[dropcap]నీ[/dropcap] చూపుల చక్కిలిగిలికి
నలిగిపోతున్నా
నీ చెక్కిలి నొక్కులకు
ఉక్కిరి బిక్కిరినవుతున్నా
నీ సౌందర్యం సలుపులకు
సలసల మాడిపోతున్నా
నీవు పద్మదళ
ఉషా జనితవై ప్రభవించినట్లు
నీవు రసచరణ
రవళివై ప్రవచించినట్లు
గుండెను హత్తుకున్న గుబాళిక
నీకై అక్షర హంసలా
ఎగిరొస్తున్నా.. నిను పట్టుకెళదామని