[‘భూతాల బంగ్లా’ అనే నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ.]
[భూతాల బంగ్లా గుట్టు విప్పుతాడు భరత్. బంగ్లాను సీజ్ చేసిన అనంతరం నేరస్థులు ఉపయోగించిన పద్ధతుల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడుతుంటాడు భరత్. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం గురించి ప్రస్తావిస్తాడు. దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్న మత్తుపదార్థాల గురించి, మద్యానికి మాదకద్రవ్యాలకి అలవాటు పడి జీవితం పాడు చేసుకున్న కొందరు వ్యక్తుల గురించి చెబుతాడు. తీవ్రమైన మానసిక వ్యాధుల గురించి వివరిస్తాడు. ఇక చదవండి.]
[dropcap]భ[/dropcap]రత్ మళ్ళీ మాట్లాడుతూ..
“ఇస్మాయిల్ అనే 25 ఏళ్ళ కాలేజి విద్యార్థిని క్రితం సంవత్సరం హాస్పటల్‌కి తీసుకు వచ్చేసరికి తనను తాను గదిలో బంధించుకోవడం మొదలు పెట్టాడు. ఇస్మాయిల్ మంచి విద్యార్థి, కాని క్రిందటి పరీక్షల్లో తప్పాడు. అతను గంటల తరబడి శూన్యంలోకి చూస్తూ కూర్చుంటాడని అతని తల్లి చెప్పింది. ఒకొక్కప్పుడు అతను ఎవరో ఊహా వ్యక్తితో మాట్లాడుతున్నట్లు తనలో తనే గొణుగుతున్నట్లు మాట్లాడేవాడు. అతని తల్లిదండ్రులు అతన్ని బలవంతంగా క్లినిక్‌కి తీసుకు వచ్చారు. మొదట అతను నర్స్‌తో మాట్లాడడానికి నిరాకరించాడు. కొంత సమయం తరువాత అతను తనను తన తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు కలిసి కుట్ర చేసి చంపజూస్తున్నారని, దయ్యం తన మనసుతో ఆడుకుంటూందని చెప్పాడు. ఇరుగు పొరుగువారు తన గురించి మాట్లాడుకోవడం తనకు స్పష్టంగా వినపడుతోందని, తలుపు బయట వాళ్ళు తన గురించి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారని చెప్పాడు. తనకేదో జరగబోతూందని తెలుస్తూంది, కాని తనకేమీ అనారోగ్యం లేనప్పుడు తను క్లినిక్‌కి రావలసిన అవసరం ఏంటని అడిగాడు.
సమస్యేమిటి? ఇస్మాయిల్ షిజోఫ్రినియా అనే తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. అందువల్లే అతను వాస్తవం కాని మాటల్ని వింటున్నాడు, లేని విషయాల్ని ఊహిస్తున్నాడు.
షిజోఫ్రినియా చాలా తీవ్రమైన మానసిక వ్యాధి. మత్తు పదార్థాలు ఏవిధంగా తీసుకున్నా అవి మనకు హాని చేస్తాయి. పతనావస్ధకు తీసుకువెళ్ళి నరక ప్రాయమైన మరణాన్ని ప్రసాదిస్తాయి.
1987 నుండీ ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఆరున మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే ఎగినెస్ట్ డ్రగ్ ఎబ్యూజ్ ఎండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరపు థీం ‘బెటర్ నాలెడ్జ్ ఫర్ బెటర్ కేర్’. డ్రగ్ ఎబ్యూజ్ లేని సమాజాన్ని సాధించటమే ఈ రోజు యొక్క లక్ష్యం. ఈ లక్ష్య సాధనకి ప్రభుత్వాలూ, సంస్థలూ, కుటుంబాలూ, వ్యక్తులూ అందరూ కలిసి పని చేయాలి. ఆ అవగాహనని అందరికీ కల్పించే ఉద్దేశం తోనే ఇది జరుపుకుంటున్నాం.
డ్రగ్ ఎబ్యూజ్ అంటే ఏమిటి?
ఏ డ్రగ్ నైనా వాడకూడని విధంగా వాడితే అది డ్రగ్ ఎబ్యూజ్ కిందకే వస్తుంది. మీకు ప్రిస్క్రైబ్ చేసిన డ్రగ్‌ని ప్రిస్క్రైబ్ చేసిన డోస్ కంటే బాగా ఎక్కువగా తీసుకుంటే అది డ్రగ్ ఎబ్యూజ్. అసలు మీకు ప్రిస్క్రైబ్ చెయ్యని యూజ్ చేస్తే, అది కూడా డ్రగ్ ఎబ్యూజ్. ఇలా చెయ్యడం ద్వారా మీకు ఆనందం కలుగుతున్నా, లేదా వాస్తవ పరిస్థితుల నించి తప్పించుకోడానికి ఇలా చేస్తున్నా దాన్ని డ్రగ్ ఎబ్యూజ్ అనే అంటారు. ఇది ఒక వ్యసనం కింద మారనంత వరకూ ఇందులోనించి బైట పడడం అంత కష్టమేమీ కాదు.
డ్రగ్ ఎబ్యూజ్ వల్ల నష్టాలేమిటి?
డ్రగ్ ఎబ్యూజ్ వల్ల ఆరోగ్యం పాడౌతుంది. కుటుంబ సభులతో ప్రేమానుబంధాలు తగ్గిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు మొదలౌతాయి. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అసలేమీ నేర్చుకోలేని స్థితికి చేరుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే మీ ఆలోచన మీ కంట్రోల్‌లో ఉండదు.
మీ కుటుంబం లో ఎవరికైనా ఈ సమస్య ఉండేమో ఎలా తెలుస్తుంది?
డ్రగ్ ఎబ్యూజ్ చేసే వారి లక్షణాలు వ్యక్తిని బట్టి కొద్దిగా మారినా కొన్ని కామన్‌గా ఉంటాయి. అవి:
- ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్‌ని వాడడం
- డబ్బుల కోసం వెతుక్కోవటం
- హాబీలూ, ఇష్టాయిష్టాలలో మార్పు రావడం.
- మూడ్ స్వింగ్స్
- బాగా నిద్ర పోవడం, లేదా అసలు నిద్ర లేకపోవడం.
- హఠాత్తుగా బరువు పెరగడం, లేదా తగ్గడం
- స్నేహితులు మారడం
- మామూలుగా చెయ్యగలిగే చిన్న చిన్న పనులు కూడా చెయ్యలేకపోవడం
అప్పుడేం చెయ్యాలి?
మీ కుటుంబంలో వారికి కానీ, ఫ్రెండ్‌కి కానీ ఈ సమస్య ఉందని తెలిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. మెడికల్ కేర్, సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరమౌతాయి. ఈ వ్యసనాన్ని వదిలించుకోవడం అంత తేలిక కాదు. ఆ వ్యక్తీ, ఆ కుటుంబం లోని వ్యక్తులూ కూడా చాలా సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది. థెరపీ ఈ వ్యక్తులకి చేసే సాయం సామాన్యమైనది కాదు. చాలా మంది ఈ వ్యసనం లోనించి బైటపడిన తరువాత కూడా థెరపీని తీసుకుంటూనే ఉంటారు. ఈ వ్యసనం లోనించి బైట పడడానికి కావాల్సింది తన మీద తనకి గౌరవం, నమ్మకం, తనకింతకంటే మంచి జీవితం గడపడానికి అర్హత ఉంది అన్న ఒక ఆలోచన, కుటుంబ సభ్యుల సహాయం. వీటన్నింటి తోటీ ఆ వ్యక్తి నెమ్మదిగా మామూలు జీవితం వైపు అడుగులు వేస్తారు. అందుకు మన సహాకారం బాధితులకు ఎంతో అవసరం .
ఈ మత్తుపదార్థాల కేసు పూర్వాపరాలు తెలియాలంటే రెండు సంవత్సరాల వెనుక చరిత్ర కొంత తెలుసుకోవాలి. మత్తుపదార్థాల పలురకాలుగా లభ్యమౌతున్నా ముఖ్యంగా ‘బ్లూ’ సిగరెట్ పై మేము దృష్టి సారించాము.
అమెరికాలో చదువుతున్న సాగర్ గారి కుమారుడు వారాంతరపు సెలవులకు పిక్నిక్ వెళ్ళి అదృశ్యమైనాడు. ఆ తరువాత సాగర్‌కు ఫోన్ వచ్చింది, ‘మేము చెప్పినట్లు చేస్తే నీ కుమారుడిని వదులుతాము, అతను అమెరికా నుండి పారిపోయే ప్రయత్నం చేస్తే చంపుతాము’ అని బెదిరించారు కిడ్నాపర్లు. దానికి భయపడిన కుమారుడి చదువు, ప్రాణాల కోసం సాగర్ వారి చేతిలో కీలుబొమ్మ అయ్యాడు. సాగర్ ద్వారా మత్తుపదార్థాల దక్షిణ భారతదేశంలో దిగుమతి చేసేందుకు గొప్ప వ్యూహం పన్నారు మన శత్రు దేశం వాళ్ళు. ఆప్రికా నుండి బలమైనవి, అధిక బరువు మోయగలిగే రాబందుల వంటి పక్షులను సంపాదించి వాటికి అధునాతనమైన లేజర్ కాంటాక్ట్ లెన్స్ జోడించారు. ఆ పక్షులకు పగలు మాములుగా కనిపిస్తుంది. రాత్రులు లేజర్ బీమ్ వెలుతురు మాత్రమే కనిపిస్తుంది.
సాగర్ వ్యాపార షిప్పులలో డెక్ పైభాగాన ప్రతి షిప్పులోను లేజర్ బీమ్ మిషన్లు ఏర్పాటు చేసారు. ఎత్తయిన బిల్డింగ్ నుండి పక్షులకు మత్తుపదార్థాల బెల్టులతో కట్టుదిట్టంగా కట్టి, హార్బర్ నుండి బయలు దేరిన షిప్పు సముద్రజలాలలో ఆగి ఆ షిప్పునుండి లేజర్ తమ బిల్డింగ్ వైపు ప్రసరింపజేసే వారు. ఎత్తయిన బిల్డింగ్ లోని స్మగ్లర్లు మత్తు పదార్థాలు కట్టిన పక్షులను వీళ్ళు వదిలేవారు. కంటికి లేజర్ లెన్స్ ఉండటం వలన ఆ పక్షులు లేజర్ ప్రసరింపబడుతున్న షిప్పుకు చేరుకునేవి.
ఆ విధంగా వందల కిలోల మత్తుపదార్థాల శత్రు దేశంనుండి సాగర్ గారి షిప్పులోకి పక్షుల ద్వారా చేరేవి. ఆ షిప్పు చెన్నయ్ సముద్ర జలాలలో ప్రవేశించగానే శాటిలైట్ ఫోన్, లేదా వాకీటాకీల ద్వారా సందేశం పంపేవారు ఆ షిప్పులోనివారు.
రాత్రికి దెయ్యాల బంగ్లా పై అంతస్తునుండి లేజర్ షిప్పు ఉన్నదిశగా ప్రసరింపజేసి దాని ద్వారా వచ్చిన పక్షులు మోసుకువచ్చిన మత్తుపదార్థాల భద్రపరుచుకుని పక్షులను షిప్పునుండి లేజర్ బీమ్ వచ్చిన తరువాత తిరిగి షిప్పుకు పంపేవారు.
డ్రోన్ల ద్వారా ఈ మత్తు పదార్థాల షిప్పునుండి దిగుమతి చేసుకుంటే, కోస్టుగార్డ్ వంటి తీరప్రాంతం గస్తీదళాలు గమనించే ప్రమాదం ఉంది. అదే పక్షులు పయనించడం ఎవరికి అనుమానం రాదు. చాలా తెలివిగా వ్యూహరచన చేసారు.
నేను ఈ పక్షుల గురించి తెలుసుకున్నాను. ప్రజలను భయపెట్టి ఆ పరిసరాలకు రాత్రులు రాకుండా చేసేవారు.
ఇలా ఎంతో జాగ్రత్తగా మేము ఎవ్వరము ఊహించ లేని విధంగా మత్తుపదార్థాలు దెయ్యాల బంగళాకు రాత్రికి రాత్రే చేరుతుండేవి. అవి అదే రోజు సాగర్ వ్యాపార సంస్ధ అయిన బిల్డింగ్ లోనికి తరలించబడేవి. అక్కడ ఆరో అంతస్తులో యాష్ ఆయిల్ సిరంజి ద్వారా సిగరెట్స్ లోనికి ఎక్కించబడేది. ఆ మత్తు పదార్థం ఎక్కించిన సిగరెట్ బ్లూ సిగరెట్టుగా మార్కెట్‌లో పరిచయం అయింది.
పలు అసాంఘిక సంఘటనలకు పేరు పడ్డ దెయ్యాల బంగ్లాను ప్రముఖ వ్యాపారవేత్త తమిళనాడులో పలురకాల సిగరెట్ ఏజన్సి కలిగిన సాగర్ గారు కొనుగోలు చేయడంతో మా అనుమానం మొదలైయింది. ముందు దృష్టితో మా ఆఫీసర్‌ను రామయ్య పేరున ఆ దెయ్యాల బంగ్లాలో ప్రవేశపెట్టాము.
అప్పటికే దెయ్యాల బంగ్లాగా పేరు ఉన్నదానిని మరింత ప్రచారం జరిగేలా రహస్య ద్వారం లోనుండి బంగ్లా పై భాగానికి మనుషులను పంపి వారి ప్రతేక దుస్తులకు రేడియం పెయింట్ అస్థిపంజరాల్లా వేసి బంగ్లాపైన తిరగడం, తెల్లని దుస్తులు ధరించిన యువతి బంగ్లాలో పరిసరాలలో తిరుగుతూ కనిపించడం, బంగ్లాలో అధునాతనమైన సౌండ్ సిష్టం రహస్యంగా అమర్చి నవ్వులు వినిపించడం చేస్తుండేవారు. ఆ బంగ్లాలో ఉన్నవారిని సైతం నమ్మించేందుకు గజ్జల శబ్దాలు, కిలకిల నవ్వులు వంటి పలు సంఘటనలతో బయపెట్టసాగారు. నేను శివయ్య పేరుతో ఆ యింటి పనివాడు రామయ్య అల్లుడిగా బంగ్లాలో ప్రవేశించాను. నాకు కావలసిన సమాచారం రహస్య వీడియో ద్వారా సంపాదించాను.
మనదేశం మరి కొంత కాలంలో ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా నిలువబోతుంది. ఇక్కడ మన శత్రుదేశం వాళ్ళకు కావలసింది మత్తుపదార్థాల వ్యాపారం కాదు. యువతను బలహీనపరచడం. ఏ దేశానికైనా యువత వెన్నెముక వంటిది. దేశ ఆర్థిక పరిస్ధితి వారిపైనే ఆధారపడి ఉంటుంది. పిల్లలు, వృధ్ధులు వలన ఎటువంటి ఆర్థికత ఉండదు. అందుకే శత్రుదేశం వాళ్ళు అంతా ఏకమై మనపై ఈ మత్తుపదార్థాల దాడి చేస్తున్నారు. అందుకు ధనం ఆశ చూపించో, బెదిరించో మనవాళ్ళను పలు మార్గాలలో లొంగదీసుకుని సులువుగా తమ పనులు చేయించుకుంటున్నారు. మనతో యుధ్ధం చేసి గెలవలేమని తెలిసి ఈ దొడ్డిదారిన మనదేశంలో మత్తు పదార్థాల ప్రవేశ పెడుతున్నారు.
కొంతకాలంగా నిఘా పెట్టడం ద్వారి సాగర్ గారి ఫోన్ టాప్ చేయడంతో చాలామంది, ఇంకా ఈ వ్యాపారంలో రిటైల్ సూత్రధారులు అందరూ అరెస్టు అయ్యారు. కొందరు మరణించారు. నేటితో దక్షణ భారత దేశంలో భ్లూ సిగరెట్టు, మత్తుపదార్థాల రాకడ పూర్తిగా నిలిచి పోయింది.
గోదాములలో దాచి ఉంచిన, బ్లూ సిగరెట్లు, పలురకాల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నాం, ఇకపై దేశం లోని సముద్ర తీరప్రాంతంపై నిఘా పెంచుతాము” అన్నాడు.
విదేశాలలోని సాగర్ కుమారుడు భారతదేశం వచ్చిన అనంతరం మరణించిన సాగర్‌కు జరవలసిన వన్ని జరిపిన కొద్దిరోజులకు భువన, భరత్‌ల వివాహం జరిగింది.
(సమాప్తం)