స్ఫూర్తిదాయక మహిళలు-4

0
4

(పిల్లల కోసం స్ఫూర్తిదాయక మహిళల కథలను అందిస్తున్నారు శ్రీమతి డి. చాముండేశ్వరి.)

తొలి భారతీయ మహిళా ఇంజనీరు అయ్యలసోమయాజుల లలిత

[dropcap]స్కూ[/dropcap]ల్ హోమ్ వర్క్ త్వరగా పూర్తి చేసుకున్న సాత్విక డైనింగ్ టేబుల్ మీద డిన్నర్‌కి కావాల్సిన ఏర్పాట్లు అమ్మతో కలిసి చేసింది. మెడిటేషన్ అయ్యాక అమ్మమ్మ వచ్చి కూర్చున్నారు.

“హుర్రే! అమ్మమ్మా! నేను రెడీ స్టోరీ వినటానికి” అంది సాత్విక.

“గుడ్! అన్నం తింటూ విను” అంటూ అమ్మమ్మ కంచంలో వడ్డించారు.

మనం కూడా విందామా?

“సాత్వికా! 100 ఏళ్ళ క్రితం మనదేశంలో ఫస్ట్ ఇంజినీరింగ్ చదివిన ఒక గొప్ప అమ్మాయి పుట్టింది.”

“ఇంజినీర్? అంటే అమ్మ లానా?”

“అవును. సాత్వికా, అప్పటి రోజుల్లో బాలికల విద్య ఎంత కష్టమో విన్నావు కదా! ఈ అమ్మాయి కూడా చాల కష్టపడి, ఇష్టంగా బాలురకి మాత్రమే అనుకున్న కోర్స్‌ని వాళ్ళతో పోటీపడి చదివింది. చెయ్యాలనే కోరిక ఉంటే ఏది ఆపలేదు. తెలుసా?”

“అమ్మమ్మా! ఆ అమ్మాయి పేరేంటి? ఏ వూరు?”

“1919 ఆగస్టు 27న మద్రాసులో అంటే నేటి చెన్నైలోని ఒక తెలుగు కుటుంబంలో పుట్టారు లలిత. తండి పప్పు సుబ్బారావు ఇంజనీరింగ్ ప్రొఫెసర్. ఆమె కన్నా నలుగురు పెద్ద, ముగ్గురు చిన్నవారు తోబుట్టువులు ఉన్నారు. స్కూల్లో చదువుకుంటుండగానే, 15 ఏళ్ల వయసుకే 1934లో లలితకు పెళ్లి చేశారు. ఆ తర్వాత స్కూల్ కి వెళ్లినా పదో తరగతి తర్వాత ఆమె చదువు ఆపేశారు.”

“అయ్యో! ఎందుకు ఆపేశారు? మరి నువ్వు ఆవిడ ఫస్ట్ ఇంజినీరింగ్ చెదివిన అమ్మాయి అన్నావు? అమ్మమ్మా, అప్పుటి రోజుల్లో 10th చదివితే ఇంజినీర్ అనేవాళ్లా?” అంది సాత్విక అమాయకంగా.

“నో డియర్. అలాంటిదేమి లేదు. ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. అదీ కాక లలితకి పాప పుట్టింది. అందుకని పాప కోసం చదువు మానేసింది. 1937లో శ్యామల పుట్టింది లలితకి. కూతురు పుట్టిన నాలుగు నెలలకే పాపం ఇద్దరికీ షాక్. లలిత భర్త చనిపోయారుట. తండ్రి, సోదరుల ప్రోత్సాహంతో క్వీన్ మేరీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత కుటుంబసభ్యులు పని చేస్తున్న కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ గిండీలోనే (సి.ఈ.జి) 1940లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో చేరారు.”

“wow! గ్రేట్. లలిత చదువుకున్నారోచ్” అంది సాత్విక

“నీకు తెలుసా సాత్వికా? అసలు, అమ్మాయిలే ఇంజనీరింగ్ కాలేజీల్లో లేని ఆ కాలంలో ముగ్గురు అమ్మాయిలు సి.ఈ.జిలో చదువుకున్నారు. లీలమ్మా జార్జ్, థెరిస్సా సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో లలితకు జూనియర్లుగా చేరినా రెండో ప్రపంచ యుద్ధం వల్ల ముగ్గురూ 1943లోనే ఇంజనీరింగ్ పట్టా పొందారు.

వందల మంది అబ్బాయిలున్న కాలేజీలో ఏకైక అమ్మాయిగా తన తల్లికి పెద్దగా ఇబ్బందులేం ఎదురవలేదని, లలిత కోసం హాస్టల్ అధికారులు ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారని శ్యామల చెప్పారట.”

“అమ్మమ్మా! లలిత ఇంజినీరింగ్ డిగ్రీ తీసుకున్నాక ఇంట్లోనే ఉండిపోయారా?”

“లేదు లేదు. డోంట్ వర్రీ. మీ అమ్మలా ఆఫీస్‌కి వెళ్లి జాబ్ చేశారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం లలిత 1943లో ఒక ఏడాది పాటు జమల్‍పూర్ రైల్వే వర్క్-షాప్‌లో పనిచేశారు. దేశంలో అతి పెద్ద రిజర్వాయర్లలో ఒకటైన భాక్రా నంగల్ డామ్‍కి కావాల్సిన ఎలక్ట్రికల్ జనరేటర్ల మీద ఆమె పని చేశారు.

అంతర్జాతీయ సమావేశాల్లో ఇండియాను ప్రపంచ మ్యాప్ మీద నిలబెట్టిన వారు లలిత.

ఆమె 1953లో ఇన్‍స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ (IEE), లండన్ కౌన్సిల్‌లో అసోసియేట్ మెంబర్‍గా, ఆ తరువాత 1966లో పూర్తి స్థాయి మెంబర్‍గా ఎన్నికయ్యారు.

Women in Engineering Affinity Group అనే గ్రూప్ ద్వారా 2019లో ఆమె పేరు మీద IEEE హైదరాబాద్ విభాగం ‘లలిత మెమోరియల్ లెక్చర్’ నిర్వహించింది.. పంజాబ్‍లోని ప్లక్షా యూనివర్సిటీలో ‘అయ్యల సోమయాజుల లలిత ఫండ్’ ఏర్పాటు చేసి ఎక్కువమంది గర్ల్స్ విమెన్ టెక్నికల్, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ చదివేలా చూస్తున్నారుట. మంచి పని.

సాత్వికా Female graduates in science, technology, engineering, and math అనే విషయం లో మన దేశం 43% తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. but authors గా 15th place.

లలిత జీవితం మనకి స్ఫూర్తిదాయకం. 18వ ఏటనే భర్తను పొగొట్టుకోవడం దారుణమే. అయినా, ఆమె భయపడలేదు. తన కాళ్ల మీద తాను నిలబడాలి అనుకున్నారు. తన పాపకి మంచి చదువు, జీవితం ఇవ్వాలని అనుకున్నారు. అందుకు, ఆనాటి పరిస్థితుల్లో కష్టమైన ఇంజనీరింగునే సెలెక్ట్ చేసుకున్నారు. తండ్రి, సోదరుల ప్రోత్సాహంతో డిగ్రీ చేయగలిగినా, చిన్న పాపను చూసుకుంటూ ఆనాటి ఎలక్ట్రికల్ కంపెనీల్లో పెద్ద పెద్ద జాబ్స్ చేసి మగ వాళ్ళతో పోటీపడి గెలిచారు. ఫామిలీ సపోర్ట్ చాలా ఉందిట. సాత్వికా ఎడ్యుకేషన్ అంటే ఒక గొప్ప అవకాశం. దొరికితే ‘నాట్ నౌ’ అని వదల కూడదు. చదువు మన ఆలోచనల్ని, జీవితాన్నే కాదు ప్రపంచాన్ని చూసే విధానం, అర్ధం చేసుకునే విధానాన్ని సానుకూలంగా మారుస్తుంది. సో ఎడ్యుకేషన్ అంటే ఫ్యాషన్ కాదు. passion. ఏదో చదువుకుంటే ‘అవసరానికి పనికొస్తుందిలే’ అనకూడదు.

నీకు తెలుసా? చదువుకోవాలి. మీకు నచ్చిన ఇష్టమయిన కోర్స్. అలాగే బద్ధకంగా ఉండకుండా ఉద్యోగం చెయ్యాలి. జాబ్ creator కావాలి. స్త్రీలకి ఆర్థిక స్వాత్రంత్య్రం అవసరం.

మీ అమ్మా, అత్తా, నేను అందరం పని చేస్తున్నాము. మీరు కూడా బాగా చదువుకోవాలి.

నా బంగారు తల్లి. చదివి గ్రేట్ పర్సన్ అవుతుంది కదా?” అన్నారు అమ్మమ్మ కొంచం ఆవేశంగా.

“సరే అమ్మమ్మా” అంటూ డిన్నర్ ముగించిన సాత్విక “thanks for the yummy dinner! అమ్మా, అమ్మమ్మ” అంటూ ప్లేట్ సింక్ లో క్లీన్ చేసి పక్కన పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here