[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే సందేశాత్మక గీతం ఈ సినిమాలోది (6) |
4. పార్వతీదేవియే – అటునుంచి వస్తోంది (4) |
8. జడ (2) |
9. కలసి ఉంటే.. (5) |
11. చెరసాల (2) |
13. తిరగబడిన నాభీలము (3) |
15. బమ్మయమ్ము – 1986 లో వచ్చింది – 2022 లో కూడా వచ్చింది (3) |
16. మునుపటి పుట్టుక ఫార్ములా చాలా సినిమాలకి వర్కవుటయింది (4) |
18. వీరు జితేంద్రియులు (3) |
19. క ఉన్నా లేకున్నా అది పూదేనే అవుతుంది మరి (4) |
20. అపూర్వవస్తుప్రాప్తిట – ఎంతదృష్టమో (3) |
21. వయస్సు (3) |
24. లేడీ లయన్ (2) |
25. వజ్రాన్ని ఇలా కూడా అంటారట (5) |
26. భోజుని రాజధాని (2) |
29. డు కారము ఆమ్రేడితమయితే – ఈ బుక్క బాగా మ్రోగుతుంది (4) |
30. ప్రతీ పద్యపాదము లో రెండవ అక్షరం ఒకేలా ఉండవలసిన ఛందో నిబంధన (6) |
నిలువు:
1. వేసారని ఒక రాగం (4) |
2. కాంతి (2) |
3. యాదవ కుల వినాశకారి (4) |
5. కుబేరుని భార్య – సరిగా చూడండి – మక్షి కాదు (2) |
6. కుంకుమ పువ్వు (6) |
7. కొద్ది కాలం క్రితం ఐఏఎస్ ఆఫీసర్ సంతకం ఫోర్జరీ చేసి మోసానికి పాల్పడిన స్కాం దీని గురించే (3) |
10. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునిల గ్యాంగ్ (7). |
12. వెండితెరపై ఈయనని చూస్తే అందరికి కలిగేది ఆయన పేరులోనే ఉంది (5) |
14. పార్వతి (5) |
17. నామలింగాను శాసనము అనే సంస్కృత నిఘంటువు ను రచించినది (6) |
21.పూర్వసంబంధమైన (3) |
22. దీంట్లో రాయబారమెందులకే పలుకరాదటే చిలుకా అని ఘంటసాల వారి పాట – కానీ ఈ సారికి మాత్రం క్రిందనుంచి పైకి వెళ్ళండి (4) |
23. పూర్ణ కుంభము (4) |
27. మిక్కిలి (2) |
28. మంగళ గౌరీదేవి కొలువై ఉన్న శక్తి పీఠం (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 అక్టోబరు 04 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 30 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 అక్టోబరు 09 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 28 జవాబులు:
అడ్డం:
1.అరకోడి కూర 4. బాలశిక్ష 8.భుక్తి 9.. ఆలయములు 11. శుభం 13. మ్మదున 15. భ్రమరం 16. సంచాముర 18. గిలక 19. దుడుకడు 20. సమానం 21. గాభోలు 24. దిట్ట 25. పరాజితులు 26. యమ 29. యుగంధర 30. ఉభయ భ్రష్టత్వం
నిలువు:
1.అగ్నిభువు 2. కోణె 3.కూనలమ్మ 5. లగ్గం 6. క్షణభంగురము 7. జమున 10. యదుకుల కాంభోజి 12. ఆమలకము 14. పంచారామాలు 17. ఐదు పది సేయు 21. గారాము 22. లుతువంభ 23.అమరత్వం 27. గోధ 28. అభ్ర
సంచిక – పద ప్రతిభ 28 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు మోహనరావు
- ఎర్రొల్ల వెంకట్‌రెడ్డి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.