, అతని విషాదాన్ని గమనించిన ఆప్తమిత్రుడొకరు ఇలా అడిగాడంటారు. “నీవు దేనిని ఆశించావు? ఇవి మన అవసానపు రోజులు. ఈ ఊరేగింపును జరపడంలో నీ ఉద్దేశం ఏమిటి? నీకేం కావాలి?” అని. చక్రవర్తి అతని వైపు మౌనంగా చూసి, ‘ఇవి’ తీగను పక్కకు జరిపి అక్కడ ఉన్న దానిని చూపాడట. గతకాలపు కళాకారుడు చెక్కిన ఒక కళాఖండాన్ని. దయానిసోస్ గౌరవార్థం అతడు తెల్లని పాలరాతితో చెక్కాడు. ప్రపంచపు యవ్వనపు చిరనవ్వు! ఒక సుందర శిల్పం! “ఇదీ నేను కోరింది.”

అది ఘనత వహించిన సముద్రగుప్తుడు భారతావనిని పరిపాలిస్తున్న కాలం. ఓ! అప్పటి దైనందిన జీవితం, పండుగలు, దేవతల గౌరవార్థం జరిగే ఊరేగింపులు, వాటన్నిటిలోని అద్భుత సౌందర్య ప్రదర్శన, ఇవన్నీ జూలియన్ చక్రవర్తి చూడగిలిగి ఉండి ఉంటే! ఆ విలాస భూమిలో ఆర్యుల బహుదేవతారాధన ఎలా సజీవంగా నిలిచి, వెలిగిందో ఆయన దర్శించగలిగి ఉండి ఉంటే! భారతదేశం ఒక అనంతమైన భవిష్యత్తు ద్వారా భారతదేశం, ఒక తరం నుంచి ఇంకో తరానికి ప్రపంచపు యువ తత్త్వాన్ని పరిరక్షిస్తుందని గ్రహించి ఉండేవాడు.

అప్పుడాయన, తప్పక, కన్నీటితో, ఈ మహోన్నత దేశాన్ని దీవించి ఉండేవాడు.

ఒకసారి మధురకు, రామేశ్వరానికి వెళ్లి చూడండి. ఎలాంటి నిజమైన భారతీయ ఊరేగింపులు కనువిందు చేస్తాయో! ఏనుగులు తమ విశాలమైన నుదుట గంధము కుంకమ తిలకాలను ధరించి, బంగారు జరీ గల పట్టు వస్త్రాలు తమ శరీరాల మీద, నేలకు జీరాడుతుండగా, ఠీవిగా నడుస్తుంటాయి. మురళీనాదం, తప్పెట ధ్వనులు, అర్ధనగ్న ఇత్తడి పాత్రలలో వెలిగే కాగడాలు, సజీవ గ్రీకు ఆకృతుల్లా ఉంటాయి. పువ్వులతో అలంకరించబడిన రథాలు కోనేరుల తీరంలో విహరిస్తాయి. ఆ పవిత్రమైన జనసందోహాన్ని చూడండి (వందలు, వేలల్లో, భారతదేశంలోని అన్ని మూలల నుండి వచ్చిచేరిన వారు)  ఆ రథాలపై పూలు చల్లుతుంటారు. వీటన్నింటి వెనుక, ప్రశాంతమైన జలరాశి మీద, అందమైన జనసమూహం, మహోన్నత స్తంభాలు, పిరమిడ్ ఆకారంలోని శిఖరాలు, వీటన్నిటి నేపథ్యంలో, ఒక, నిరాడంబర జాజ్వాల్యమాన వినీలాకాశం!

భారతీయ జీవనంలోని ఒక సాధారణ దృశ్యాన్ని పరిశీలించండి. యువతులు వరుసగా ఒక దేవాలయంలో ప్రవేశిస్తున్నారు. కాంతివంతమైన రంగులు గల చీరలను ధరించారు వారు. వారి మేనిపై ఆభరణాలు తళతళ మెరుస్తున్నాయి. వారంతా భరతమాత గారాల కూతుళ్లు. వారి తలలో పూలమాలలు. వారి చేతుల్లో భగవంతునికి అర్పించడానికి తెచ్చిన ఫలపుష్పాలు, నివేదనలు. నేపథ్యంలో, బోదెగడ్డి కప్పిన పాకలు. ఎత్తైన కొబ్బరి చెట్టు, చుట్టూ ఆకుపచ్చని వరి చేలు. ఇదీ భారతీయ గ్రామీణ నిసర్గ ప్రకృతి సౌందర్యం.

ఏధెన్స్ నగరంలోని అక్రోపోలిస్ శిఖరం మీద వెలసిన దైవమందిరం మీద రెపరెపలాడే పట్టు వస్త్రంలా కళకళలాడుతున్న ఆ యువతులు గత ఏధెన్యు సుందర కన్యల్లా ఉంటారు. సౌందర్యారాధకుడు, సూర్యరాధకుడు ఐన జూలియన్ చక్రవర్తి వారిని గనక చూసి ఉంటే, తన స్వప్నంలోని వాస్తవికతను దర్శిస్తూ ఇలా అని ఉండేవారు “ఇదీ నేను కావాలనుకున్నది!”

కాని, ప్రసిద్ధమైన భారతీయ ఆరాధనలలోని రీతులు, రంగుల ద్వారా మాత్రమే కాదు భారతీయ ధర్మం సుందరమయ్యేది! భగవంతుడిని సృష్టి స్థితిలయకారునిగా భావించే ఉదాత్తత, జీవితం, విశ్వం పట్ల, ఆ ధర్మానికి ఉన్న, కళాత్మకమైన దృక్పథానికి వ్యక్తీకరణ.

విశ్వసాధారిత మతాల్లో కేంద్ర బిందువు మానవుడే. నేపథ్యం మానవుని హ్రస్వ చరిత్ర. వాడి దుఃఖం, సంతోషం కోసం వాడి వెంపర్లాట, వాడి పరిధి, వాడి ముక్తి. మానవుడి తండ్రియైన దేవుడు, తన ప్రత్యేక సృష్టియైన మానవుడి పట్ల, ఒక పక్షపాత పూరితమైన కరుణను కలిగియుంటాడు.

కాని వివేకవంతమైన భారతీయ ధర్మంలో, జంతువులను మానవులుగా భావించే ఇలాంటి అభిప్రాయాలకు తావు లేదు. దానికి కేంద్రబిందువు ఈ విశ్వం యొక్క ఉనికి. దానిలో మానవుడు ఒక భాగం మాత్రమే. భగవంతుడు ఒక లోతైన అంతశ్శక్తి. ఆ ఉనికికి మూలాధారమైనవాడు, సాక్షాత్తు పరమాత్మ!

అతనికి వ్యక్తిగత ఇష్టాఇష్టాలు ఉండవు. కాలక్రమాన పుట్టి, గిట్టే ఏ జీవుల పట్ల ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉండదు. అనంతమైన స్థితుల సమాహారం, అగణ్యమైన ఆయనను ఒక అంతర్యామిగా భావించడం. అన్నింటికీ కారణభూతుడుగా, జననం, మరణం, పునర్జననాన్ని శాసించే కర్తగా ధ్యానించడం అదీ భారతీయ ధర్మంలో దైవారాధన. ఆయన ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాని నిరంతరం ఒక్కడే. ఆయన లీలకు తుది, మొదలు, కారణం ఉండవు. కాని, ఒక క్షణికమైన జీవరాశి కూడా ఆయన సృష్టిలో సుందరంగా ఉంటుంది.

అన్ని జీవరాశుల, వ్యక్తుల తలరాత, నెమ్మదిగా పెరగడం, ఆయన లీలలోని సౌందర్యం పట్ల చైతన్యం కలిగి ఉండటం. చివరికి ఆ లీలాశక్తి యొక్క స్వరూపాన్ని అనుభూతించడం. ఆ లీల తనతోనే అని గ్రహించడం. ఆ లీలా స్ఫూర్తిని ఎరిగిన వారు లేరు, దానిని తమలోనే ఆత్మసాక్షాత్కారం గావించుకొన్నవారు తప్ప. కాని మనమందరం దాన్ని ప్రశంసిస్తాం. దాని ముందు మోకరిల్లుతాం. ఎందుకంటే అదే భగవంతుడు కాబట్టి. దాన్ని భగవంతుడుని పిలుస్తాం కాబట్టి. దాని కోటానుకోట్ల అంశాలను ఆరాధిస్తాం (మనల్ని నశింపచేసే వాటిని, సాయం చేసే వాటిని కూడా). ఎందుకంటే అది సత్యం, శివం, అనంత సుందరం.

సృష్టి అనేది భగవంతుని లీలలో సగ భాగం మాత్రమే. మానవులు ఆయన ఒక పార్శ్వాన్ని మాత్రమే ఆరాధిస్తారు. కాని భారతీయులు ఆయనను సంపూర్ణంగా కొలుస్తారు. ఆయన లీలా సౌందర్యానితో సహా. వారు ఆయనను వినాశంలో, సృష్టిలో కూడా ప్రస్తుతిస్తారు. ఆయన మహోగ్ర ‘శక్తి’ని, ‘కాళీమాత’లో, ‘దుర్గాదేవి’లో, ‘జగద్ధాత్రి’లో, ‘చిన్నమస్త’లో పూజిస్తారు. ఈ శక్తి రూపాలన్నీ నిరంతరంగా తమను తాము నశింప జేసుకుంటాయి. పునరుత్పత్తి అవుతాయి. పది రకాలైన ‘మహావిద్యలు’ నిజానికి ఒక్కటే. వారు నటరాజు అయిన పరమేశ్వరుని ఆరాధిస్తారు. ఆయన, మానవ జీవితాన్ని తొక్కేస్తూ, దానిని క్రోధంతో కూడిన ఒక లయలో నశింపచేస్తుంటాడు. కాని జ్ఞానాన్ని ఆవిష్కరించే, వైరాగ్య సంపన్నమయిన ఆయన వదనం మాత్రం, చిరునవ్వులు చిందిస్తున్న సముద్రంలాగా ప్రశాంతంగా ఉంటుంది.

సౌందర్యాన్ని దర్శించగలిగినవారికి సృష్టి ఐనా, వినాశమైనా ఒకటిగానే కనబడతాయి.

భారతదేశానికి లభించే గొప్ప ప్రశంస ఇదే. ఆమె ప్రజలు మాత్రమే కాదు సుందరులు. ఆమె దైనందిన జీవితం. ఆమె చేసే ఆరాధన మాత్రమే కాదు సుందరం. ఈ వినిమయాత్మక, మానవతా శీల, మూఢనమ్మకాల ఆధునిక కాలంలో, “ఆమె, సౌందర్యం సౌందర్యం కోసమే” అన్న విశిష్టమైన భావాన్ని ప్రకటిస్తూనే ఉంటుంది. భగవత్ తత్వం, మతం, జీవనం.. వీట పట్ల ఆమెకున్న దృక్పథం ద్వారా.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here