రోజూ భయమే..

0
3

[dropcap]చీ[/dropcap]కటి పడాలంటే
రాత్రికి భయం
ఏ క్రూరత్వం మనిషిలో
ఏ రూపంలో నిద్రలేస్తోందోనని..

తెల్లవారాలంటే
పగటికి సిగ్గు
ఏ నీచత్వం ఎక్కడ బయటపడి
లోకం తలదించుకోవాలోనని..

రోజు గడిచేకొద్దీ
భూమికి గుండెల్లో బరువు
మనిషిని మోసే శక్తి సన్నగిల్లి
ఎప్పుడు కుప్పకూలుతానోనని..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here