[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం మొదటి రోజుల్లో తెర మీద కన్పించి పాడిన చిత్రం ఏది?
- ఎన్.టి.ఆర్., కాంతారావుల ఒకే పేరు గల చిత్రం ఏది?
- ఎన్.టి.ఆర్. సావిత్రి, బి. సరోజా దేవిలు నటించిన ఏ చిత్రంలో ఎన్.టి.ఆర్. స్వయంగా మాట్లాడక వేరేవారు వాయిస్ ఇచ్చారు?
- ఎన్.టి.ఆర్, జగ్గయ్య, అంజలీదేవి, జమునలు నటించిన చిత్రంలో జమున తండ్రిగా నటించినది ఎవరు?
- కైకాల సత్యనారాయణ ప్రధాన పాత్రలో నటించిన ‘నా పేరే భగవాన్’ చిత్రానికి ఏ హిందీ సినిమా మాతృక?
- ‘జీవితమే సఫలము, రాగసుధా భరితము’ అను పాట జిక్కి పాడారు. ఆ పాటకి హిందీ మాతృక ఏ చిత్రం లోనిది?
- హిందీ సంగీత దర్శకుడు సలీల్ చౌదరి సంగీత దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ఏది?
- హిందీ నటి ‘నూతన్’ పాడిన తెలుగు చిత్రం ఏది?
- హిందీ సంగీత దర్శకుడు సి. రామచంద్ర తొలిసారిగా సంగీతం అందించిన తెలుగు చిత్రం ఏది?
- నటి జమున స్వంతంగా పాట పాడిన చిత్రం ఏది?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2022 సెప్టెంబరు 27వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 3 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2022 అక్టోబరు 02 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 1 జవాబులు:
అడ్డం:
1.కృష్ణ 2. జయంతి 3. గుమ్మడి 4. ఇరుగుపొరుగు 5. దైవబలం 6. విజయగౌరి 7. మూగనోము 8.నీరాజనం 9. జీవిత చక్రం 10. ఝండా ఉంఛా రహే హమారా
సినిమా క్విజ్ 1 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- సి. గోవింద రావు
- సిహెచ్.వి.బృందావనరావు
- గోనుగుంట మురళీకృష్ణ
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మణి నాగేంద్ర రావు బి
- మత్స్యరాజ విజయలక్ష్మి
- రామలింగయ్య టి
- ఎస్. సునితా ప్రకాష్
- శంభర వెంకట రామ జోగారావు
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]