కొరియానం – A Journey Through Korean Cinema-31

0
5

We Shall Be Back

Chapter 27 Epilogue

[dropcap]S[/dropcap]creenplay గురించి పుస్తకాలనుకున్నాం కదా. అందులో సిడ్ ఫీల్డ్ ట్రైలాజీ మొదటిది.

తరువాత చదవాల్సిన పుస్తకం.. చెప్తే ఆశ్చర్య పడవచ్చు. కానీ, మిస్ కాకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది. ఐన్ రాం౨డ్ వ్రాసిన ‘ద రొమాన్టిక్ మా౨నిఫెస్టో’.

స్టైలైజేషన్ అంటే ఏమిటో తెలుస్తుందీ పుస్తకం వల్ల. ఎందుకు స్టైలైజేషన్ గురించి మాకు అంటే.. ఈమధ్య ప్రతి ఒక్కరూ స్టైలిష్ మేకింగ్, స్టైలిష్ టేకింగ్ ఆంటున్నారు. అసలు అదేంటో నిజంగానే తెలియకుండా. నేను నాకు తెలుగు రాకపోయినా తెలుగులో రాస్తున్నట్లు.

అసలు లిటరేచర్‌లో స్టైలైజేషన్ అంటే ఏమిటి? అది ఏ విధంగా ఉపయోగ పడపతుంది అన్నది మనకు సరిగ్గా అర్థమవుతాయి The Romantic Manifesto చదివితే. As the saying goes… “if it ain’t on paper, it ain’t on screen,” ఈ స్టైలైజేషన్ గురించిన సమాచారం filmmaking లోనూ ఉపయోగపడుతుంది. Nobody has written about it better than her since.

ఈ స్టైలైజేషన్ అన్నదాన్ని చాలా ఎఫెక్టివ్‌గా పార్క్ చాన్-వుక్ ఎలా వాడుకున్నాడు అన్నదానికి The Handmaiden మూడవ అంకం (3rd Act) మంచి ఉదాహరణ. దీని గురించి మరింత వివరంగా I’m A Cyborg But That’s Okay అనే సినిమా గురించి చూసేప్పుడు వివరంగా మాట్లాడతాను.

ఇక The Romantic Manifesto లో ముఖ్యంగా ఐదవ అధ్యాయమైన బేసిక్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ లిటెరేచర్ నాలుగైదు సార్లు చదవాలి.

అయన్ రాం౨డ్ వ్రాసిన ఈ పుస్తకంలో ఎక్కువ రిటెన్ ఫిక్షన్ (నవలలూ, షార్ట్ స్టోరీల) గురించే అయినా, స్క్రీన్ రైటింగప్పుడూ బాగా పనికి వస్తుంది.

ఈ చెప్పుకున్న అధ్యాయంలో

1) Theme

2) Plot

3) Characterization and

4) Style

వీటి గురించి అద్భుతమైన ఉదాహరణలతో వివరిస్తుంది రచయిత్రి. Plot-theme integrity అంటే ఏమిటో బహు చక్కగా వివరిస్తుంది. మైకెలాన్జెలో ఆ౨న్టోనియానీ చెప్పినట్టు.. “Everything must fall into place” అంటే ఏమిటో ఇంతకన్నా గొప్పగా ఎవరూ ఇంకెక్కడా చెప్పలేదు. కథా, కథనం, వర్ణనలూ మొదలైనవి ఎలా ఉపయోగించాలో, ఎక్కడ త్రుంచాలో అన్నవి తెలుస్తాయి.

సిడ్ ఫీల్డ్ చెప్పే “What is the story about? And who is the story about?” అన్నవి ఈ పుస్తకంలో థీమ్ అన్న విభాగంలో బాగా అర్థమవుతాయి.

అలాగే కారక్టర్ డెవలప్మెంట్ గురించీ, కారక్టర్ కన్టిన్యుటీ అన్న దాని గురించీ, కన్సిస్టెన్సీ ఆఫ్ ఎ కారక్టర్ అన్న విషయం గురించీ మంచి ఉదాహరణతో వివరిస్తుంది.

విషయాలను స్క్రీన్ రైటింగ్‌కు అన్వయించుకుంటూ చదవాలి. రాం౨డ్ గొప్ప విజువల్ స్టైలిస్ట్ కావటం వల్ల ఈ పుస్తకంలోని వివరాలు చాలా ఉపయోగకరం. చదివిన తరువాతెలాగూ ఆ మాట అంటారు. కాకపోతే ముందు సిడ్ ఫీల్డ్ ట్రైలజీ చదివాకే ఇది పట్టుకోవాలి.

ఒక చిన్న హెచ్చరిక.. స్క్రీన్ రైటింగ్ కోసమని రాం౨డ్ పుస్తకం చదవమన్నాను కదాని నా మీదకు యుద్ధానికి రాకూడదు. అసలే ఆమెంటే పడని వాళ్ళు చాలా మందే ఉన్నారు.

ఇంకో విషయం పొరపాటున కూడా రాం౨డ్ వ్రాసిన స్క్రీన్ప్లేల గురించి ఆలోచించకండి. అంత నాసి రకంవి మెయిన్‌స్ట్రీమ్‌లో దొరకవు 😉. ఇది పట్టుకుని ఆవిడను కూడా మంచి స్క్రీన్ప్లే రాయమనండి. అప్పుడు చూద్దాం. అని తెలుగూఫ్ సినీ అభిమానుల లాగానో, మేధావి దిగ్దర్శకుల లాగానో చెప్పవద్దు. Vకారంగా ఉంటుంద తర్వాత. ఐన్ ర్యాండ్ 1982 లోనే.. అదీ కథ.

She is an authentic writer. That’s all.

తరువాత చూడాల్సింది/చదవాల్సింది.. పుదొవ్కిన్

V.I. Pudovkin!

On Film Technique, and Film Acting అన్న ఈ పుస్తకం తప్పక చదవాల్సిన పుస్తకం. ఆన్లైన్లో ఫ్రీగానే దొరుకుతున్నదిది. నేనైతే హాయిగా అనువదించేసుకున్నాను, రెండు విభాగాలకు సంబంధించినవి యాభై యాభై వ్యాసాల చప్పున 😀.

పుదొవ్కిన్‌లో ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, మొదలైన వాటి మీద సమగ్రమైన సమాచారమిచ్చారు. అవసరం లేని వాటిని ఎలా తెగ్గొయ్యాలో, లాగి అవతల పడెయ్యాలో, అన్నదీ, మరియూ, విజువల్ స్టోరీ టెల్లింగ్ (సిడ్ ఫీల్డ్ అనే మాట) అన్నది రచయితకు కూడా ఎంత వరకూ అవగాహన ఉండాలో.. నేను చెప్పే కన్నా మీరే చదివి తెలుసుకోవటం ఉత్తమం.

ఇక చివరగా చదవాల్సినది.. Joseph V. Mascelli వ్రాసిన The Five C’s of Cinematography: Motion Picture Filming Techniques అన్న పుస్తకము. సినిమాటోగ్రాఫర్లది స్క్రీన్ రైటర్లకెందుకయ్యా? అంటారా? ఫర్లేదు. కాస్తన్నా చదవాల్సిన, మరీ డీప్‌గా అవసరం లేదనుకోండీ. కానీ అవగాహన కోసమైనా చదివితే, ఎంత ఉపయోగకరమో అన్నది ఒక స్క్రీన్ప్లే వ్రాస్తున్నప్పుడు తెలుస్తుంది.

Breaking The Third Wall

ఎటూ screenplay గురించి వచ్చింది కనుక ఒక రెండు విషయాల గురించి చెప్పేస్కుంటే (బై ద వే, ఈమధ్య Crocs గురించి బాగా వింటున్నాను. అంత బాగున్నాయా? లేకపోతే Sketchers బాగుంటాయా?) మన దారిన మనం చక్కా పోవచ్చు. సుఖీతో మన interaction ని ఒక కంక్లూజన్ కు తెచ్చి.

ఎందుకంటే ఆ విషయాలు The Handmaiden తో పాటూ, దీని తరువాత సినిమా గురించి పరిశీలించేప్పుడు ఉపయోగ పడతాయి.

స్థూలంగా చూస్తే Hollywood స్టూడియోల నుంచి చాలా వరకూ కమర్షియల్ సినిమాలు అనుసరించేది సిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్. కాకపోతే దర్శకులు వారి వారి క్రియేటివ్ పరిథులను బట్టీ ఆ స్ట్రక్చర్‌లో కొన్ని వేరియేషన్లు చేసుకుంటారు. వారి వారి అవసరాలను బట్టీ. లేదా indulgence బట్టీ.

అలాంటి వేరియేషన్లలో బాగా సక్సెస్ అయిన వేరియేషన్ “జేమ్స్ కామరాన్ వేరియేషన్”. దీనికే ఇంకో పేరు All Action Third Act. అంటే కథ దాదాపు రిజాల్వ్ అయ్యి, protagonists and antagonists ముఖాముఖీ తలబడటమే ఉంటుంది. క్లైమాక్సు ట్విస్టుల లాంటి పనికిమాలిన హడావుడి ఉండదు. కేవలం తన దర్శకత్వ పటిమతో, తన ఇమా౨జినేషన్‌ని వాడి సృష్టించిన విజువల్స్‌తో కట్టిపడేసి చివరికంటా చూసేలా చేస్తాడు.

ఒక్కొక్కసారి కిక్ కోసం అయితే హీరోదో, విలన్‌దో పనైపోయింది అనిపించి మనను నమ్మించి (దీనికి చాలా స్కిల్ కావాలి) సినిమా ముగిసిందని అనుకున్న టైమ్‌తో ఒక జోల్డ్ ఇచ్చి ఇంకో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ చూపిస్తాడు. కనీసం అరగంట స్క్రీన్ టైమ్ కేవలం యాక్షన్ పార్ట్ మాత్రమే ఉంటుంది.

మొదలవటం ఒక చిన్న బజట్ థ్రిల్లర్‌తో మొదలైనా, ఇది నిజానికి High Concept, High Budget blockbuster (మన బాక్సాఫీసు బ్లాక్బస్టర్లు కావు. ఈ బ్లాక్బస్టర్లనేవి ఒక సపరేట్ జాన్రా) సినిమాలకు బాగా సూటవుతుంది.

దీంట్లోనూ క్లైమాక్టిక్ ట్విస్టులు ఇరికించాలని చూసేవాళ్ళుంటారు. కాకపోతే ఆ ప్రయత్నాలు The Dark Knight Rises లో లాగా బెడిసి కొడుతుంది. ఎందుకంటే కథ ఆల్రెడీ ఇక్కడ పూర్తి అయింది. విలన్ చావటం ఖాయం. కాకపోతే ఆ విలన్‌ను హీరో లేదా హీరోయిన్ ఎలా చంపుతారు అనేది pure (action) spectacle ద్వారా చూపెట్టాలి. అలా కాకుండా ఇక్కడ ట్విస్టులు, మైండ్ బెండింగ్ మూమెంట్సు అని ఇరికిస్తే

Porsche కారుకు హెవీ ట్రక్ exterior ఇచ్చినట్లవుతుంది.

ఇదే screenplay variation ను పార్క్ చాన్-వుక్ యాక్షన్ బదులు డ్రామాతో నడిపించి భలే కిక్ ఇస్తాడు The Handmaiden లో.

ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం కొన్ని పాయింటర్లు.

బేసిగ్గా Syd Field ప్రతిపాదించిన Screenplay Structure ఇదీ.

  1. Beginning
  2. Plot point 1
  3. Pinch 1
  4. Midpoint
  5. Pinch 2
  6. Plot point 2
  7. Resolution

దానికి James Cameron Variation

  1. World
  2. Plot point 1
  3. Pinch 1
  4. Midpoint
  5. Pinch 2
  6. Plot point 2
  7. All action resolution 1
  8. Resurrection
  9. All action resolution 2
  10. End

James Cameron variation.

అవే మూడు అంకాలు లేదా Acts. కానీ adjustments చేసి తనదైన creativity ని కలిపాడు. ఆ కలిపింది ఎంత యూనివర్సల్‌గా ఉంటుందంటే అసలు అదొక వేరియేషన్ అని ఎవరూ గుర్తించలేనంత.

జాగ్రత్తగా గమనిస్తే బాహుబలి రెండు భాగాల్లోనూ జేమ్స్ కామరాన్ తరహా స్క్రీన్ప్లే కనిపిస్తుంది.

రెండవ యాక్ట్‌తో కథను ముగించి, ఆల్ యాక్షన్ మూడవ యాక్ట్ ఉంటుంది. అంటే సినిమా ముగియటానికి నలభై పైచిలుకు నిముషాల ముందే అంతా డిసైడెడ్. ఆ తరువాతంతా నోరు తెరచుకుని ఎంజాయ్ చేయటమే.

కాకపోతే మొదటి భాగంలో పని చేసినట్లు ఈ విన్యాసం రెండవ భాగంలో పని చేయలేదు. ఇమా౨జినేషన్ కరువైందా?

కట్టప్ప మిత్రుడు అస్లామ్ ఖాన్ ను తీసుకువచ్చి, రెండు సైన్యాల మధ్య పోరుగా పెట్టి ఉంటే.. ఒక్కసారి ఊహించండి!

The Avengers లో ఈ వేరియేషన్‌యే కనిపిస్తుంది. కాకపోతే Avengers మధ్య బాండింగ్ అనే చిన్న ఎమోషనల్ పైపూత పూశాడు Joss Whedon. అలాగే, ఈ all action climax అనే దాన్ని second act లోనే ముగించి, third act ను ఒక సబ్ ప్లాట్ మాదిరి మార్చి, ఎమోషనల్ డ్రామా, ఒక చిన్న యాక్షన్ సీన్ వాడి అసలు వేరియేషన్ బ్యూటీ చెడకుండా Captain America: Civil War తీశారు. అయినా ఆ సినిమాలో third act గురించి mixed critical response వచ్చింది.

Overall Infinity Saga లో అది చెల్లింది. కానీ ఆ సినిమా వరకూ మాత్రమే తీసుకుంటే అంతగా అతకలేదనేది MCU క్రిటిక్స్ ఉవాచ. మరి ఈ వేరియేషన్ ఎలా ఉంటుందో మరెవరైనా వాడితే కానీ తెలీదు.

Chapter 28

ఇలాంటి ప్రయోగమే కేవలం డ్రామా, dramatic techniques వాడి The Handmaiden ను రక్తి కట్టిస్తాడు పార్క్.

వచ్చేవారం కలుద్దాం.

అంత వరకూ…

దసరా సీజన్ వస్తోంది ఏం ప్లాన్ చేస్తున్నారు?

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here