వెయ్యి వేషాల్

3
4

[dropcap]పు[/dropcap]లివి అయ్యీ-పుట్ర చూపీ
వెయ్ వేషం-వెయ్ వేషం

చిలక వయ్యీ-పలుకు నేర్చీ
వెయ్ వేషం-వెయ్ వేషం

అన్న వయ్యో-ఆవు వయ్యో
వెయ్ వేషం-వెయ్ వేషం

వగలు చూపీ-సెగలు రేపీ
వెయ్ వేషం-వెయ్ వేషం

లగువు నేర్చో-బిగువు చూపో
వెయ్ వేషం-వెయ్ వేషం

హొయలు చూపో-లయను మార్చో
వెయ్ వేషం-వెయ్ వేషం

కోట కట్టీ-కోత పెట్టీ
వెయ్ వేషం-వెయ్ వేషం

మూత పెట్టీ-ముసుగు వేసీ
వెయ్ వేషం-వెయ్ వేషం

మాటలలో-మసిని పూసి
వెయ్ వేషం-వెయ్ వేషం

ఏడిపించీ-ఏడ్చి వెళ్ళీ
వెయ్ వేషం-వెయ్ వేషం

మఠం కట్టీ-పుఠం పెట్టీ
వెయ్ వేషం-వెయ్ వేషం

మాల వేసీ-మతం చూపీ
వెయ్ వేషం-వెయ్ వేషం

దయను చూపీ-దారి మార్చీ
వెయ్ వేషం-వెయ్ వేషం

చూడనట్టే-చూసి వెళ్ళీ
వెయ్ వేషం-వెయ్ వేషం

జాలి చూపే-జలగ వయ్యీ
వెయ్ వేషం-వెయ్ వేషం

నాప వైనా-నంగి వైనా
వెయ్ వేషం-వెయ్ వేషం

వెయ్ వేషం-వెయ్ వేషం
వెయ్ వేషం-
వె..య్ …య్ యి
వ్వే….షాల్….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here