సంచిక – పద ప్రతిభ – 33

0
4

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పార్వతి (5)
4.  ఇంద్రుని గుఱ్ఱము (5)
7. ఆద్యంతాలు లేని హరునికిక్కడ ఆది ఉంది అంతంలేదు (3)
8. —— బడిపంతులుద్యోగమని అప్పట్లో చెప్పేవారు.  ఇప్పుడు కాదులెండి. (5)
9. కాశీనాథుని నాగేశ్వరరావు గారి బిరుదు – మధ్యలో తేలికయ్యింది (5)
10. సమాచారం (3)
12. వత్తు లేని శ్రీవారి ప్రసాదం అటునించి ఆమ్రేడితమయింది (4)
14. పొడవైన (4)
15. రాజధాని చెల్లాచెదరైనది (5)
16. అడిగేవాడికి వీడు లోకువట (4)
18. నూఱున్న ఒక నక్షత్రము (4)
21. దీపాధార పాత్ర / సువాసనలిచ్చే తెల్లని పువ్వు (3)
23. పుట్టపుట్టువు నోటినుండి పుట్టిన మహా కావ్యము కకావికలైనది (5)
24. సీత దాటిన గీత (5)
25. ఈ రేఖ వంకరకానిదే కానీ అటునించి గీసుకు రండి (3)
26. వ్యవసాయము (5)
27.ప్రళయమును తనలో దాచుకునేటప్పటికీ ఈ పాఠశాల కాస్తా గజిబిజిగా తయారైంది (5)

నిలువు:

1. సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్ అంటూ 1978లో జనాలని ఉర్రూతలూగించిన జయమాలిని పాట ఈ సినిమాలోనిదే (5)
2. అలవాటుపడు (5)
3. హిందీలో ఒట్టు పెట్టుకున్న సింహము (4)
4. మంత్రమును నేర్పించడానిని ఇలా అంటారు (4)
5. నమ్మకము కలవాడు (5)
6. స్వర్గ మర్త్య పాతాళములు (5)
11.నవ్వి పోదురుగాక నాకేటిసిగ్గు అని నిర్మొహమాటంగా చెప్పిన కవి (5)
13. సీతమ్మవారి కొడుకు (3)
14. ఆసలేమి (3)
16. చివర తెగిన సముద్రపు గట్టు (5)
17. అరటిచెట్టు – బుస కొట్టేను జాగ్రత్తండోయ్ (5)
19. దానము చేస్తుంటే ముందరది చివరికెళ్లింది (5)
20. ఈ రాగం కుమారస్వామికిష్టమైనదా?! (5)
21. హంస (4)
22. గోపురము మీద శిఖరము (4)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 అక్టోబరు 25 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 33 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 అక్టోబరు 30 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 31 జవాబులు:

అడ్డం:   

1.శంకరమంచి 4. సూర్యకుమారి 7. వంరత 8. రాజనములు 9. కలిలబాజ/కబాలలిజ 10. విభేము 12. సంగముతో 14. సుముఖుడు  15. సరళములు  16. భారూపము  18. భానుమతి  21. అట్టుక  23. తముపఊద / తఊపముద  24. లుకలుకలు  25. వలువ  26. త్నరకర్శద  27. ముసుగువఁడు

నిలువు:

1.శంకరావాసం 2. రసోనకము 3. చివంలువి 4. సూతకము  5. కువలయము  6. రిపుంజయుడు 11. భేతాళభట్టు 13. తోసము 14. శులుభా 16. భారతరత్న 17. పక్షపత్రిక 19. నుడులువాగు/నువాలుడుగు 20. తిప్పలుపడు  21.  అ ద వ ద  22. కలువము

సంచిక – పద ప్రతిభ 31 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ఎర్రొల్ల వెంకట్‌రెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమటి సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్.మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వెంకాయమ్మ టి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here