[dropcap]క[/dropcap]రుణించు తల్లీ! మహంకాళీ
భక్తి శ్రద్దలతో నిన్ను
కొలిచెదమమ్మా! సింహవాహినీ
ప్రీతి పాత్రమైన బోనాలతో
క్రొత్తగా చేసిన ఘటాలతో
వేపాకు,పసుపు,కుంకుమలతో
కోటి కాంతుల ప్రమిదలతో
మ్రొక్కెదమమ్మా! శాంభవి
మా ఇంటి ఆడపడుచువి
మా కంటి ఇలవేల్పువి
మము కాపాడ రావమ్మా!
నాడు దుష్టులను శిక్షించి
మము రక్షించినావు
వరదలనుండి ఒడ్డు చేర్చినావు
గుత్త వ్యాధులనుండి బ్రతికించినావు
నేడు ‘కరోనా’ నుండి కాపాడినావు
లాల్ దర్వాజా శాకాంబరి
కర్షకులు, కార్మికులు
సామాన్యులు సైతం
స్వేద బిందువులను నూనెగా మలచి
కాయ కష్టాన్ని వత్తిగా చేసి
దూప,దీప,నైవేద్యాలతో
ఆర్తిగా నీకు హారతులనిచ్చి
విశ్వ శాంతికై నిన్ను వేడుకుంటున్నారు
కరుణించు తల్లీ! మహంకాళీ
లాల్ దర్వాజా సింహవాహినీ!