[dropcap]సూ[/dropcap]ర్యోదయంతో గోవుల సేవ చెయ్యడం రామారావుకి అలవాటు. పాలేరు పనివారు అంతా సవ్యంగా ఉన్న జీవితం. మళ్ళీ వేరే చోటుకి అంటే మార్పు వస్తుంది.
పాతిక ఎకరాల మాగాణి, చదువు అన్ని ఉన్నాయి. ఉద్యోగం మానవ ధర్మం అంటూ కొత్తలో బ్యాంక్‌లో చేరాడు. ఆ కో-ఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళ పెద్దవాళ్ళు పెట్టినదే. కానీ రెండేళ్లు చేశాక ఇక అనవసరం, తన వ్యవసాయం తను చేసుకుంటే మంచిది అనుకున్నాడు. ఉన్న ఆస్తిని పెంచుకోవడానికి ఇండియాలో ఉన్నది చాలు అనే తృప్తి వారిది.
పెద్ద కూతుర్ని అక్క కొడుక్కి చేశారు. రఘు కూడా అగ్రికల్చర్ బి.ఎస్.సి చదివి వ్యవసాయం, సేంద్రియ పంటలు సాగులో బిజీ. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. వాళ్ళని వీళ్ళు విదేశాలకి తీసుకు వెళ్లి చదివించాలని ఆశ. బావగారు ఎన్నో సార్లు ఎందుకు? నాకు ఇక్కడ ఉన్నది చాలు అంటూ మాట మార్చేవాడు. వీసా తీసుకో, పాస్‌పోర్ట్ పెట్టుకోమన్నా నాకు వద్దు అని చెప్పేవాడు.
ఇండియాలో అప్‌డేట్ జీవితం కాదుట, విదేశాలకి వేడితేనే అప్‌డేట్ అని అంటున్నారు కొందరు.
ఇంకా అక్క ఏమి అనగలదు? ఇది చాలు. మాకు అన్ని ఇక్కడ ఎక్కువే ఉన్నాయి చాలు తృప్తి ఉన్నది అంటారు వాళ్ళు.
రెండో పిల్ల సుష్మని అన్నగార్లు ఎన్.ఆర్.ఐ కోటాలో చదివించారు. విదేశీ పెళ్లి కొడుకు కోసం ఎంత వెదికినా కుదరలేదు. చివరకి ఇండియా పెళ్లి కొడుకుని విదేశాలకి తీసుకెళ్ళలని ఆశపడ్డారు
మరి అందులో ఎన్నో కోరికలో, ఎన్ని హిరణ్యాక్ష వరాలో చూద్దాము.
ఇద్దరు కొడుకులను ఇంజినీరింగ్ చదివించారు. వాళ్ళు విదేశాల్లో సెటిల్ అయ్యారు. చెల్లి కోసం ప్రాణం ఇస్తారు. వాళ్ళతో కూడా తీసుకెళ్లాలని కోరిక. తండ్రి మాత్రం “పెళ్లి చెయ్యందే పంపను” అన్నాడు.
పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒకప్పుడు పెళ్లిచూపులు అంటే ఇంట్లో చేసేవారు, ఇప్పుడు అన్ని వింత ధోరణిలో ఉన్నాయి. పెళ్లి మనుష్యులు మధ్య లేక వీడియోలు హైటెక్ అరెంజిమెంట్స్ తోనేగా. ఇప్పుడు ఎన్.అర్.ఐ.లకి మాత్రం ఫైవ్ స్టార్ హోటల్‌లో. వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టాలి. మనలా ఇడ్లీలు గారెలు తినరుట. ముందే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. లేకపోతే సూట్ ఖాళీ ఉండదు. ఏమిటో పెళ్లికి వచ్చినట్లు హోటల్ బుక్ చెయ్యాలి.
వాళ్ళు పెద్ద పెద్ద కార్లలో, వాళ్ళకి సేవ చేయడానికి ఓ సుమోలో పనివాళ్ళు వచ్చారు. అంతా కలిసి ఓ పదిహేను మంది ఉన్నారు. ఆవిడకి ఐదుగురు కొడుకులు, ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ళ సంతానం అంతా వచ్చారు
ఇండియాలో ఎన్.ఆర్.ఐ. అమ్మాయి అంటే ఇంత గొప్పగా పెళ్లి చూపులా అనుకున్నారు.
ఈ రోజుల్లో అంతా చదువుకున్న అమ్మలక్కలు. సెల్ ఫోన్ మెసేజ్లు, వీడియో కాల్ విషయాలు. విదేశాలు, విశేషాలు. ఇంట్లో ఎవరో ఒకరు విదేశీయులు అంటున్నారు.
లాప్‌టాప్ అమ్మక్కల సంఖ్య పెరిగింది. ఇదివరలో, అంతా గోడ ప్రక్క దర్వాజ వెనుక గుమ్మం ప్రక్కన ఉండి సంభాషణలు జరిపేవారు. మగవాళ్ళు చెట్ల కింద, గార్డెన్స్‌లో మాట్లాడుకునేవారు.
ఇప్పుడు అంతా సెల్ చాటింగ్. ఎవరితో ఎవరూ మాట్లాడే గోల చేసి సమస్య లేదు. అంతా సెల్ అభిమానులే కదా.
ఎవరి స్తోమత వారిది వెయ్యి రూపాయల ఫోన్ మొదలు పాతిక వేలు ఖరీదు ఫోన్ వరకు అంతా వాడేస్తున్నారు. కనుక విషయం గతంలో కంటే స్పీడ్‌గా వెళ్లిపోతోంది.
ఇదివరకు ఉత్తరం రాయాలి, వెళ్ళాలి. లేదా ఎవరైనా రావాలి. లేదా ఫోన్ బయటకు వెళ్లి చెయ్యాలి.
ఇప్పుడు క్షణంలో. మెసేజ్‌తో నోరు మెదపలేదు. కానీ విషయం వెళ్ళిపోతుంది.
ఇంకా అడ్వాన్స్ ఏమిటంటే వీడియో వాళ్ళకి తెలియకుండానే చేసి పంపిస్తున్నారు. విషయం అంతా తొందరగా చేరిపోతోంది. ఇది విజ్ఞాన శాస్త్రం మహిమ అనాలా, న్యూ సైన్స్ అనాలా, న్యూ ట్రెండ్ అనాలా, న్యూసెన్స్ అనాలా చెప్పండిi:
మొత్తానికి ఇలాంటి పెళ్లిచూపులు ఓ పదిహేను అయ్యాయి. అప్పుడు చివరకి ఇండియా నుంచి ఇష్టపడి విదేశాలకు వెళ్ళాలి అనుకున్న సంబంధం కావాలి అని ఛానల్ ప్రకటన ఇచ్చారు. ఇంకేమి వందల కొద్దీ అప్లికేషన్స్ వచ్చాయి. ఏదో ఒక దూరపు బంధుత్వం ఉన్నా పర్వాలేదు అనుకున్నారు. అందులో ఎంత సెర్చ్ లైట్ వేసి వెతికినా ససేమిరా ఎవరూ తెలుసున్న వ్యక్తులు దొరకలేదు.
ఇంకా నయం మన దేశం కనుక కులం, గోత్రం తెలుస్తుంది. ఇదే వేరే దేశం అయితే ఏమి? ఎలా, ఏమిటి తెలియదు.
చదువు మొదటి విభాగము. రెండు అడ మగ అంతే తప్ప ఇంకేమి తెలియవు
ఏమిటో ఆడపిల్ల – అన్నీ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా ఈ విషయంలో సమస్య తప్పటం లేదు. చాలా మంది ఇదే విషయం, ఎదురి వారికి చెపుతారు. అదే స్వంత విషయానికి వస్తే ఆలోచనలో పడతారు. ఇది జీవిత చరిత్ర ఆధారంగా ఉన్న సమస్యల సత్యమే.
అన్ని అప్‌డేట్ అయితేనే మంచిది.
పెళ్లి చూపులు చాలా చిత్రంగా ఉంటాయి. ఎందుకంటరా? పెళ్లికూతురు ఫోటోలు ఐదారు – అన్ని కోణాల్లోను పంపమంటారు. ఇప్పుడు అంతా మిడ్డీ పిల్లలు, స్కర్ట్ పిల్లలు. వారికి డిగ్రీ కాగానే పెళ్లిచూపులు. అంత వరకు మోడరన్ డ్రెస్‍లు. హాస్టల్ జీవితం కాక పోయినా ఆధునిక జీవితం. అందుకని కొన్ని పద్ధతులు నేర్పాలి. అమ్మ చెప్పినవి నచ్చవు కానీ డ్రెస్ డిజైనర్ చెప్పినట్లు వింటారు.
చీర కట్టడం ఎన్నో రకాలు ఉన్నాయి, తెలిసినవే 250 రకాలు. ఇంకా తెలియనివి ఎన్నో ఉన్నాయి, రాష్ట్రాన్ని బట్టి ఇవి ఉంటాయి. పెళ్ళికూతురు ఇష్టాన్ని బట్టి ఉంటుంది.
పిల్లకి రకరకాల వేషాలు వేసి, విదేశీ సంబంధం అయితే నైటీతో, లాంగ్ ఫ్రాక్, పంజాబీ, మిడ్డీ – ఇలా ఎన్నో యాంగిల్స్‌లో ఫోటోలు పెడతారు. పెట్టాలి అంటారు.
మరి ఆడ పెళ్లివారికి తప్పదు. సరే అని అనాలి. ఇప్పుడు వీడియో షూట్ కూడా ఉన్నది. “పిల్ల పూజ చేస్తున్నట్లు, ఇంటి పనులు చేస్తూన్నట్లు. వంట పనులు చేస్తున్నట్లు. ఇంకా కళాకారిణి అయితే డాన్స్, వీణ, సంగీతం, పెయింటింగ్ చేయడం లాంటివి ముఖ్యమైనవి అన్ని వీడియోగా చేసి పెట్టండి, మా పిల్లాడు మేము చాలా స్థిరంగా చూస్తాము; అప్పుడు మా ఫ్రెండ్స్‌కి చూపెడతాము. వాళ్ళకి కూడా నచ్చాలి కదా.” అంటున్నారు.
“ఇరుగు పొరుగు వారిని కూడా పిలిచి చూపించండి. అందరికీ నచ్చితేనే పెళ్లి కదా.”
“పిల్ల బీటెక్ చదివింది వంట వార్పు అన్ని వస్తాయి కానీ పిల్లాడితో సమంగా సంపాదిస్తోంది”
“ఇవి అన్ని విదేశాల్లో మాములే కదా. మీరు ఇండియాలో ఉన్నారు. అందులో పల్లెలో ఉన్నారు. మీకు అన్ని కొత్త. కానీ అక్కడి వాళ్ళకి చేతిలో వీడియో కెమెరా ఉంటుంది. ఇది అక్కడ సర్వ సహజం.”
“మరి మీ పిల్లాడు మా వాళ్లకి నచ్చాలి కదా, వీడియో షూట్ పెట్టండి” అన్నారు.
“బాగున్న యాంగిల్స్‌లో వీడియో చేసి పెడతారు”
“పిల్లకి ఉన్న బట్టలు, నగలు, ఇచ్చే సామాను కూడా చక్కగా పేర్చి మాంచి డెకరేషన్ మాదిరి చేసి పంపండి, మా ఇంట్లో అందరికీ నగలు ఉన్నాయి. మీరు కూడా పిల్లకి బాగా అలంకరించి పెట్టాలి” అన్నది కాబోయే అత్తగారు.
మరి ఎన్.అర్.ఐ. చదువు కదా అందుకని అలా అన్నారు. చదువుకి తప్పని సరి అయ్యి చెప్పించారు. అన్ని అప్‌డేట్‌గా ఉండాలి. నగలు, పెళ్ళిచూపులు అన్ని కూడా.
ఈ నగలన్నీ అన్నగారు ఎక్కడ చేయిస్తాడు? ఆ పిల్ల ఉద్యోగం చేసి చేయించుకోవాలి అంతే గానీ అన్నగారి మీద ఆధారపడితే ఎలా?
పెద్దవాడికి పెళ్లి అయింది పెళ్ళాం వచ్చింది.
రెండో వాడు కూడా పెళ్లికి రెడీగా ఉన్నాడు వీడికి ఎలాంటి పద్ధతులు వద్దు, తెలుసున్న పిల్లని చెయ్యాలి అని అనుకున్నారు. కుండ మార్పిడి కూడా కుదరడం లేదు. ఎక్కడ తృప్తికరమయిన సంబంధం లేదు.
మొన్న రామారావు ఫ్రెండు కూతురుకి విదేశీ సంబంధం చేశాడు. పిల్ల పిల్లాడు అక్కడే ఉద్యోగాలు. ప్రేమ పెళ్లి అయిన సరే పెళ్లి కొడుక్కి ప్రిన్స్ హారం పచ్చలది పెట్టాలి అన్నారు. పిల్లాడి గ్రహాలకి అంటే బుధ గ్రహం బాగా లేదు, బుద్ది బాగుండటానికి పచ్చల హారం పెట్టాలి, అలా పెట్టుకోవాలి అన్నారు. అవును పెళ్లి తరువాత పిల్లని బాగా చూడాలి కదా మరి.
వాళ్ళు పిల్లకి ఎనబై కాసులు పెడతారు. వీళ్ళు పిల్లాడికి ఇరవై కాసులు పెట్టాలి. హారం, బ్రాస్లెట్, ఉంగరాలు, చెవి రింగ్ ఇవండీ వారి కోరిక.
ఇద్దరు విదేశీ వాళ్లే అయిన ఈ రకంగా తప్పడం లేదు. పెళ్లి అంటే మనీ ఎక్సేంజ్ తప్ప మనసులు బంధుత్వాలు కాదన్నట్లు ఉన్నాయి. ఇంకా వాడి మీద ఆధార పడి ఉండకూడదు అని తల్లి తండ్రి వాపోయారు.
కూతురు సంబంధం విషయానికి వస్తే –
ఇదేమిటి ఆడపిల్ల విదేశీ సంబంధం కనుక ఇన్ని అడుగుతున్నారు, పిల్లను చూడటానికి ఇన్ని రకాల పద్ధతులు ఉన్నాయా? పెళ్లి చూపులకి ఖాళీ లేనప్పుడు పెళ్లికి ఖాళీ ఉన్నదా? అనే ప్రశ్న వస్తుంది.
పెళ్లి ఘనంగా చెయ్యండి అన్ని పెడితే మీ పిల్ల పెట్టుకుంటుంది ఉంటుది తింటుంది అని అత్తగారు తెగ చెప్పింది. ఫోన్‌లో లౌడ్ స్పీకర్ పెట్టీ అరచినట్లు రెండు గంటలు చెప్పింది అనేకంటే పోరింది అనవచ్చు.
ఏమిటో ఆడపిల్ల పెళ్లి ఎంత డబ్బు ఉన్నా సమస్య కదా అన్నది.
ఈ మధ్య వీడియోలు యూట్యూబ్‌లు వచ్చాక ఎన్నో రకాల కోరికలు పెరిగిపోయాయి. ఏమి చేస్తాం? ఆడపిల్లని కన్నాక అన్ని అనుభవించాలి మరి తప్పదు అంటూ ఆడపిల్ల వారు బెదురుతున్నారు ఈ బెదురు ఏ రకంగా పోవడం లేదు.
ఏమిటి విచిత్రం తిండీ తిప్పలు లేకుండా ఈ పిల్లలు చదివి బక్కలా అవడం, ఆ తరువాత పెళ్లి వారు పిల్ల సన్నగా ఉన్నది లావుగా ఉన్నది అంటూ వంకలు పెడుతున్నారు
రామారావు కూతురు పెళ్ళి సంబంధాలతో విసిగి పోయాడు. తాను “వద్దు ఇక్కడి సంబంధం చెయ్యాలి” అంటే “కుదరదు మా చెల్లెలు విదేశాలకి మాతో రావాలి” అన్నారు కొడుకులు.
ఇండియా సంబంధం చేద్దామంటే అన్నగార్లు డబ్బు పెట్టీ విదేశీ కోటాలో చదివించారు.
ఇప్పుడు వచ్చే వాళ్ళని ఇండియాలో ఆరోగ్య పరీక్షలు అంటే ఏ పెళ్లికొడుకు వాళ్ళు ఒప్పుకుంటారు? ఎంత సేపు మనిషి జీవితాన్ని కట్నం లాంఛనం అంటూ ముడి పెడుతున్నారు తప్ప, పిల్లను ఎంత బాగా పెంచారు మేము ఎంత బాగా చూడాలి అనే ఆలోచన లేదు.
అందుకు అక్కడి పెళ్లి చెయ్యాలని కోరిక కూడా.
ఒక పెళ్లి వారు వీడియో పంపితే పిల్ల సన్నగా ఉంది, బాగా ప్రోటీన్ విటమిన్ ఫుడ్ పెట్టీ పిల్లను బలవపెట్టీ చూపించండి అన్నారు.
ఆ వీడియోకి పాతిక వేల పైన అయ్యింది.
“పెళ్లి చేసుకుంటే అప్పుడే లావు అవుతుంది” అని చెప్పి, “మీ వాడికి పిల్ల నచ్చిందా లేదా” అన్నారు.
“అదే మా పిల్లాడు పిజ్జాలు బర్గర్స్ తిని బాగా లావు అయ్యాడు, అందుకని లావు పిల్ల కావాలి” అన్నారు.
“సరే మీకు ముందు ఫోటో పంపాము కాదు వీడియో షూట్ అన్నారు. ఇప్పుడు ఇలా అంటున్నారు. పెద్ద పిల్ల లావుగా ఉన్నదని కొందరు అంటే పెళ్లి కష్టం అయ్యింది. చిన్న పిల్లను సన్నగా ఉంచాము. ఇప్పుడు ఈ పిల్ల లావు అంటున్నారు. అని సరే ఇష్టమైన పిల్లని చేసుకోండి. మాకు వచ్చేది మాకు వస్తుంది. ఎవరికి డబ్బు ఎవరికి ఋణం ఉందో వాళ్ళు వచ్చి చేసుకుంటారు. అదిగో మా వదిన గారి కొడుకు లావుగా ఉన్నాడని చాలా సంబంధాలు రాలేదు, చివరికి ఓ సంబంధం సన్న పిల్లని అక్క తమ్ముడు గొప్పలు చెప్పి పెళ్లి చేసుకొన్నారు. ఆ పిల్ల మరి ఎలా వేగుతోందో వారికే తెలియదు.
వేషాలు వేసుకుని మరియు సినీ స్టార్ ఫోజులు ఇవ్వాలి. ఇల్లు కాదు గార్డెన్ రెస్టారెంట్ అంటు ఇంకొకరు అన్నారు. ఏమి చేస్తాము ఆడపిల్లని కన్నాక అన్ని అనుభవించాలి మరి తప్పదు అంటూ ఆడపిల్ల వారు బెదురు తున్నారు. ప్రతి పెళ్లి వారికి వైజయంతి మాల, టబు లాంటి వాళ్ళు కావాలి. సన్నగా ఉన్నది లావుగా ఉన్నది అంటూ వంకలు పెడుతున్నారు. ఇవన్నీ రుణాలు, అంతే కదా ఏది రాసి ఉందో?” అన్నారు
***
పెళ్ళిళ్ళు అంటే జాతకం. అది కుదిరితే పిల్ల బాగాలేదు పిల్ల బాగుంటే చదువు కట్నం ఏమి ఉండదు. ఇంకా ఈ రోజుల్లో పెళ్లి ఎలా అవుతుంది. ఎన్.అర్.ఐ పిల్లకి అవని పెళ్లి సామాన్యులకి అవుతుందా చెప్పండి? ఇంట్లో చేసే పెళ్లి చూపులు వద్దు. ఫైవ్ స్టార్ హోటల్‌లో కావాలి. వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టాలి.
పెళ్లి కొడుక్కి సిగ్గు ఎక్కవ అన్ని పెద్దవాళ్లు చెప్పాలి. చాలా మంది పెళ్లికి ముందు ప్రేమ పెళ్లి తరువాత ఇంటికి. ఇంటి వాళ్ళకి నచ్చినట్లు ఉండాలి.
ఇండియాలో ఎన్.ఆర్.ఐ. అమ్మాయి అంటే ఇంత గొప్పగా పెళ్లి చూపుల అనుకున్నారు. డబ్బు చదువు అందం అన్ని ఉన్న వాళ్ళకి అసలు మంచి సంబంధం దొరకడం లేదు. మరో ప్రక్క ఆడపిల్లలు దొరకడం లేదు.
పిల్లల కోసం తపన పడటం కూడా మనకి తప్పదు. విధి రాత తెలియదు.
పెళ్లి అనేది తెలుసున్న కుటుంబంలో చెయ్యాలి, లేకపోతే వారి పద్ధతిలో పిల్లలు ఇమడలేరు. ఇల్లు వాకిలి ఆరోగ్యకరంగా ఉండాలి. ఏదో ఉండటానికి ఆవాసం అని నీట్‌గా లేని ఇల్లు అయితే ఇప్పటి తరం పిల్లలు సర్దుకు పోలేరు ఎక్కడో దూరంగా వంటిల్లు, అలా పూర్వకాలం ఇల్లు కుదరదు, బాగుండాలి, నీట్‌గా ఉండాలి.
ఇలా చూసి పిల్లల్ని ఇచ్చి పెళ్ళి చెయ్యాలి.
కొందరు పెళ్లి తరువాత ఇల్లు మారుతాం, పెద్ద ఎత్తున సౌధం కొంటాం అంటారు. మాటల వీరులు అంతే, అనాలి. అలాగని ఎరుగున్న వారు అయితే పిల్లకి తగినట్టు చూస్తారు బయటి వాళ్ళు బాధలు పెడతారు.
అన్న కూతురు సుప్రజ ప్రేమించి అమ్మ నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకున్నది. కానీ ఇంట్లో అత్తవారి ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. ఓ గోడ మాదిరి మనుష్యులు. మాటా మంతి ఉండదు. ఎవరి టైమ్‌కి వారు వారి పనుల వెంట ఉద్యోగాల వెంట హాట్ బ్యాగ్స్ పుచ్చుకుని వెళ్లి పోతారు. ఎవరికి కావాల్సిన టిఫిన్స్ వాళ్ళు కొనుక్కుని తెచ్చుకుని తింటారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టరు. ఎవరి పొట్లం వాళ్ళు తింటారు. సరి అత్తగారికి ఎవరైనా తెచ్చి ఇచ్చినా ఆమే తింటుంది. కొడుకు తెచ్చిన బొబ్బట్లు వారం తరువాత ఎండిపోయిన చిన్న ముక్క కోడలి చేతిలో పెట్టి “తిను తిను” అంటుంది. ఆ ఇంట్లో హైజీన్ లేదు. ఏదీ పంచుకోవడం అనే ప్రసక్తి లేదు. ఆఖరికి భర్త సహితము ఉన్నావా తిన్నావా అని లేదు. జ్వరం వచ్చినా ఉలుకు పలుకు ఉండదు. అత్తగారు మాత్రం ఇరుగు పొరుగుకి ఆకాశం లోకి కబురులు చెపుతూ ఉంటుంది. విచిత్ర కుటుంబం. మామగారు కొడుకు షో పీస్‌లు. కేవలం అత్తగారు, ఆడపడుచు పెత్తనం చేస్తారు.
***
జీవితంలో ఎదగాలి అంటే నిరంతరం కృషి చెయ్యాలి. జీవితం అంతా ఎదుటి మెప్పు కోసమే అన్నట్లు ప్రతిదీ ఎదుటి వాడు బాగుంది అనాలి అప్పుడే తృప్తి. స్వార్థం మనిషి చుట్టూ వైఫైలా ఉంటుంది. అందులో పెళ్లి విషయంలో మరీ ఎక్కువ అవుతోంది.
ఎదిగే వరకు బాబు బాబు అంటారు, ఎదిగాక నీ లెక్క లేదు నా తెలివి అంటారు.
జీవితంలో మనకంటూ అశాంతి ఉండదు. మన చుట్టూ ఉన్న మనుష్యులు నుంచే అన్నీ.
ఉదయం పాలు నీళ్లలా ఉన్నాయి, కూరలు బాగా లేవు
ఇస్త్రీ సరిగా లేదు
అమ్మా యూనిఫాం బాగాలేదు
హోమ్ వర్క్ కాలేదు
అంటూ మన చుట్టూ అశాంతి ఉంటుంది.
ఇంకా ఎదిగిన పిల్లలు ఇంకో రకంగా సమస్య. అన్ని సమస్యలకి డబ్బు పరిష్కారమే అంటారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్లు కొనుక్కో అంటే ఏ సమస్యా ఉండదు. బాధ్యత వల్లే బంధాలు అనుబంధాలు కూడా ఒక్కోసారి సమస్య పురాణాలుగా మారుతాయి.
***
మన అనందం మన జీవితం మనకోసం కదా. హిమాలయాలు అధిరోహించినా, పసిఫిక్ సముద్రం లోతుకు వెళ్ళి చూసిన అనుభూతి ఎంతో మెప్పు కోసం. కానీ ఎవరి అంతరంగం వారు మలుచుకోలేరు.
పిల్లల్ని కని పెంచి విదేశాలకు మన మేధావులను పంపడమే జీవిత పరమావధి.
రామారావు గారికి కూతుర్ని విదేశాలకి పంపడం ఇష్టం లేదు. కానీ అన్నదమ్ములు పట్టు పట్టారు.
భార్య పూర్ణనీ తనని రమ్మని చెప్పారు. కాగితాలు ఫారాలు పెట్టారు అన్ని వచ్చాయి. కానీ ఆ సమయానికి పెద్ద పిల్ల పురుడు సమయం అందుకని వెళ్ళడం మానేశారు.
పెద్ద కొడుకు అత్త మామ బావమరిది వెళ్ళారు.
“నీ వాళ్ళని నువ్వు తెచ్చుకో, పెళ్ళాం ఇష్ట ప్రకారం వంట చేస్తుంది. అధి తినడం అలవాటు చేసుకో. అంతే కానీ మా పనస పొట్టు కూర వండినట్లు లేదు, పులిహార పోపులో రుచి మారింది, మజ్జిగ పులుసు ఆవపెట్టు, వంకాయ కురలో అల్లం వెయ్యి అంటూ వంటింటి అలవాట్లు మార్పు వద్దు. కోడలు వండినట్లు తిను, చెప్పినట్లు విను. అప్పుడు నీకు జీవితంలో అశాంతి ఉండదు. అంతా శాంతి ఉంటుంది” ఇలా చిన్న చిన్న చిట్కాలు ఎంతో మంచివి అంటూ తల్లి కొడుక్కి హిత బోధ చేసింది.
“అమ్మా నీ సూక్తి ముక్తావళి వింటే అసలు ఏ మగాడు భార్యతో ఇంట్లో గొడవపడడు. అది అందరూ తెలుకోవాలి. అమ్మ నీలా ఉంటే కోడళ్ళకి అసలు సమస్యలు ఉండవు” అన్నాడు కొడుకు.
“అవును రా, మనింటికి వచ్చిన పిల్లను జాగ్రత్తగా చూడాలి” అంది.
“ఆఁ. సుష్మకి కాస్త పెళ్లి అయితే చాలు. పెళ్లి చేసుకున్న పిల్లను ఉసురు పెట్ట కూడదు. ఆమెకి నచ్చిన జీవితం ఇవ్వగలిగితేనే పెళ్లి. మనకి ఇంట్లో ఆడపిల్ల ఉన్నది” అంటూ తల్లి మందలిస్తూ ఉంటుంది.
అత్తగారు కోడలికి వంకలు పెడితే ఎలా? సర్దుకు పోవాలి. అంతరంగంలో అమృత భావాలు వికసిస్తే జీవితమంతా పూల బాట. ఎన్నో అంతరంగ మథనాలు. జీవితానికి విలువలు కలిగిన ఆలోచనలు అభిప్రాయాలు అవసరం. ఆలోచనల సృజన క్షీర సాగర మథనంలో ఎన్నో విలువైన వస్తువులు ఉద్భవించినట్లే మన ఆలోచనలలో కూడా అమృత భావాలు ఉదయిస్తే మనసంతా శాంతి సందేశం ద్వారా జీవిత విలువలు మెరుగు పడతాయి.
***
మొత్తనికి సుష్మ పెళ్లి ఓ ఇండియా అబ్బాయితో కుదిర్చారు. పెళ్ళిలో బ్రహ్మ కడిగిన పాదము అనే శ్రీ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తన అద్భుతంగా సన్నాయిపై వాయించారు. పెళ్లి కొడుకు తల్లికి సంగీత పరిజ్ఞానం ఉన్నది. అందుకని సన్నాయిలో కీర్తనలు వాయించమన్నది. పెళ్లి ఘనంగా చేశారు.
అన్ని కార్డులు అప్‌డేట్ చేశారు. పిల్లకి పెళ్ళి చేసి జీవితాన్ని అప్‌డేట్ చేశారు. మనిషి కార్డులకు ఉన్న విలువ, ఎలక్ట్రానిక్ పరికరాలకు ఉన్న విలువ జీవితానికి లేదు.
అన్నిటికి గూగుల్ పే, ఫోన్ పే, రక రకాల కార్డులతో బ్యాగ్స్ నింపుకుని వస్తారు. ఇక్కడ టాక్సీకి, ఆటోకి; పళ్ళు పూలు చిన్న వస్తువులకి క్యాష్ ఉండాలి అనే ఆలోచన ఉండదు. మళ్ళీ ఇక్కడి వారు వారికి సపోర్ట్ మనీ ఇస్తూ ఉండాలి, విదేశీ ఘనత మరి.
ఈ పొలం నాది ఈ వస్తువు నాది అనడానికి వంద రకాల కార్డులు అప్లై చెయ్యాలి. ఇంకా మన ఇండియాలోనే ఇలా ఉంటే విదేశాలకి వెళ్ళే వారికి ఇంకెన్ని కావాలి ఆలోచించండి.
జీవితంలో అన్ని అప్‌డేట్ చెయ్యాలి. అప్పుడే అందరికీ శాంతి శుభము.