‘రామకథాసుధ’ సంకలనం ప్రచురణకు పరిశీలనకు అందిన కథ.
***
[dropcap]భ[/dropcap]గవంతుడికి భక్తులంటే ప్రాణము. కాని మనోడేలే అని తొందరగా కరుణించడు. ఆభరణాలు చేయించింది నీకే కదా! ఎవడబ్బా సొమ్మని కులుకుతున్నావు అని రామదాసు నీ వాడిని కానా అని గద్దించేవరకు రాముడు దిగి రాలేదు. అది రామదాసు కీర్తన. ప్రజలు యిష్టంగా పాడుకుంటున్నారు.
ఆంజనేయుడు లేనిదే రామాయణ కథ ఊహించలేము. ఆ మహ భక్తుడిని కూడ వానరజాతిగా భావించి రాముడు చులకన చేసాడనుకున్న హనుమంతుని భావన జానపద భావన కల్పితానికి నా దైన శైలిలో స్వీయ రచన. జానపదులే కాదు అందరమూ హనుమంతుని రూపాలమే, రామాంకిత హృదయులమే అను చక్కని కథ హనుమంతుడుగ మన జాతివాడు. అర్చామూర్తి.
హనుమంతుడు “నేను నీకు పరాయిజాతివాడినా? కోతిననా? నీ బంధువుల సరసన విందుకు పంక్తికి ఆహ్వానము లేదా?” అని; లక్ష్మణ దేవర నవ్వు – జానపద గేయ రామాయణములో హనుమంతుడు వానర జాతిగా బాధపడ్డాడు. సాక్షాత్తు శివుడు అంశగ రామ సహాయార్థము భువిలో అవతరించాడు. కోతి గుణాలు హనుమంతునిలో చూడడం జానపదులకు యిష్టమని ఉద్దేశ పడకూడదు. మనోడే పరవాలేదు అనే నానుడి జాతి, బంధుత్వాన్ని చులకన చేయడం ఉంది. అన్యాపదేశంగా భక్తి ప్రపత్తులతో కనిపిస్తోంది. హనుమ ఆకృతిని కలిగి ఉన్న వానరములు ధన్యజీవులు. ఆ దైవాకృతిగ మనవాడుగ సకలజీవరాశి పరమాత్మకు చెందిన హనుమజాతిగ మానవులను ప్రబోధిస్తూ మనలోని వానరబుద్ధిని ఉదాహరణ కోసం ఎత్తిచూపిన రామకథది.
వడ్డించేవాడు మనవాడే అయితే చివరి పంక్తిలో కూర్చున్నా పరవాలేదు. అసలు బంతిభోజనానికి పిలవడం మరిచిపోతే కోపమొస్తుంది. మనమేమిటో చెప్పటానికి ముఖకవళికలలో అసహనం ద్వారా వ్యక్తం చేస్తాము. ప్రసన్నం చేసుకోక తప్పదు. మనోడివన్న భావనలో పట్టించుకోలేదు తప్ప నువ్వు ఆత్మీయుడివి అని అనిపించుకునేదాకా వదిలిపెట్టకపోవడం మన లక్షణం. ఇవి అన్యాపదేశంగ హనుమంతునికి అన్వయించి మనలోని కోతిలక్షణాలుగ విడిచిపెట్టి పరమాత్మ దర్శనానికి తహతహపడే జానపద మనస్తత్వముగ చక్కని కథ.
సీతారాములు వనవాస సమయమది. అది ఒకరోజు రాత్రి సమయము. సకలజగత్తు నిద్రావస్థలో ఉంది. లక్ష్మణుడు మాత్రము పర్ణశాల బయట కాపలా కాస్తున్నాడు. నిద్రాదేవి అతడిని ఎంత ఆవహిద్దామని ప్రయత్నించినా భంగపడుతోంది. అసమర్థురాలినైపోయానని కోపమొచ్చింది. ఉక్రోషం స్త్రీ సహజదుఃఖము ప్రదర్శించింది.. నిద్రాదేవి ఆకారము దాల్చింది.
బిగ్గరగా ఏడుస్తూ లక్ష్మణునికి కనిపించింది. “మహానుభావా! ఇది సృష్టి విరుద్ధము. నేను దుఃఖము ఆపుకోలేకపోతున్నాను. నన్ను నిరోధించి విధాత నాకిచ్చిన నిద్రావేశపరమార్థాన్ని అవమానపరచావు. ఎంత గొప్పవాడివైనా విధి కార్యానికి అడ్డుపడే ఈ నిరోధానికి శిక్ష అమలుచేసే శక్తి విధి నాకిచ్చాడు. అమలుపరిచి తీరాలి. నీకు మెలుకువ అన్నదే లేకుండా చేస్తాను. నన్ను క్షమించు” అంది
లక్ష్మణుడు “తల్లీ! నాకు నిద్ర లేకుండా చేయడమన్నది కూడ నీకు విధి నిర్ణయాధికారముండదు. నా అన్నావదినలు నిద్రపోతున్నారు. వారి సేవకు నేను అంకితము. నిద్రాభంగము కలుగరాదు. దుష్టరాక్షసుల నుంచి ప్రమాదము రావచ్చు. ఈ నా కర్తవ్యము వనవాసము పూర్తయేంత వరకు కంకణము కట్టుకున్నాను. నా భార్య అయోధ్యలో ఉంది. నీ కర్తవ్యదీక్ష గొప్పది. భువనరక్ష. ప్రస్తుతం నా కర్తవ్యదీక్షకు భంగం కలిగించకు. నన్ను వదిలి నా భార్య నావహించు. నేను అయోధ్యకు వచ్చాక మాత్రమే నా భార్యకు మెలుకువ ప్రసాదించు. నన్ను సమీపించి ఆవహించి శిక్షవేసిన తృప్తి నీకు కలిగి కర్త్యవ్యనిర్వహణదోషము నిన్నంటదు. నీ సృష్టిధర్మాన్నిప్రస్తుతం ఎందుకు అడ్డుకోవాలో నీకు తెలుసు. నేను గౌరవిస్తాను. ప్రస్తుతానికి నా భార్య ఊర్మిళను కూడా అన్నావదినల సేవలో భాగస్వామిని చేయి” అన్నాడు
“భువన రక్షణకు రామావతారపరమార్ధ కారణజన్ముడివి. నీ దృఢ దీక్ష గొప్పది. ఊర్మిళది పతిసేవగా ఆమె నిద్ర పేరుకెక్కుతుంది. వెళుతున్నాను. ఊర్మిళా లక్ష్మణులు చిరకీర్తి నార్జిస్తారు’’ అని “అయోధ్య వెళ్ళి ఊర్మిళను ఆవహిస్తాను” అంది. నిద్రాదేవి ఊర్మిళకు విషయం చెప్పింది. భర్త తిరిగి అయోధ్య వచ్చేవరకు ఊర్మిళ లక్ష్మణుని నిద్ర సమయాన్ని స్వీకరించింది. రాముడు పట్టాభిషేకము జరిగింది. ఊర్మిళ లేచింది. రావణ సంహారమైంది. రాముడు పట్టాభిషిక్తుడై సభ చేస్తున్నాడు. సభలో ఉండగా వనవాస సమయాన కన్నీరు పెట్టుకున్న నిద్రాదేవి ఇపుడు నవ్వుతూ కనిపించింది. లక్ష్మణుడు కూడా అరణ్యవాసములో యిచ్చిన మాట గుర్తు వచ్చి తాను కూడ పెద్దగా నవ్వాడు. అక్కడికక్కడే నిద్రాదేవి కనుమతిచ్చాడు. నిద్రకుపక్రమించాడు. నిండుసభలో ఆసనము మీదే నిద్రకు జారుకున్నాడు. అతని నవ్వు చూసి అందరూ రాముడు, సీత కూడా పరిపరివిధాల భావించారు. ఆ నవ్వు పరిహాసము. నవ్వు నాలుగు విధాలచేటుగ సామెత నిలిచింది.
మెలుకువ వచ్చి లక్ష్మణుడు చేసిన నిద్రాత్యాగము విని రాముడు పరవశించి పోయాడు. ఊర్మిళా, లక్ష్మణుల త్యాగము అందరికీ తెలియబరుస్తూ గొప్ప విందు చేసాడు. బంధు సామంత హిత సర్వ ప్రజానీకము పంక్తిలో అందరూ కూర్చున్నారు. హనుమకు వడ్డన పని అప్పచెప్పారు. ఆ తరువాత కూడహనుమను పట్టించుకోలేదు. “నేను వానరుడిని. పంక్తిబాహ్యుడిగ వివక్ష చూపావు. రామా! మీ వాడిని కాదా? జాతిని ఎత్తి చూపావా?” అని నొచ్చుకున్న హనుమ దూరంగా వెళ్ళిపోయాడు.
రాముడు, మిగిలిన అందరూ హనుమ భోజనం చేయలేదని తెలుసుకుని హనుమ వద్దకు వచ్చి బ్రతిమలాడారు.. రాముడు “నువ్వు నా వాడివి. నువ్వు లేనిదే నేను సీత లేము” అని భోజనపళ్ళాన్ని పట్టుకొచ్చి స్వయంగా తినిపించబోయాడు. వానర చేష్టలతో అందకుండా ప్రవర్తించాడు. అయినా పరమాత్ముడు వెంటబడ్డాడు. విచిత్రమైన మలుపుగ హనుమ దగ్గరలో ఉన్న అవిసి చెట్టెక్కాడు.
రాముడు చెట్టుక్రింద చేరి పళ్ళాన్ని అందించాడు. అందుకున్నాడు. కాని తినకుండా విసిరి కొట్టాడు. “పొత్తున కూర్చుండ తగను” అని పల్లిగిలించాడు. రాముడు నవ్వి “నీ స్థానమిక్కడ” అని హృదయము రాముడు చూపగానే చెట్టు దిగి వచ్చి అలకమానాడు.
మనోడే పరవాలేదు అని లోకువ చేసామని క్షమాపణ చెప్పడం, అలిగి చెట్టెక్కావు, దిగిరా అని దగ్గరవారిని సమర్ధించడం హనుమకథగా జానపద మనస్తత్వం వానరబుద్ధిగా కాదు. హనుమ రూప వానరులము తోటివారిపట్ల వానర ప్రవర్తన సందేశాన్ని చాటుతున్నాయి. సకలజీవరాశులు పరమాత్మ హృదయావాసులే అని రాముల వారి అనుగ్రహముగ ప్రేమాభిమానాలు మానవత్వము. హనుమంతునిగా వానర మనస్తత్త్వానికి స్వస్తి చెప్పిస్తున్న పారమార్థిక కథ యిది.